India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ జె.సుభద్రతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. వీరు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలమైన భారతదేశానికి బలమైన గ్రామ పాలన అవసరమని జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు.
2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌కు నూతన సిలబస్‌ను ప్రవేశపెడుతున్నట్లు DIEO శ్రీనివాస్ గురువారం తెలిపారు. కన్నన్ కళాశాలలో అధ్యాపకులకు దీనిపై ఓరియంటేషన్ తరగతులు ప్రారంభించామన్నారు. ప్రతి ఒక్క అధ్యాపకుడు ఈ తరగతులకు హాజరై నూతన సిలబస్‌పైన అవగాహన పెంచుకోవాలన్నారు. కళాశాల పునఃప్రారంభం నాటికి నూతన పుస్తకాలు అందుబాటులోకి తెస్తామన్నారు.
ఏపీలో నిన్న టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు IIITలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
భీమవరంలో సినీనటి అనసూయ సందడి చేశారు. గురువారం భీమవరంలోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె వచ్చారు. అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. భీమవరం చాలా సార్లు వచ్చానని, ఇక్కడ అభిమానం ఎప్పటికీ మరవలేనని, ఎన్నిసార్లు అయినా భీమవరం వస్తానని అనసూయ అన్నారు.
మైలవరానికి చెందిన యువకుడు అవినాశ్ తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తెనాలి వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయపురం(మ) ఎం.అగరంలో వైసీపీ సర్పంచ్ సుధాకర్‌పై హత్యాయత్నం జరిగిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ‘X’ వేదికగా మండిపడ్డారు. వెంటనే అసలు నిందితులను అరెస్ట్ చేయకపోతే ప్రైవేట్ కేసు వేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.
మరికొద్ది రోజుల్లో వివాహం అనగా ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో గురువారం జరిగింది. టూ టౌన్ సీఐ ఎర్రంనాయుడు వివరాల ప్రకారం.. నగరంలోని కల్లుపాకల ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి ఓ యువకుడిని ప్రేమించింది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం KGHకు తరలించారు.
యలమంచిలి మండలం కొంతేరులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. సరిహద్దు గొడవల నేపథ్యంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కత్తుల పౌలు (58)ను బత్తుల ఏసుదాసు నరికాడు. మెడపై తీవ్రగాయాలు కావడంతో పౌలు మంచంపై మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ జి. శ్రీవేద, పాలకొల్లు రూరల్ సీఐ జి. శ్రీనివాస్, ఎస్సై కె. గుర్రయ్య పరిశీలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిగా ఆదూరి శ్రీనివాస్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఈయన నెల్లూరు బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ రెగ్యులర్ పదోన్నతిపై DIEOగా చిత్తూరుకు వచ్చారు. అందరి సహకారంతో జూనియర్ కళాశాల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ త్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది . దీనిలో భాగంగా నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 27 నుంచి మే 20వ తేదీలోపు ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.