Andhra Pradesh

News September 18, 2025

సొంత నియోజకవర్గంలోనే పల్లాకు తలనొప్పి

image

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై TDP రాష్ట్ర అధ్యక్షుడు P.శ్రీనివాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినేతగా రాష్ట్రవ్యాప్తంగా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నా.. సొంత నియోజకవర్గంలో మాత్రం ప్లాంట్ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు TDP కూడా కారణమని కార్మిక సంఘాల ఆరోపణలు, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏమైయ్యాయి? అని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తుండడంతో పల్లాకు మరింత ఇబ్బందిగా మారింది.

News September 18, 2025

నేనూ బాధితుడినే: MLA విష్ణుకుమార్ రాజు

image

AP టిడ్కో గృహాల సమస్యలపై విశాఖ MLA విష్ణుకుమార్ రాజు గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. బెనిఫిషరీస్ టిడ్కో ఇండ్లలో దిగి రెండేళ్లు అవుతున్నా.. కాంట్రాక్టర్లకు మాత్రం ఇంత వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. తాను కూడా ఒక బాధితుడినే అన్నారు. తన కంపెనీకి రావాల్సిన రూ.123 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జగన్ ప్యాలెస్ కట్టిన వారికి మాత్రం రూ.60 కోట్లను ఆర్ధిక శాఖ రిలీజ్ చేసిందన్నారు.

News September 18, 2025

చిత్తూరు: రెండేళ్ల క్రితం హత్య.. ఇప్పుడు వెలుగులోకి

image

బంగారుపాళ్యం(M) బలిజపల్లికి చెందిన చెంచులక్ష్మి భర్త చనిపోగా శేషాపురానికి చెందిన దేవేంద్రతో వివాహేతర బంధం ఏర్పడింది. పెనుమూరు(M) సామిరెడ్డిపల్లిలోని ఓ మామిడి తోటలో కాపలా పనికి 2023లో ఇద్దరు వచ్చారు. అప్పట్లోనే వాళ్ల మధ్య గొడవ జరగ్గా చెంచులక్ష్మిని దేవేంద్ర నీటిలో ముంచి చంపేశాడు. తోటలోనే డెడ్‌బాడీని పాతిపెట్టి ఆమె ఎటో వెళ్లిపోయిందని మృతురాలి తల్లిని నమ్మించాడు. పోలీసులు నిన్న అతడిని అరెస్ట్ చేశారు.

News September 18, 2025

SKLM: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీకాకుళం ప్రభుత్వ డీఎల్టీసీ, ఐటీఐలో ప్రవేశాలకు 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ మోహనరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు మిగిలిన సీట్లకు నాలుగో విడత కౌన్సెలింగ్ జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం 28న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 29 న కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

News September 18, 2025

ఆలూరు సాంబశివారెడ్డికి కీలక పదవి

image

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్‌గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్‌గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.

News September 18, 2025

పాలకోడేరు: గల్లంతైన జైదేవ్ మృతదేహం లభ్యం

image

పాలకోడేరు మండలం వేండ్ర కట్టా వారిపాలెం గోస్తని నదిలో గల్లంతైన చిన్నారి జైదేవ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఆదివారం గల్లంతైన అతడి కోసం నాలుగు రోజులుగా ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు గాలింపు చేపట్టారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుర్రపుడెక్కల్లో చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

News September 18, 2025

గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

image

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.

News September 18, 2025

గుంటూరులో డయేరియా కేసులు

image

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణ తెలిపారు. 

News September 18, 2025

మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

image

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్‌తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.

News September 18, 2025

SKLM: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీకాకుళం ప్రభుత్వ డీఎల్టీసీ, ఐటీఐలో ప్రవేశాలకు 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ మోహనరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు మిగిలిన సీట్లకు నాలుగో విడత కౌన్సెలింగ్ జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం, 28న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. 29 న కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.