Andhra Pradesh

News September 18, 2025

అనంత జిల్లాకు 1482.30 మెట్రిక్ టన్నుల యూరియా

image

అనంతపురం జిల్లాకు RCF సంస్థ నుంచి 1482.30 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుందని DA అల్తాఫ్ అలీ ఖాన్ తెలిపారు. ప్రసన్నాయిపల్లి రేట్ పాయింట్ వద్ద ఆయన యూరియాను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌కు 899.01 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 583.29 మెట్రిక్ టన్నులు కేటాయించామని వెల్లడించారు.

News September 18, 2025

బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో బందోబస్తు సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ప్రముఖులతో మర్యాదగా వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో మాత్రం కఠినంగా ఉండాలని సూచించారు. ఏవైనా ఆకస్మిక ఘటనలు జరిగినప్పుడు పక్క సెక్టార్లలోని పోలీసులు సహాయం అందించాలని చెప్పారు.

News September 18, 2025

శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు

image

హిందూ పురాణాల ప్రకారం నాలుగు యుగాల్లో విశ్వకర్మ ఎన్నో పట్టణాలను నిర్మించారని అదనపు ఎస్పీ కె.వి.రమణ అన్నారు. బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకులు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేశారు. ఆయుధాలతో పాటు పనిముట్లు ప్రాముఖ్యతను తెలిపిన గొప్ప వ్యక్తి విశ్వకర్మ అని ఆయన పేర్కొన్నారు.

News September 18, 2025

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. జేసీ హెచ్చరిక

image

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ-సర్వే, పీజీఆర్ఎస్, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. ముఖ్యంగా పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను స్వయంగా మాట్లాడి పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

News September 18, 2025

రాజమండ్రి అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష

image

రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇంచార్జి కమిషనర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ అధికారులు హాజరయ్యారు. అభివృద్ధి పనులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించారు.

News September 18, 2025

అక్టోబర్ 4లోపు దరఖాస్తు చేసుకోండి: DMHO

image

పారామెడికల్ ట్రైనింగ్ 2025-26 కోర్సుల్లో ఉచిత ప్రవేశానికి అక్టోబర్ 4 వరకు గడువు పెంచినట్లు DMHO సుధారాణి బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.appmb.co.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్లను జత చేసి రూ.100లను DMHO కార్యాలయంలో అందించాలన్నారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News September 18, 2025

బయోలాజికల్ కంట్రోల్ లాబరేటరీ పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

image

నిడదవోలులో వ్యవసాయ శాఖ నడుపుతున్న బయోలాజికల్ కంట్రోల్ లాబోరేటరీని బుధవారం జిల్లా వ్యవసాయా ధికారి ఎస్.మాధవరావు సందర్శించారు. లేబోరేటరీ ద్వారా రైతులకు జీవ నియంత్రణ కారాకాలైన ట్రైకోడెర్మా విరిడి, సూడోమో నాస్ ఫ్లోరిసెన్స్ తదితర జీవ శిలీంద్ర నాశనాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వీటి ద్వారా వరి, పొగాకు, అరటి, నిమ్మ కూరగాయలు పంటలకు వచ్చే పొడ తెగులు, కాండం, వేరు కుళ్లు నియంత్రించవచ్చునన్నారు.

News September 18, 2025

విద్యార్థిపై దాడి.. పవన్ కళ్యాణ్ విచారం

image

పుంగనూరులోని ఓప్రైవేటు స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి తల ఎముక చిట్లడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. స్కూల్, ఇంట్లో పిల్లలు అల్లరి చేయడం లాంటివి చేస్తే వారి మానసిక ధోరణిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థికి సమస్యలు తలెత్తడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని బుధవారం అధికారులను ఆదేశించారు.

News September 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤ టెక్కలి, జలుమూరు, పాతపట్నం, పొందూరు, శ్రీకాకుళానికి నూతన ఎంపీడీఓలు
➤అరసవల్లి: ఘనంగా ఆదిత్యుని కళ్యాణం.
➤అధ్వానంగా ముంగెన్నపాడు రోడ్డు.
➤ శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల విశ్వకర్మ జయంతి.
➤నరసన్నపేట: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
➤ఇచ్ఛాపురంలో గంజాయితో ఇద్దరు అరెస్ట్.
➤శ్రీకాకుళం: వైసీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం
➤ మా శత్రువు టీడీపీనే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

News September 17, 2025

తిరుమలలో పులివెందుల వాసి మృతి

image

తిరుమలలో బుధవారం శ్రీవారి భక్తుడు మృతి చెందాడు. టీటీడీ అధికారుల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల తాలూకా పార్నపల్లికి చెందిన శ్రీవారి భక్తుడు తిరుమల అద్దె గదుల ప్రాంతంలోని ఓ బాత్రూంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు అతను గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.