India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సూచించారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఉంటే వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల మౌలిక వసతుల కల్పనకు అడ్డంకులు ఉండవన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడటమే జిల్లా యంత్రాంగం ప్రధమ కర్తవ్యం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విపత్తుల సమయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా కాపాడేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమన్నారు.
పేద ప్రజలకు అందాల్సిన లబ్ధి అర్హులైన వారికి తప్పకుండా అందాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. పోషన్ అభియాన్ నిర్దేశిత లక్ష్యాలు అమలు అయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాలుపై తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని SP మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా ఫిర్యాదు దారులుతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ, ఆస్తి, పౌర సంబంధాలు, గొడవలు, మోసపూరితమైనవి, ఇతర అంశాలుపై ఫిర్యాదులు అందాయన్నారు.
జిల్లాలో ఎక్కడ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మద్యం షాపులు, పర్మిట్ రూముల వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధాన్ని వారం రోజుల్లోగా అమలు చేయాలన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు.
విజయనగరంలో పర్యటన నిమిత్తం ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ వై.లక్ష్మణరావు శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ఇద్దరు జడ్జిలను కలెక్టర్ ఎస్.రామ సుందర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో శనివారం బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ తీరప్రాంత మిషన్ పథకం కింద సెప్టెంబర్ 20న అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రపరిచే దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కలెక్టర్ డీ.కే. బాలాజి శుక్రవారం కలెక్టరేట్‌లోని “మీ-కోసం” సమావేశ హాల్‌లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలను సమన్వయంతో ముమ్మరంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కే. కన్నమ నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి జే.అరుణ, తదితరులు పాల్గొన్నారు.
ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శంకరరావు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఫొటోలతో హాజరుకావాలని కోరారు.
నెల్లూరులోని వెంకటేశ్వరపురం మూడో రైల్వే లైనుపై ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఒకరు మృతి చెందారు. రైల్వే SI హరిచందన వివరాలు.. చిత్తూరు(D) పూతలపట్టుకు చెందిన ఉమేష్ చంద్ర(25), పొదలకూరుకు చెందిన వంశీ స్నేహితులు. వీరు గూడ్స్ రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉమేష్ చంద్ర మృతిచెందగా, వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లో చేర్పించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.