Andhra Pradesh

News July 20, 2024

ఎంపీ విజయసాయి రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి భేటీ

image

ఢిల్లీలో చేపట్టబోయే దీక్షకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎంపీ విజయసాయి రెడ్డితో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యను నిరసిస్తూ ఈ నెల 24 వ తేదీ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు.

News July 20, 2024

MED, MPED 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో MED, MPED 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఫలితాలను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫలితాల కోసం ఏయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

News July 20, 2024

సుండుపల్లి: 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

image

సుండుపల్లి మండలం సానిపాయ అటవీ ప్రాంతంలో 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, ఒకరిని అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్సు పోలీసులు తెలిపారు. సానిపాయ బేస్ క్యాంపు నుంచి రాయవరం మీదుగా ఆవుల దారి, ముడుంపాడు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ వెళుతూ కనిపించారన్నారు. వారిలో ఒకరిని పట్టుకున్నామని తెలిపారు. 8 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

News July 20, 2024

ముదివేడు: ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్

image

ముదివేడు కస్తూర్భా పాఠశాలలో ముగ్గరు విద్యార్థులు రెండు రోజులు క్రితం ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ఉన్నాధికారులు ప్రిన్సిపల్ రఫియా పర్వీన్, హిందీ టీచర్ గౌసియా మస్తానీ, ఏఎన్ఎం భాను, అకౌంటెంట్‌లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

కర్నూలులో సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

image

సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, హోం మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజుయాదవ్ ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ నేతలను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని రాజుయాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

News July 20, 2024

సింగరాయకొండ: పాకల రైల్వే గేట్ మూసివేత

image

సింగరాయకొండ, పాకల మధ్య ఉన్న రైల్వే గేట్‌ని జులై 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అత్యవసర రైల్వే పనుల కారణంగా మూసివేస్తున్నట్లు సింగరాయకొండ రైల్వే శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 28వ తేదీ వరకు సోమరాజు పల్లి రైల్వే గేట్‌ను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

News July 20, 2024

ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను త‌నిఖీ చేయాలి: బి.ఆర్ అంబేడ్కర్‌

image

జిల్లాలోని ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌పై నిఘా పెంచాల‌ని క‌లెక్ట‌ర్ బి.ఆర్ అంబేడ్కర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌డీలతో క‌లిసి జిల్లాలోని 108 ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను త‌నిఖీ చేసి, త‌న‌కు నివేదిక అంద‌జేయాల‌ని DMHOను ఆదేశించారు. క‌లెక్ట‌రేట్‌లో జిల్లా స్థాయి స‌ల‌హా క‌మిటీ స‌మావేశంలో శనివారం కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధార‌ణ చేసిన‌వారిపై కేసులు న‌మోదు చేసి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

News July 20, 2024

కోయంబత్తూర్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కోయంబత్తూరు-దానాపూర్ మధ్య ఒక వైపు ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. ఈనెల 21వ తేదీ రాత్రి 11.30 గంటలకు కోయంబత్తూరులో బయలు దేరి మర్నాడు రాత్రి 8.10 గంటలకు దువ్వాడ చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 8.15 గంటలకు బయలుదేరి దానాపూర్ వెళ్తుందన్నారు.

News July 20, 2024

ఆగస్టు 12,13 తేదీల్లో MCA 4వ సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో MCA 4వ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 12,13 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు. పరీక్షల విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆగస్టు 12న డేటాసైన్స్, ఆగస్టు 13న సెలెక్టివ్-2 గా ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ కంప్యూటింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.

News July 20, 2024

VZM: ఐదు నెలల్లో 87 మంది శిశువులు మృతి

image

శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఆగడం లేదు. కొంతమంది తల్లులకు అవగాహన లోపం..కొన్ని చోట్ల వైద్య సేవల్లో జాప్యంతో శిశు మరణాలు సంభవిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో మార్చి నెల 16, ఏప్రిల్‌లో 17, మే నెలలో 19, జూన్ లో 25, జులై లో 10 శిశు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇవి తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు DMHO బాస్కరరావు తెలిపారు.