Andhra Pradesh

News July 20, 2024

నెల్లూరు: పెట్రోల్ బంకులపై వాహనదారుల ఆగ్రహం

image

జిల్లాలోని పలు పెట్రోల్ బంకులలో గాలి మిషన్లు పని చేయడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 189 పెట్రోల్ బంకులు ఉండగా ప్రతి రోజూ 7 లక్షల లీటర్ల డీజిల్, 4 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోంది. నిబంధనల మేరకు ప్రతి బంకులో గాలి మిషన్ ఏర్పాటు చేయాలి. కొన్ని చోట్ల గాలి మిషన్లు లేవని, మరికొన్ని చోట్ల పని చేయడం లేదన్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు వాహన దారులు వాపోయారు.

News July 20, 2024

పుల్లంపేటలో రౌడీ షీటర్ సూసైడ్

image

పుల్లంపేట మండలం రామక్కపల్లెలో జయసింహ అనే రౌడీ షీటర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జయసింహ తల్లిదండ్రులు చాలా కాలంగా ఉపాధికోసం కువైట్‌ వెళ్లారు. గొడవల కారణంగా అతడిపై ఆరేళ్ల క్రితం రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సింది ఉంది.

News July 20, 2024

GNT: తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన బాలుడు

image

తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి జీజీహెచ్‌లో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కొత్తపేట పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు బాలుడిని అప్పగించారు. షేక్ అబ్దుల్ బాసిత్ (9) జీజీహెచ్‌లో ఒంటరిగా తిరుగుతుండగా.. గమనించిన స్థానికులు బాలుడిని కొత్తపేట పోలీసులకు అప్పగించారు. బాలుడు తల్లిపేరు షరీఫా అని, విజయవాడలోని సుందరయ్యకాలనీలో నివాసం ఉంటున్నట్లు చెప్పాడన్నారు. తెలిసినవారు 0863-2221815 ఫోన్ చేయగలరని సీఐ తెలిపారు.

News July 20, 2024

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనిత

image

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతంరం ఆమె శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

News July 20, 2024

ఏలూరు: వ్యక్తి దారుణ హత్య

image

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో శనివారం దారుణం జరిగింది. పాతకోకల లాజరు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు కొక్కిరిపాటి సుబ్బారావు హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

టంగుటూరు: ఇద్దరు యువకులు గల్లంతు.. ఒకరి మృతి

image

టంగుటూరు మండలంలో వాసేపల్లిపాడుకు చెందిన ఇద్దరు యువకులు ఈతకి వెళ్లి ఇద్దరు గల్లంతు అయ్యారు. వారిని వెంకటేశ్,(22) నవీన్(22) గా గుర్తించారు. గల్లంతయిన వ్యక్తుల్లో వెంకటేశ్ మృతదేహం లభ్యం కాగా, నవీన్ మృతదేహం కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మట్టి కోసం తీసిన పెద్ద గుంతలు ఉండటంతోనే మృతిచెందినట్లు స్థానికులు తెలపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

ధర్మవరం పరిధిలో దారుణ హత్య

image

ధర్మవరం మండలం కొత్తకోట గ్రామం సమీపంలో దారుణ హత్య జరిగింది. చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. సూర్యనారాయణ స్వగ్రామం తాడిమర్రి కాగా వివాహ అనంతరం వెల్దుర్తిలో నివాసం ఉంటున్నాడు. మృతుడికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

News July 20, 2024

సింహాచలం: రేపు దిల్లీ విజయోత్సవం

image

ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఈనెల 21న అప్పన్న ఆలయంలో దిల్లీ విజయోత్సవం నిర్వహించనున్నారు. భగవత్ రామానుజులు దిల్లీ బాదుషాను పాండిత్యంలో మెప్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని జరపడం ఆలయ సంప్రదాయంగా వస్తుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు భక్తుల దర్శనాలను నిలిపివేసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

News July 20, 2024

ప.గో.: MPDO మిస్సింగ్.. వీడని మిస్టరీ

image

5 రోజుల క్రితం కనిపించకుండా పోయిన నరసాపురం MPDO వెంకటరమణారావు ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏలూరు కాలువ వద్ద ఆయన ఫోన్ సిగ్నల్ చివరగా కట్ అవడంతో కాలువను జల్లెడపడుతున్నా.. ఇంతవరకు ఆనవాళ్లు కనిపించలేదు. ఒకవేళ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికే మృతదేహం తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు. శుక్రవారం 50 మంది NDRF, SDRF బృందాలు కాలువలో గాలించారు.

News July 20, 2024

తూ.గో.: నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారుల తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి తూ.గో. జిల్లాలోని పెద్దాపురంలో మాత్రమే నవోదయ విద్యాలయం ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.