India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యారాడ కొండపై వేంచేసి ఉన్న శ్రీసాగర్ గిరి కనక దుర్గ అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈఉత్సవాలు జరగనున్నాయి. పోర్టు వెంకటేశ్వరస్వామి ఆలయ జెట్టీ నుంచి యారాడకు ప్రత్యేక బోట్ సౌకర్యం కల్పిస్తారు. గత ఏడాది టికెట్ ధర రూ.40గా ఉంది. గాజువాక, సింధియా మీదుగా రోడ్డు మార్గంలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు.
ఇటీవల అనారోగ్య కారణాలతో మృతిచెందిన ఒక హోంగార్డు కుటుంబాని జిల్లా పోలీసుశాఖ అండగా నిలిచింది. విధి నిర్వహణలో ఉంటూ హోంగార్డు దాసరి మునిస్వామి అనారోగ్యంతో మార్చి 25న మృతి చెందాడు. ఈయన కుమారుడు దాసరి పెద్ద స్వామికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం ఇస్తూ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. శుక్రవారం సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేశ్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు.
విజయనగరం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగుల గ్రీవన్స్‌కు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి 40 వినతులు అందాయి. ఈ వినతులను కలెక్టర్, JC సేతు మాధవన్, RDO శ్రీనివాస మూర్తి స్వీకరించగా జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ రామసుందర రెడ్డి మాట్లాడుతూ.. అందిన వినతుల్లో జిల్లా స్థాయిలో ఉన్నవి పరిష్కరించాలని, కానివి రాష్ట్ర స్థాయికి పంపాలన్నారు.
దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని వినతులు స్వీకరించారు. శుక్రవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో దివ్యాంగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యల విని, పడుతున్న కష్టాలను చూసి ఆయన చలించిపోయారు. దివ్యాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC, అధికారులు పాల్గొన్నారు.
జైలు రోడ్డు ఫుడ్ కోర్ట్‌లో దుకాణాలను స్థానిక MLA అయిన తనకు సమాచారం ఇవ్వకుండా <<17758951>>తొలగించడం<<>>పై వంశీకృష్ణ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ప్రజలతో ఆటలాడటం తగదని హెచ్చరించారు. ఫుడ్ కోర్ట్ వ్యాపారులు ఏళ్లుగా కష్టపడి దుకాణాలు నడుపుతున్నారని, ఒక్కసారిగా తొలగించడం అన్యాయం అని అన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్‌లో తీర్మానం పెట్టడాన్ని తప్పుపట్టారు.
విశాఖ నగరంలో వివిధ కారణాలవల్ల స్వాధీనం చేసుకున్న వాహనాలను సీపీ వాహనదారులకు తిరిగి అందజేశారు. పోలీస్ గ్రౌండ్‌లో శుక్రవారం సీపీ శంఖబ్రత బాగ్చి 346 వాహనాలను వాహనదారులకు అందజేశారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్లు సీపీ తెలిపారు. ఇప్పటివరకు మూడు వెహికల్ రిటర్న్ మేళా నిర్వహించి 818 మందికి వారి వాహనాలు అందించినట్లు వెల్లడించారు.
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. తొలిరోజే వెలుగొండ పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా ఆయన తొలి జిల్లా పర్యటనను వెలుగొండ నుంచి ప్రారంభించడం విశేషం. వెలుగొండకు మంచి రోజులు వస్తాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
తర్లుపాడు మండలం కులుజ్వులపాడులో భర్త భార్యను పందిరి గుంజకు కట్టి బెల్ట్‌తో కొట్టిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పొదిలి CI వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మద్యానికి బానిసైన నిందితుడు డబ్బు కోసం భార్యను కట్టేసి కొట్టాడు. అతనితో పాటు మిగిలిన ముగ్గురు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించి ఒంగోలు జైలుకు తరలించారు. తర్లుపాడు SI బ్రహ్మనాయుడిని CI అభినందించారు.
జిల్లాలో ఉల్లి సాగుచేసిన రైతులకు నష్టం కలగకుండా మార్కెటింగ్‌కు అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం జేసీ అతిథి సింగ్‌తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలుకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఉల్లి నిల్వలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు మార్కెఫెడ్ అధికారులు ప్రతిపాదనలు పంపాలన్నారు. రైతుల నుంచి లాభం ఆశించవద్దని వర్తకులకు సూచించారు.
సీఎం చంద్రబాబు విజన్-2047లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ లేదా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ సముదాయం ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఆత్మకూరు నారంపేటలో పారిశ్రామికవాడ, నెల్లూరు అర్బన్ భగత్‌సింగ్ కాలనీలో రూ.12 కోట్లతో జీ+2 ఫ్యాక్టరీ షెడ్స్ నిర్మాణం జరుగుతుండగా, ఆమంచర్లలో 59 ఎకరాల్లో MSME పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపాదన దశలో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.