Andhra Pradesh

News April 25, 2025

NLR: నేటి నుంచి నోషనల్ ఖాతాల స్పెషల్ డ్రైవ్

image

నెల్లూరు జిల్లాలో 95వేలకు పైగా ఉన్న నోషనల్ ఖాతాల పరిష్కారానికి ఈనెల 25 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. 1,84,288 సర్వే నంబర్లలోని 95,065 నోషనల్ ఖాతాలకు సంబంధించి రోజూ జిల్లాలోని నాలుగు డివిజన్ల నుంచి రెండేసి మండలాల చొప్పున పరిశీలిస్తారు. రోజూ 8 మండలాల నోషనల్ ఖాతాలను పరిశీలించి రైతుల సమస్యలు పరిష్కరిస్తారు.

News April 25, 2025

GNT: ‘పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి’

image

గుంటూరు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా.విజయలక్ష్మి అధ్యక్షతన DMHO చాంబర్‌లో జిల్లా ఆరోగ్య అధికారులతో సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. డా.విజయలక్ష్మి మాట్లాడుతూ..మలేరియా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 25న జరగబోయే ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలన్నారు.

News April 24, 2025

జ్ఞానాపురం చర్చి మైదానంలో బాలిక మృతదేహం

image

విశాఖలోని జ్ఞానాపురం చర్చి మైదానంలో అనుమానస్పద స్థితిలో పడి ఉన్న 11 ఏళ్ల బాలిక మృతదేహాన్ని చర్చి ప్రతినిధులు గుర్తించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతి పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలిలోనే బాలిక తల్లి, అమ్మమ్మ ఉన్నారు.

News April 24, 2025

చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

image

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పరామర్శించారు. చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్ర దాడుల్లో సామాన్య ప్రజలు మరణించడం తన మనసును కలిచివేసిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ కుటుంబాని పవన్ హామీ ఇచ్చారు.

News April 24, 2025

చంద్రమౌళి పార్థివదేహానికి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్

image

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. విశాఖలోని కనకదుర్గ హాస్పిటల్‌కి వెళ్లి చంద్రమౌళి పార్థివ దేహాంపై పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడుల్లో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ఈ దాడులను ఖండిస్తోందని పేర్కొన్నారు.

News April 24, 2025

టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, అప్పగింతపై గురువారం సమీక్ష జరిగింది. ఏపీ టిడ్కో మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ జీవో నం.39 ప్రకారం ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్స్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్లకు లోన్స్‌పై బ్యాంకు అధికారులతో చర్చించి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News April 24, 2025

NLR: రేషన్ డీలర్ల వద్దకు పరుగులు

image

రేషన్‌ ఇంటికి రావాలంటే ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఈకేవైసీ చేయండి అంటూ చాలామంది డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈకేవైసీ స్టేటస్‌ ఇంటర్‌​నెట్​లోనూ చూసుకోవచ్చని అధికారులు సూచించారు.

News April 24, 2025

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం బుడగట్లపాలెంలో ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్ ఏర్పాటు, గ్రామ సభ వేదిక నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్ విధుల అమలుపై ఎస్పీ కె. వి. మహేశ్వర్ రెడ్డితో కలసి సమీక్ష నిర్వహించారు. 

News April 24, 2025

ఈనెల 26న GVMC డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

image

GVMC డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఈనెల 26న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈనెల 26న ఉదయం 11 గంటలకు GVMC కౌన్సిల్ హల్లో నిర్వహించనున్నారు. ఆరోజున సమావేశానికి హాజరవుతున్న సభ్యులు మొబైల్ ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవాలన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్లు, కార్పొరేటర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

News April 24, 2025

ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్‌ను అభినందించారు.