Andhra Pradesh

News April 23, 2025

కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత

image

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

News April 23, 2025

ఈనెల 30న పాలిసెట్ పరీక్ష: DRO

image

ఈ నెల 30న పాలిసెట్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని DRO శ్రీనివాస మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో పరీక్ష నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 8,083 మంది అభ్యర్థులు 23 కేంద్రాల్లో హాజరు కానున్నారని తెలిపారు. విజయనగరంలో 9 కేంద్రాలు, బొబ్బిలిలో 6 కేంద్రాలు, గజపతినగరంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News April 23, 2025

ఒంగోలులో TDP నేత హత్య.. లోకేశ్ దిగ్ర్భాంతి

image

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తనను షాక్‌కు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య టీడీపీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

News April 23, 2025

పోలీస్ ఉద్యోగం గొప్ప అవకాశం: ప్రకాశం ఎస్పీ

image

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసుశాఖ ప్రతిష్ఠ మరిం‌త పెంచాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఒంగోలులోని‌ జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ఆయన మంగళవారం‌ నియామక‌పత్రాలు అందజేశారు. పోలీస్ శాఖలో చేరడం గొప్ప అవకాశమన్నారు. ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం ముఖ్య కర్తవ్యమని‌ సూచించారు.

News April 23, 2025

జగన్‌ను కలిసిన కడప నేతలు

image

మాజీ సీఎం జగన్‌ను కడప జిల్లా వైసీపీ నేతల కలిశారు. తాడేపల్లిలోని మాజీ సీఎం నివాసంలో ఇవాళ సమావేశం జరిగింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇతర నాయకులు అక్కడికి వెళ్లారు. పీఏసీలో తనకు చోటు కల్పించడంపై జగన్‌కు అంజద్ బాషా ధన్యవాదాలు తెలిపారు. 

News April 23, 2025

రైతు బిడ్డకు 465 మార్కులు

image

గుత్తి మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ, రజిని దంపతుల కుమారుడు రేశ్వంత్ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదివిన యువకుడు ఎంపీసీలో 470కు గానూ 465 మార్కులు సాధించారు. యువకుడిని రైతులు, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.

News April 23, 2025

FLASH: ఒంగోలు మాజీ MLAకు గుండెపోటు

image

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ MPP ముప్పవరపు వీరయ్య చౌదరిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు మాజీ MLA ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి మేనల్లుడు అవుతాడు. అల్లుడి మృతి వార్తతో హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల, విజయ్ కుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి తదితరులు హరిబాబును పరామర్శించారు.

News April 23, 2025

గుంటూరు డాక్టర్ అరుదైన రికార్డు 

image

NTR హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో గుంటూరు GGH న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ గాజుల రామకృష్ణ కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ పీజీ పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీతో పాటు కార్డియాలజీ పీజీలు పూర్తిచేసిన ప్రపంచంలోనే తొలి డాక్టరుగా అరుదైన గౌరవం పొందారు. వేమూరు(M) చావలికి చెందిన రామకృష్ణ గుంటూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి, ప్రభుత్వ వైద్య సేవల్లో అనేక బాధ్యతలు చేపట్టారు

News April 23, 2025

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజు

image

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే.రాజును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే కేకే.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందరు.

News April 23, 2025

పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్ 

image

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలలో తక్కువ బరువు ఉన్న పిల్లలపై అంగన్వాడి సూపర్‌వైజర్లు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతినెల పిల్లల బరువులను, ఎత్తు చూసి రికార్డు చేయాలని సూచించారు. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.