Andhra Pradesh

News September 18, 2025

కోచింగ్ లేకుండానే టీచర్ అయ్యాడు..!

image

SRపురం(M) కొత్తపల్లిమిట్టకి చెందిన ప్రభుకుమార్ టీచర్ ఉద్యోగం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాడు. తండ్రి ఏసుపాదం రెండేళ్ల క్రితం చనిపోగా.. తల్లి మణియమ్మ రోజు కూలికి వెళ్లి ఇంటి బాగోగులు చూస్తున్నారు. ఉద్యోగం రావడంతో ఇక అమ్మను కూలి పనులకు పంపకుండా బాగా చూసుకుంటానని ప్రభు కుమార్ తెలిపాడు.

News September 18, 2025

ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఇస్తాం: మంత్రి ఆనం

image

సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారన్నారు. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News September 18, 2025

కడప: జాతీయ ప్రతిభా ఉపకార వేతన దరఖాస్తుకు అవకాశం

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతన పథకo ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని, దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30న చివరి గడువని డీఈవో శంషుద్దీన్ గురువారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులలు పరీక్ష ఫీజు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 18, 2025

భీమవరం: 5 బార్లను లాటరీ

image

2025-28 సంవత్సరానికి జనరల్ కేటగిరీలో 5 బార్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. భీమవరంలో 4, నర్సాపురంలో 1 బార్‌కు ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారి ప్రభు కుమార్ పాల్గొన్నారు.

News September 18, 2025

GNT: సీజనల్ వ్యాధుల సమాచారానికి కంట్రోల్ రూమ్

image

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాదులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని,  ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014  నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.

News September 18, 2025

రాజమండ్రి: నూతన కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఎస్పీ

image

తూ.గో జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరిని గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతలపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.

News September 18, 2025

విశాఖలో ఏడు చోట్ల చైన్ స్నాచింగ్

image

విశాఖలో బుధవారం రాత్రి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. వన్ టౌన్, కంచరపాలెం, షీలా నగర్ ప్రాంతాల్లో ఒకే బ్యాచ్ ఏడు చైన్ స్నాచింగ్‌లు చేసి కలకలం సృష్టించింది. ఒకే బైక్ పై ఇద్దరు యువకులు ఈ ఏడు చోట్ల చోరీలు చేసినట్లు సమాచారం. దొంగతనం చేసిన బైక్‌తో స్నాచింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. 7 చోట్ల జరిగిన స్నాచింగ్‌లో సుమారు 20 తులాల వరకు బంగారు ఉంటుందని చెబుతున్నారు.

News September 18, 2025

పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

image

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 18, 2025

ప్రకాశం ఎస్పీ గారూ.. ప్లీజ్ ఈవ్ టీజింగ్‌పై లుక్కేయండి!

image

ప్రకాశం జిల్లా నూతన SP హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో SPగా ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రకాశంలో కూడా అదే తీరు చూపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. స్కూల్స్, కళాశాలలు మొదలు, ముగిసే సమయాల్లో పోకిరీల ఆగడాలు పెరిగాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. SP చొరవ తీసుకోవాలని వారు కోరారు.

News September 18, 2025

నెల్లూరు: గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన నెల్లూరు-వేదాయపాలెం రైల్వే స్టేషన్ మధ్య బుధవారం జరిగింది. విజయవాడ-చెన్నై మార్గంలో రైలు పట్టాలపై డెడ్ బాడీ దొరికింది. డోర్ వద్ద కూర్చొని రైలు నుంచి జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుంది. మెరూన్ రంగు ఆఫ్ టీషర్ట్, బ్లూ రంగు షార్ట్ ధరించాడు. ఎస్సై హరి చందన కేసు నమోదు చేశారు.