Andhra Pradesh

News September 30, 2024

విజయనగరం: నేటి నుంచే పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు

image

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా, జిల్లాలో సందడి వాతావరణం మొదలైంది. ఇప్పటికే పైడితల్లి అమ్మవారి ఇరుసు, సిరిమాను వృక్షం హుకుంపేట చేరుకోగా.. ఆ వృక్షాన్ని మానుగా మలవనున్నారు. అక్టోబరు 30తో ఉత్సవాలు ముగియనుండగా.. 14న తొలేళ్లు, 15న సిరిమానోత్సవం జరగనున్నాయి. 22న తెప్పోత్సవం జరగనుందని, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.

News September 30, 2024

గన్‌మెన్లను వెనక్కు పంపిన అనంతపురం MLA?

image

అనంతపురం MLA దగ్గుపాటి ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. రాప్తాడు వైసీపీ నేత మహానందరెడ్డికి ప్రభుత్వం గన్‌మెన్లను కేటాయించడంతో నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహానందరెడ్డి గతంలో ముగ్గురి హత్య కేసులో నిందితుడు. దీంతో సంఘ విద్రోహ వ్యక్తులు, జిల్లా బహిష్కరణ చేయాల్సిన వ్యక్తులకు గన్‌మెన్‌లను ఎలా కేటాయిస్తారంటూ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

News September 30, 2024

కడప జిల్లాలో బాంబు పేలుడు.. VRA మృతి

image

కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో బాంబులు కలకలం రేపాయి. స్థానిక VRA వి నరసింహులు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు వేయడంతో VRA మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

News September 30, 2024

సారవకోట: అత్యాచార కేసులో నిందితుడి అరెస్ట్

image

సారవకోట మండలంలో ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి బాలికపై అత్యాచారం చేసిన కేసులో అదే ప్రాంతానికి చెందిన బుద్దల హేమసుందరరావును శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజశేఖర్ విచారణ చేశారన్నారు. యువకుడి అరెస్ట్ అనంతరం పాతపట్నం కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

News September 30, 2024

తూ.గో: ఫొటోషూట్‌.. వాగులో గల్లంతైన విద్యార్థి

image

ఫ్రెండ్స్‌తో సరదాగా ఫొటోషూట్‌కు వెళ్లిన ఓ విద్యార్థి వాగులో గల్లంతయ్యాడు. ఈ ఘటన తూ.గో జిల్లా సీతానగరంలో జరిగింది. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. సీతానగరానికి చెందిన వి.వినయ్(15) రఘుదేవపురంలోని ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌‌లపై ఫొటోషూట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వినయ్ వాగులో గల్లంతు కాగా.. రాత్రి 9 గంటల వరకు గాలించినా అతడి ఆచూకీ లభించలేదు.

News September 30, 2024

మదనపల్లెలో టమాటా కిలో రూ. 60

image

మదనపల్లెలో టమాటా KG రూ.60 పలికింది. దిగుబడి తక్కువగా ఉండటంతో వ్యవసాయ మార్కెట్లో ధరలు పైపైకి పెరుగుతున్నాయి. ఆదివారం అత్యధికంగా కిలో ధర రూ.50 నుంచి రూ.60 వరకు పలికింది. 25 కిలోల క్రేట్ ధర రూ.1,500వరకు పలికిందని అధికారులు పేర్కొన్నారు. బయటరాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో పంటలేకపోవడంతో ఇక్కడి టమాటాకు డిమాండ్ పెరిగింది. వారంరోజులుగా కిలో రూ.44నుంచి రూ.50 వరకు పలకగా ఆదివారం రూ.60 చేరింది.

News September 30, 2024

గుంటూరులో యువకుడిపై కత్తితో దాడి

image

గుంటూరులో ఆదివారం రాత్రి ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. RTCకాలనీకి చెందిన ఖాసీం మందులు కొనడానికి రాత్రి రామిరెడ్డి తోటలోని ఓ మెడికల్ షాప్‌కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి మద్యం తాగి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఖాసీంతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఖాసీం దాడి చేశాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం GGHకు తరలించారు.

News September 30, 2024

నెల్లూరు: RTC బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

image

సంగం- కొరిమెర్ల మార్గమధ్యంలో రోడ్డు మలుపు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన నరసింహరావు(24) ఏఎస్ పేటలో జరిగే గంధమహోత్సవానికి బైక్‌పై వెళ్తుండగా సంగం- కలిగిరి రహదారిలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్‌టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 30, 2024

కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-24437 ల్యాండ్ లైన్ నంబర్‌కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

News September 30, 2024

రేపు పత్తికొండకు CM.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామానికి రేపు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ జి.బిందు మాధవ్ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్‌లో భాగంగా ఆదివారం పుచ్చకాయలమడలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు.