India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేసును హైకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. అన్యాయంగా తొలగించారని తన కేసు తేలాకే కొత్త ఎండీ, సీఈఓ నియామకం నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలనీ పాత ఎండీ జార్జి విక్టర్ కేసు వేశారు. ఆ మేరకు నియామకంపై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలని డీసీఐ వాదించింది. ఈ కేసులో తీర్పును ఏప్రిల్ 11న వెలువరిస్తామని విచారణను హైకోర్టు వాయిదా వేసినట్టు డీసీఐ వర్గాలు తెలిపాయి.

నంద్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ CM వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట చేపట్టిన బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో CM జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం రేపు ఎమ్మిగనూరులో నిర్వహించే ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో CM పాల్గొననున్నారు.

వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ ఆపుకొని టైర్లలో గాలి చెక్ చేస్తున్నాడు. అదే సమయంలో మినీ లారీ వ్యాను వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ఘటనా స్థలానికి ఉదయగిరి సిఐ గిరిబాబు, ఎస్సై తిరపతయ్య చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తిరుపతిలో టీడీపీ నేత కోడూరు బాలసుబ్రమణ్యం ఇంట్లో 15 మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగారు. ఆయన మాట్లాడుతూ.. 15 మంది అధికారులు తమ ఇంట్లో సోదాలు చేయడం బాధాకరమన్నారు. తమ లాంటి వ్యక్తులపైనే దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి కొత్తగా నాలుగు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశీయ సర్వీసుల్లో ఈ నెల 31 నుంచి విశాఖపట్నం–ఢిల్లీ మధ్య ఎయిర్ ఇండియా, విశాఖపట్నం–హైదరాబాద్ మధ్య ఇండిగో విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ సర్వీసుల్లో విశాఖ–బ్యాంకాక్(థాయ్‌లాండ్) విమానం ఏప్రిల్ 9 నుంచి, విశాఖ–కౌలాలంపూర్ (మలేసియా) విమానం ఏప్రిల్ 26 నుంచి మొదలవుతుంది.

ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయకుండా, ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని కలెక్టర్ కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. బుధవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ ను ప్రతి ఒక్కను పాటించాలన్నారు.

కర్నూలు: BSNL కాపర్ ద్వారా అందిస్తున్న ల్యాండ్ లైన్ వాయిస్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా ఫైబర్‌లోకి మార్చే ప్రక్రియ కొనసాగుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ కర్నూల్ బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ జి.రమేష్ తెలిపారు. ప్రకాష్ నగర్‌లోని బీఎస్ఎన్ఎల్ భవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఫైబర్‌లోకి మారితే కేవలం రూ.199కే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 1 జీబీ డేటాను 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పొందవచ్చని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. బుధవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్‌లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన నివేదికలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు విడుదల చేసే మేనిఫెస్టోను ప్రజలు ఎవరు నమ్మవద్దని సీఎం జగన్ కోరారు. సిద్ధం సభలో సీఎం ప్రసంగిస్తూ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ చెప్పిన మేనిఫెస్టోను 99% నెరవేర్చినట్లు సీఎం పేర్కొన్నారు. మేనిఫెస్టోను రాజకీయ పార్టీలు పవిత్రమైన గ్రంథంగా భావించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సాధించడానికి మేము సిద్ధం అని పేర్కొన్నారు.

సీఎం జగన్ గురువారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరపురం నుంచి వచ్చే వాహనాలు టౌన్‌లోకి అనుమతించకుండా హైవే మీదుగా డైవర్షన్ చేయాలన్నారు. చామకాలువ నుంచి ఫ్లైఓవర్ మీదుగా బొమ్మల సత్రం, క్రాంతి నగర్‌లకు వెళ్లే వాహనాలను రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా మళ్లించారు. ఈ విషయాలను గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.