Andhra Pradesh

News September 19, 2025

అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

అనంతపురం: వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో ఆయన సమీక్షించారు. యూరియా పంపిణీ అవసరం ఉన్న చోట తప్పకుండా సరఫరా చేయాలని సూచించారు.

News September 19, 2025

సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.

News September 19, 2025

భోగాపురం విమానాశ్రయ భూములపై కలెక్టర్ ఆరా

image

భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యం, జాతీయ ర‌హ‌దారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌పై క‌లెక్ట‌రేట్లో సంబంధిత అధికారుల‌తో కలెక్టర్ రామసుందర రెడ్డి గురువారం స‌మీక్షా నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు జిఎంఆర్‌కు అప్ప‌గించిన 2,200 ఎక‌రాల భూముల ప‌రిస్థితి, వాటికి సంబంధించిన స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. విమాన‌యాన అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం కేటాయించిన 540 ఎక‌రాల భూములపై ఆరా తీశారు.

News September 19, 2025

నేడు ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం

image

ప్రకాశం జిల్లాలో శుక్రవారం పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. జిల్లాకు వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News September 19, 2025

నేడు ఉద్యోగుల పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

image

ప్రతి నెల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను నేడు నిర్వహించనున్నారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని PGRS హాల్‌లో సాయంత్రం 4 గంటలకు ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమం జరగనుందని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగుల PGRS కార్యక్రమానికి అన్ని శాఖల అధిపతులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

News September 19, 2025

ఎచ్చెర్ల: యూనివర్సటిలో సంస్కృతి కోర్సు ప్రారంభం

image

ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటిలో సంస్కృతి కోర్సును వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కే ఆర్ రజిని ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం ఉష నిధుల ఆర్థిక సహకారంతో సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును మొదలపెట్టామని చెప్పారు. సంస్కృతం భాష నుంచే మిగతా భాషలు వృద్ధి చెందాయని తెలియజేశారు.

News September 19, 2025

IT కోర్ సెంటర్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన SP

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు గురువారం IT కోర్ సెంటర్, కంట్రోల్ రూమ్ సెంటర్లను సందర్శించారు. సిబ్బంది పని తీరు, విధులపై ఆరా తీశారు. CCTNS, CDR, సైబర్ క్రైమ్ అప్డేట్స్, అప్లికేషన్లపై సిబ్బందితో చర్చించారు. పలు ఫైల్స్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తునకు ఉపయోగపడే ఆధారాలను త్వరితగతిన అందించాలన్నారు.

News September 19, 2025

5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: జేసీ

image

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్‌లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని చెప్పారు.

News September 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

▶మెళియాపుట్టి: గ్రానైట్ క్వారీ వద్దు.. గ్రామం ముద్దు
▶జిల్లాలో పలుచోట్ల యూరియా కోసం రైతుల అవస్థలు
▶SKLM: ఎంపీ నిధులతో ప్రాంతీయ ప్రాంతాల అభివృద్ధి
▶GST 2.0పై మాట్లాడిన ఎమ్మెల్యే గౌతు శిరీష
▶బూర్జ: ధర్మల్ ప్లాంట్ నిర్మాణం మానుకోవాలి
▶పొందూరు: ఈ ప్రయాణాలు..ప్రమాదం
▶సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శంకర్
▶రైతు సమస్యలపై సభలో చర్చిస్తాం: అచ్చెన్నాయుడు

News September 18, 2025

విశాఖలో 524 ఆక్రమణల తొలగింపు

image

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా 524 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు గురువారం తెలిపారు. జోన్ 1లో 20 ఆక్రమణలు, జోన్-2 90, జోన్ -3లో 42, జోన్ -4 60, జోన్ -5లో 52, జోన్-6లో 86, జోన్ – 7లో 42, జోన్-8లో 67 ఆక్రమణలు తొలగించారు.