India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి బుధవారం మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాకు చెందిన విస్మద్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
CM చంద్రబాబు విశాఖలో నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ <<17736648>>హెల్త్ క్యాంప్<<>>ను సందర్శించారు. గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లకు మహిళలు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించి విలేజ్ క్లీనిక్ సెంటర్‌లో టెస్ట్‌లు చేసుకునేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి సత్యకుమార్ CMకి వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించిన CM ఓ చంటి బిడ్డకు డ్రాప్స్ వేశారు.
విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయని కలెక్టర్ తెలిపారు.
ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు సీఎంను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సీఎం చంద్రబాబు బుధవారం విశాఖ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కాన్వాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి AU సాగరిక ఫంక్షన్ హాల్‌కు బయలుదేరింది. మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ హెల్త్ క్యాంప్ సందర్శిస్తారు. అనంతరం AU కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించే సభలో పాల్గొంటారు.
ఒంగోలులో పిడుగుపాటుకు గురై పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఒంగోలు నగరం దద్దరిల్లింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు శివారు ప్రాంతంలో పదేళ్ల బాలుడు ఇంటి వద్ద ఉన్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడినట్లు సమాచారం. దీంతో బాలుడు మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడు కంకణాల చందుగా తెలుస్తోంది.
గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం తురకపాలెంలో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. జూన్, జులై నెలల్లో ఎదురయ్యే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు.
ఉదయగిరికి చెందిన ఓ మహిళ భర్త ఏడాది క్రితం చనిపోయాడు. ఆమెకు కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉంది. నెల్లూరు BVనగర్‌కు చెందిన వెంకటేశ్‌తో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. పిల్లలను బాగా చూసుకుంటానని అతను నమ్మించి కొండాయపాలెంలో ఇంటిని తీసుకున్నాడు. గత నెల 30న కుమార్తెతో కలిసి మహిళ ఈ ఇంటికి వచ్చింది. ఆమె బయటకు వెళ్లిన సమయంలో బాలికతో వెంకటేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. పోక్సో కేసు నమోదైంది.
శ్రీకాకుళం జిల్లాలో బంతి పూల ధరలు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వినాయక చవితి సమయంలో కిలో రూ.50-60 పలకగా ఆ తర్వాత ధర క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీకి రూ.20 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కిలోకు రూ. 35-40 వరకూ వస్తే పెట్టుబడులైనా దక్కుతాయని అంటున్నారు. రాబోయే దసరా సీజన్ పైనే బంతిపూల రైతులు ఆశలు పెట్టుకున్నారు.
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గంట్యాడ (M) కొండతామరపల్లిలోని చల్ల అప్పలనాయుడు కల్లంలో గుర్తించిన ఈ చెట్లకు ఉదయం 9.15 గంటలకు బొట్టు పెట్టే కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకటరావు, ఈవో శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్, ప్రెసిడెంట్ భాస్కర్, భక్తులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.