India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

J. పంగులూరు మండలంలోని చందలూరు గ్రామ పంచాయతీకి ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ పంచాయతీ సుమారు రూ.1,10,00,000 వరకు బకాయి ఉంది. గ్రామ పంచాయతీకి విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులలో 20 శాతం విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లిస్తామని అధికారులకు చెప్పినా.. సరఫరా నిలిపివేశారని సర్పంచ్ పెంట్యాల కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సుపై చెప్పు విసిరిన ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం శనివారం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

ఇంటి, నీటి పన్నుల వసూళ్లలో పులివెందుల మొదటి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ కమిషనర్ తెలిపారు. జిల్లాలో పన్ను వసూళ్లలో పులివెందుల 83.90%తో ప్రథమ స్థానంలో నిలిచింది. కడప 82.8% ద్వితీయ స్థానం, ఎర్రగుంట్ల 77.30 % మూడో స్థానాల్లో ఉన్నట్లు కమిషనర్లు తెలిపారు. మున్సిపల్ సచివాలయ ఉద్యోగుల కృషితో, వినియోదారుల సహకారంతో పన్ను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 1,54,798 మంది రైతుల నుంచి 4,49,181 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదివారం తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు గాను రూ.980.56 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రైతులకు రవాణా ఇతర ఖర్చులు కూడా ఇందులోనే చెల్లించామని పేర్కొన్నారు.

కాకుమాను మండలంలోని వల్లూరులో ఓ వ్యవసాయ కూలీ నూర్పిడి యంత్రంలో పడి మృతి చెందాడు. వట్టిచెరుకూరు మండలం కారంపూడి పాడుకు చెందిన నరసింహ (20) కూలీ పనుల నిమిత్తం వల్లూరు వచ్చాడు. ఆదివారం నూర్పిడి యంత్రంలో కోత కోసిన శనగ పంట వేస్తుండగా పొరపాటున లోపలికి పడిపోయాడు. తోటి కూలీలు వెంటనే అతన్ని పైకి లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం రాత్రి పార్టీ అధినేత చంద్రబాబుతో భేటి అయినట్లు తెలుస్తోంది. జోన్-2 ఇన్‌ఛార్జి సుజయ్ కృష్ణ రంగారావుతో కలిసి బాపట్లలో సీబీఎన్‌ను కలిశారు. అనపర్తి టికెట్ మార్పుతో TDP శ్రేణుల్లో భావోద్వేగ పరిస్థితులను వివరించారని సమాచారం. నల్లమిల్లిని వదులుకునే ఉద్దేశం లేదని, ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి న్యాయం చేస్తానని సీబీఎన్ హామీ ఇచ్చారట.

అమెరికాలోని పోర్టులాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ బాలిక మృత్యువాత పడింది. పెనుగ్రంచిపోలు మండలం కొణకంచికి చెందిన నరేశ్, గీంతాంజలి దంపతులు జాబ్ నిమిత్తం 10ఏళ్లుగా USలో ఉంటున్నారు. ఈ క్రమంలో కారు ప్రమాదానికి గురై వారి కుమార్తె హానిక(6)మృతిచెందింది. తల్లి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కొణకంచిలో విషాధాన్ని నింపింది.

డీఎస్సీ విషయంలో అంతా సీఎం జగన్ అనుకున్నట్లే జరిగిందని భీమిలి టీడీపీ MLA అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావు విమర్శించారు. ఐదేళ్లపాటు నిద్రపోయి ఎన్నికల ముందు కోడ్ వస్తుందని తెలిసి అడ్డగోలు నిబంధనలతో డీఎస్సీ ప్రకటన ఇచ్చారని ట్విటర్ లో పేర్కొన్నారు. టెట్, డీఎస్సీ శిక్షణ కోసం నిరుద్యోగులు వేలాది రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. జగన్ కుట్ర అందరికీ అర్థమైందని అన్నారు.

కర్నూలు జిల్లా పీవో, ఏపీవో శిక్షణ తరగతులకు పలువురు గైర్హాజరు కావడంపై కలెక్టర్ సృజన సీరియస్ అయ్యారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్తికొండ నియోజకవర్గంలో 16 మంది, ఎమ్మిగనూరులో 12 మంది, ఆలూరులో తొమ్మిది మంది, మంత్రాలయంలో ఏడుగురు.. మొత్తంగా 44 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

ఏలూరు జిల్లాలో ఓ వైద్యుడు మత్తు ఇంజక్షన్స్ ఇస్తూ చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. చొదిమెళ్లకు చెందిన భానుసుందర్ MBBS చదివాడు. తపాలా శాఖలో రిటైర్డ్ ఉద్యోగి మల్లేశ్వరరావు(63)తో సన్నిహితంగా ఉండేవాడు. గత DEC 24న మల్లేశ్వరరావు ఇంట్లో ఉండగా.. భానుసుందర్ వెళ్లి మత్తు ఇంజక్షన్ ఇచ్చి డబ్బు, నగలతో ఉడాయించాడు. ఇలాంటి కేసులు ఆ వైద్యుడిపై చాలానే ఉండగా.. మల్లేశ్వరరావు మృతితో అతడి తతంగం బయటపడింది.
Sorry, no posts matched your criteria.