Andhra Pradesh

News July 20, 2024

శ్రీకాకుళం:విద్యుత్ సమస్యలకు హెల్ప్ డెస్క్ నంబర్ ఏర్పాటు

image

వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారుల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ కృష్ణమూర్తి తెలిపారు. తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజలు తమ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యల ఫిర్యాదు చేసేందుకు 9490612633 హెల్ప్ డెస్క్ నంబరును సంప్రదించాలని సూచించారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1912కు విద్యుత్ సమస్య వస్తే కాల్ చేయాలన్నారు.

News July 20, 2024

ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు: DEO

image

ఎన్టీఆర్ జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో యూవీ. సుబ్బారావు శనివారం ఉదయం తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు స్పష్టం చేశారు. కావున ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు గమనించాలని పేర్కొన్నారు.

News July 20, 2024

GNT: తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన బాలుడు

image

తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి జీజీహెచ్‌లో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కొత్తపేట పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు బాలుడిని అప్పగించారు. షేక్ అబ్దుల్ బాసిత్ (9) జీజీహెచ్‌లో ఒంటరిగా తిరుగుతుండగా.. గమనించిన స్థానికులు బాలుడిని కొత్తపేట పోలీసులకు అప్పగించారు. బాలుడు తల్లిపేరు షరీఫా అని, విజయవాడలోని సుందరయ్యకాలనీలో నివాసం ఉంటున్నట్లు చెప్పాడన్నారు. తెలిసినవారు 0863-2221815 ఫోన్ చేయగలరని సీఐ తెలిపారు.

News July 20, 2024

ప్రకాశం: గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉద్యోగాలు

image

గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాయవరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆశాలత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఫిజిక్స్- 1 పోస్టు, గణితం-2, ఆంగ్లం-1, హిందీ-2, సివిక్స్-1, పీటీఈ- 5 పోస్టులు, జీఎన్ఎం నర్స్- 1 పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు లోపు దరఖాస్తులను చీమకుర్తి గురుకుల పాఠశాలల్లో అందజేయాలన్నారు.

News July 20, 2024

ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు: DEO

image

ఎన్టీఆర్ జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో యూవీ. సుబ్బారావు శనివారం ఉదయం తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు స్పష్టం చేశారు. కావున ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు గమనించాలని పేర్కొన్నారు.

News July 20, 2024

రానున్న ఐదు రోజుల్లో అనంతపురం జిల్లాలో వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్ బాబు, నారాయణ స్వామి తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News July 20, 2024

నేను ఇంటర్ ఈ కాలేజ్‌లోనే చదివా: కర్నూల్ ఎంపీ

image

టౌన్ మోడల్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శుక్రవారం నగరంలోని ఆ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఇదే కళాశాలలో తాను ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశానని గుర్తుచేశారు. కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అవసరమైతే ఎంపీ నిధులను కళాశాల అభివృద్ధికి ఖర్చు చేస్తానని ప్రకటించారు.

News July 20, 2024

పలాస: మేడ పైనుంచి జారిపడి ఆర్ఎంపీ వైద్యుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి సాయి కాలనీ నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ కుందు శ్రీను(47) శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మేడ పైనుంచి కాలుజారి కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేశారు. కుందు శ్రీనుకు భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

News July 20, 2024

ప.గో.: బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు

image

ప.గో. జిల్లాకు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం HYD వెళ్లింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తూ తన పిల్లలు బాలిక(11), బాలుడు(12)ని చదివిస్తోంది. 2018లో బాలికపై స్థానికుడు బ్రహ్మం(24) ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా నిందితునికి పదేళ్ల జైలు, రూ.5లక్షలు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.

News July 20, 2024

పార్వతీపురం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన డీఈఓ

image

పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు డీఈఓ పగడాలమ్మ సెలవు ప్రకటించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు శనివారం నాడు సెలవు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆమె కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి విద్యార్థులు తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని ఆమె కోరారు.