Andhra Pradesh

News April 23, 2025

పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఐదుగురికి అస్వస్థత

image

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై ప్రమాదం సంభవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

News April 23, 2025

597 మార్కులు సాధించిన ఆదోని విద్యార్థిని.!

image

ఆదోని పట్టణంలోని ఎస్.కె.డి కాలనీకి చెందిన దేవరకొండ సలీమా పదో తరగతి ఫలితాల్లో టౌన్ టాపర్‌గా నిలిచింది. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించింది. తండ్రి రంజాన్ బాషా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ పిల్లలను చదివించారు. తన కష్టానికి ఫలితంగా.. తన కూతురు మంచి మార్కులు సాధించి తమ గౌరవాన్ని నిలబెట్టిందని తండ్రి సంతోషించారు.

News April 23, 2025

కూలీ కుమారుడికి 593 మార్కులు

image

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

News April 23, 2025

పదో తరగతి పరీక్షల్లో ఆటో డ్రైవర్ కుమార్తె టాపర్

image

తెనాలి(M) సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన మద్దినేని మనోజ్ఞ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో చదువుతున్న మనోజ్ఞ 591 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచారు. సర్కార్ బడిలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన మనోజ్ఞను పలువురు అభినందించారు. మనోజ్ఞ తండ్రి మధుబాబు ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఐఐటీలో చదవాలన్నది తన లక్ష్యమని మనోజ్ఞ తెలిపారు.

News April 23, 2025

విశాఖ: 600కి 598 మార్కులు

image

పెందుర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన అబ్దుల్ సమీరా భాను బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలల్లో సత్తా చాటింది. 600 మార్కులకు గాను 598 మార్కులు వచ్చాయి. పెందుర్తి మండలంలో 598 మార్కులు రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థిని పలువురు అభినందించారు.

News April 23, 2025

శ్రీకాకుళంలో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి సూసైడ్

image

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో మార్కులు త‌క్కువ‌గా వచ్చాయని శ్రీ‌కాకుళానికి చెందిన విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డాడు.  బ‌ల‌గ ప్రాంతానికి చెందిన గురుగుబిల్లి వేణుగోపాల‌రావుకు బుధ‌వారం విడుద‌లైన ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో 393 మార్కులు వచ్చాయి. త‌క్కువ రావడంతో మ‌న‌స్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

News April 23, 2025

నేడు విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం గన్నవరం నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన చంద్రమౌలికి నివాళులు అర్పిస్తారు. భౌతికకాయం రాత్రి 10గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు విమానాశ్రయంలో మృతదేహాన్ని స్వయంగా స్వీకరించి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చుతారు.

News April 23, 2025

కృష్ణా: టెన్త్ ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య

image

కృష్ణా జిల్లా బంటుమిల్లి(M) అర్జువానిగూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పదో తరగతిలో ఉత్తీర్ణత కాలేదని విద్యార్థి గోవాడ అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతేడాది అనిల్ సైన్స్ పరీక్ష ఫెయిల్ అయ్యాడు. ఈ ఏడాది కూడా అదే సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. విగతజీవిగా మారిన కుమారుడ్ని చూసి తల్లిదండ్రలు రామకృష్ణ, రజినీ గుండెలవిసేలా రోదించారు.

News April 23, 2025

అలకూరపాడు జడ్పీ హై స్కూల్ విద్యార్థినికి 595 మార్కులు

image

టంగుటూరు మండలంలోని అలకూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 600 గాను 595 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచింది. ఈ సందర్భంగా బాలికను పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యశాఖధికారులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

News April 23, 2025

10th Results: అనంతపురం జిల్లాకు ఈసారి నిరాశే.!

image

అనంతపురం జిల్లా పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించలేదు. 30,700 మంది విద్యార్థులలో 21,510 మంది ఉత్తీర్ణత సాధించారు. 70.07 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. గతేడాది టెన్త్ ఫలితాల్లో 30,893 మందికి 25,003 మంది పాసయ్యారు. 84.46 శాతంతో పాస్ పర్సంటేజ్‌తో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 23తో ఒక స్థానం మెరుగైంది.