India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.
నెల్లూరు పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు బొకే అందించి ఆహ్వానం పలికారు. ఈ మేరకు మంత్రి ఇవాళ VR స్కూల్ ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ ఇటీవల పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 867 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.
మధురవాడ పరిధి కొమ్మాది శివార్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ.43 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. అలాగే భీమిలి సమీపంలో ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.2.51వేలు స్వాధీనం చేసుకున్నారు.
బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వస్తున్న భక్తులపై హిజ్రాలు దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన దేవరాజు కుటుంబ సభ్యులతో అమ్మవారి దర్శనం కోసం ఆటోలో వచ్చారు. బోయకొండ వద్ద ఆటోలు ఆపిన హిజ్రాలు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు అడిగినంత ఇవ్వకపోవడంతో గొడవకు దిగారు. ఈ దాడిలో ఐదుగరు గాయపడగా.. వారు చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రతి విద్యార్థి అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. ఆదివారం పెద అమిరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ, జేసీ, డీఆర్ఓ, ఆర్డీవోలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి చేత అమ్మ పేరుతో ఒక మొక్కను నాటించే ఏర్పాటు చేయాలని అన్నారు.
☞ ఉ. 9 గంటలకు VR మున్సిపల్ హైస్కూల్‌ను ప్రారంబోత్సవం
☞ 11 గంటలకు సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు
☞ మ.12 గంటలకు నాయకుల సమన్వయ సమావేశానికి హాజరవుతారు
☞ సాయంత్రం 4 గంటలకు బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు సోమవారం నిర్వహిస్తున్నామని డీఈఓ మాణిక్యంనాయుడు తెలిపారు. నేడు మండల స్థాయిలో, ఈనెల 9న జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. పొగాకు, మత్తు పదార్థాల వినియోగంపై చిత్ర లేఖనం పోటీలు ఉంటాయన్నారు. లింగ సమానత్వం, గౌరవ మర్యాదలు అంశంపై వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా అమలు కానుందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు సమీప మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ఇలా నిర్వహించడం వల్ల పాలన ప్రజలకు చేరువ అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఫిర్యాది దారులు ఉపయోగించుకోవాలన్నారు.
జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5- 12వ తేదీ వరకు రాబిస్ వ్యాధి నివారణ డ్రైవ్ నిర్వహించినట్లు DMHO వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమండ్రిలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిల్లో 12వ తేదీ వరకు ఉచితంగా రాబిస్ వ్యాక్సిన్ అందిస్తారన్నారు. కుక్క కాటుకి గురైన వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు వ్యాక్సిన్‌తో రాబిస్ నుంచి రక్షణ పొందవచ్చు అన్నారు.
Sorry, no posts matched your criteria.