India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆధార్‌లో తప్పులను సవరించుకునేందుకు శ్రీకాకుళం, టెక్కలి, ఆమదాలవలస పోస్టు ఆఫీసులో కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నామని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ హరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు ఈ సేవలు కల్పిస్తున్నామన్నారు. నూతన ఆధార్ కార్డుతో పాటు అడ్రస్ డేట్ అఫ్ బర్త్ కరెక్షన్, ఐరిష్, బయోమెట్రిక్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరిలో అక్టోబర్ 7వ తేదీన గిరిప్రదక్షణ జరగనుంది. సంబంధిత కరపత్రాలను పుష్పగిరి తీర్థయాత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సట్టి భారవి సిద్ధవటం జ్యోతిక్షేత్రంలో శుక్రవారం ఆవిష్కరించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కేసీపీ షుగర్స్ 2025-26 క్రషింగ్ సీజన్‌కు చెరకు ధర ప్రకటించింది. టన్నుకు రూ.400 సబ్సిడీతో కలిపి, చెరకు ధరను రూ.3,690గా నిర్ణయించినట్లు యూనిట్ హెడ్ యలమంచిలి సీతారామదాస్ తెలిపారు. యాంత్రీకరణకు అనువుగా సాగుచేసే రైతులకు టన్నుకు అదనంగా రూ.100 ఇస్తామన్నారు. ఈ సీజన్‌లో నాటే చెరకు మొక్క తోటలకు ఎకరాకు రూ.10 వేలు సబ్సిడీ, రూ.20 వేలు వడ్డీ లేని రుణం అందిస్తామని ప్రకటించారు.
విద్యార్థి మణికంఠతో మృతితో ఏయూలో సమస్యలు పరిష్కరించాలంటూ చేస్తున్న నిరసనను విద్యార్థులు విరమించారు. హామీలు నెరవేరుస్తామని వీసీ, జిల్లా అధికార బృందం జరిపిన చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు వెనక్కితగ్గారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ నియమిస్తామన్నారు. DMHO, KGH సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ 10వ తేదీ లోపు ఏర్పాటు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం (M) మాధవరం కమ్యూనిటీ హాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్కేలలో నిర్ధారించిన తేమ శాతం మాత్రమే పరిగణలోకి తీసుకుంటామన్నారు. సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి నారాయణరావు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం కీలక సూచనలు చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు. జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు.
రాజంపేట MP మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈనెల 29న తీర్పు వెల్లడిస్తామని ACB కోర్టు పేర్కొంది. ‘లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కింగ్ పిన్. ఆయన కంపెనీల్లో రూ.5కోట్ల ట్రాన్సాక్షన్లపై అనుమానం ఉంది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు’ అని AG దమ్మాలపాటి శ్రీనివాసులు వాదించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా MPపై కేసు పెట్టారని ఆయన తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఇడుపులపాయలోని IIIT విద్యార్థులకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అన్ని క్యాంపస్ విద్యార్థులకు ఈ తేదీల్లోనే సెలవులు ఉంటాయి. స్వగ్రామాలకు వెళ్లడానికి విద్యార్థులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రైలు సంఖ్య 17261/17262 గుంటూరు-తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ను తాత్కాలికంగా పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు (తిరుగు ప్రయాణంలో మరుసటి రోజు) ఈ రైలు సేవలు ధర్మవరం వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పొడిగింపు ద్వారా రైలు పాకాల-మదనపల్లె రోడ్-కదిరి మీదుగా ధర్మవరం వరకు ప్రయాణిస్తుంది. ఈ తాత్కాలిక సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ సినిమాపై గురువారం వ్యంగ్యంగా స్పందించారు. సినిమా విడుదలైన నేపథ్యంలో, ‘ప్రత్యర్థి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కానీ, ఫలితం మాత్రం శూన్యం. దానయ్య.. దండగ పడ్డావయ్యా!’ అని ఆయన ట్వీట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బలంగా నిలవలేకపోయిందని ఎత్తిచూపుతూ రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Sorry, no posts matched your criteria.