Andhra Pradesh

News April 25, 2025

30 నుంచి VSUలో టోర్నమెంట్

image

కాకుటూరు దగ్గర ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఈనెల 30 నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బందితో వీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి ప్రతినిధులు వస్తారని చెప్పారు. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

News April 25, 2025

పంచాయతీరాజ్ పాత్ర కీలకమైంది: కర్నూలు కలెక్టర్

image

గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు.

News April 25, 2025

మార్కాపురం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు

image

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని మార్కాపూరం పట్టణ ఎస్సై సైదు బాబు హెచ్చరించారు. గురువారం పట్టణ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఆయన గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని హితవు పలికారు. ఏవరైనా ఇలా దోరికితే కఠిన చర్యలు ఉంటాయని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

News April 25, 2025

రాజనగరం: భారతదేశం ఆకృతిలో వైద్య విద్యార్థులు

image

కశ్మీర్లో ఉగ్రవాదుల దురాగతానికి బలైపోయిన పర్యాటకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల మైదానంలో వైద్య విద్యార్థులు కొవ్వత్తులతో గురువారం రాత్రి మౌన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ‘భారతదేశం ఆకృతి’లో వారంతా మానవహారంగా ఏర్పడి, ‘మనం భారతీయులం – మనది అఖండ భారతం’ అంటూ హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళం, ఒరియా, బెంగాలీ భాషలలో ఉద్వేగంగా నినాదం ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావాన్ని తెలిపారు.

News April 25, 2025

విశాఖలో 97 మంది పోలీసులకు రివార్డులు

image

విశాఖ నగర పరిధిలో ప్రతిభ కనబర్చిన 97 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి గురువారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెల రివార్డులను అందజేస్తున్నారు.

News April 25, 2025

కడప: మోదీ అంటే ఏంటో పాకిస్తాన్‌కి తెలుస్తుంది: ఎమ్మెల్యే

image

కడప జిల్లా యర్రగుంట్ల మండలంలో MLA ఆదినారాయణరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పాకిస్థాన్ పైన తీవ్రమైన చర్య ఉంటుందని ప్రపంచం మొత్తం బారత్‌కు మద్దతు ఇస్తోందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నుంచి 3 కోట్లకు పైగా కశ్మీర్‌లో పర్యాటకులు సందర్శించారన్నారు. 22 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్‌కు అంత ఉంటే 140 కోట్లు ఉన్న మనం ఏంటో ఆర్మీ శక్తి, ప్రధాని మోదీ అంటే ఏంటో పాకిస్థాన్‌కు తెలుస్తుందన్నారు.

News April 25, 2025

మలేరియా అంతం మనతోనే: DMHO దేవి

image

ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా, DMHO కార్యాలయంలో జిల్లా వైద్యాధికారిణి దేవి మలేరియా అంతం మనతోనే’ అనే గోడపత్రికను ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది& మునిసిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పరస్పర సహకారంతో DMHO గురువారం అవగాహన నిర్వహించారు. మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ కల్పించాలని తెలిపారు.

News April 25, 2025

కాణిపాకంలో సెక్యూరిటీ కట్టుదిట్టం

image

ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కాణిపాకంలో సెక్యూరిటీ కట్టుదిట్ట చేశారు. భక్తుల బ్యాగులను సిబ్బంది క్షుణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన భక్తుల గురించి వివరాలు ఆరా తీశారు. కాణిపాకంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News April 25, 2025

GNT: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కమిషనర్

image

గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి.సాయి కల్యాణ్ చక్రవర్తిని గురువారం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి వెళ్లి కమిషనర్ మొక్కను బహుకరించారు. నగరపాలక సంస్థ పరిధిలోని అభివృద్ధి పనుల్లో భాగంగా స్థలసేకరణలో ఇళ్లు కోల్పోయి కోర్టులో దాఖలైన కేసుల‌పై ఈ సందర్భంగా వారు చర్చించారు.

News April 25, 2025

భీమవరం: విద్యార్థులను సత్కరించిన కలెక్టర్ 

image

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థులు అభినందనీయులని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం కాళ్ల మండలం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన 10 మంది విద్యార్థులకు మెమొంటోలు అందజేసి సత్కరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.