Andhra Pradesh

News July 20, 2024

తూ.గో.: సొంతజిల్లాకు 70 మంది తహశీల్దార్లు

image

ఎన్నికల సందర్భంగా ఉమ్మడి తూ.గో. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన 24 మండలాల పరిధిలోని 70 మంది తహశీల్దార్లు తిరిగి సొంత జిల్లాకు రానున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి 70 మంది ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాలకు బదిలీపై వెళ్లారు.

News July 20, 2024

కర్నూలు జిల్లాలో 21 మండలాల్లో వర్షం

image

అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 21 మండలాల్లో వర్షం కురిసింది. దేవనకొండలో అత్యధికంగా 22.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదోని 16.2, పత్తికొండ 8.0, క్రిష్ణగిరి 6.6, అస్పరి 6.2, మద్దికెర 5.6, కౌతలం 4.2, గోనెగండ్ల 3.8, తుగ్గలి 3.4, కర్నూలు అర్బన్ 0.8, సి.బెళగల్‌లో 0.2 మి మీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 3.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News July 20, 2024

అనంతపురం జిల్లాలో అగ్నిగుండంలో పడిన వ్యక్తి మృతి

image

ఉరవకొండ మండల చిన్నకౌకుంట్లలో ఈ నెల 17న జరిగిన మొహర్రం వేడుకల్లో అపశ్రుతి జరిగిన విషయం తెలిసిందే. చాకలి ఆదినారాయణ (38) అనే వ్యక్తి అగ్నిగుండంలో కింద పడ్డారు. అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారని పోలీసులు తెలిపారు. పీర్ల అగ్నిగుండ ప్రవేశం సమయంలో ప్రమాదవశాత్తు పడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు.

News July 20, 2024

నేడు విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమం నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాల యాజమాన్యాలకు కలెక్టర్ ఉత్తర్వులు పంపారు. పాఠశాలకు కచ్చితంగా సెలవు ఇవ్వాలని సూచించారు. వర్షాల దృష్ట్యా అల్లూరి జిల్లాలోని స్కూల్లకు కూడా సెలవు ప్రకటించారు.

News July 20, 2024

జగన్‌పై మంత్రి గొట్టిపాటి సంచలన వ్యాఖ్యలు

image

వినుకొండలో జరిగిన హత్యను టీడీపీ ప్రభుత్వానికి ఆపాదించడం హేయమైన చర్యని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వివాదాన్ని రెచ్చగొట్టేందుకే జగన్ వినుకొండలో పర్యటిస్తున్నారని, హత్యా రాజకీయాలకు పేటెంట్ హక్కు వైసీపీకే దక్కుతుందని ఆరోపించారు. చంద్రబాబు వద్ద జగన్ ఆటలు సాగవనే విషయం తెలుకోవాలని అన్నారు. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

News July 20, 2024

నరసాపురం- గుంటూరు రైలు పునరుద్ధరణ

image

రైల్వే లైన్ల మరమ్మతుల్లో భాగంగా ఇటీవల నిలుపుదల చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి నరసాపురం- గుంటూరు, 22 నుంచి గుంటూరు- నరసాపురం రైళ్లు యథావిధిగా నడుస్తాయని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News July 20, 2024

రేపు తిరుపతిలో రోల్‌బాల్ ఎంపికలు

image

తిరుపతి, చిత్తూరు రోల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రోల్‌బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శులు ప్రేమ్‌నాథ్, కార్తీక్ తెలిపారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో అండర్-11, 14, 17, సీనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడా కారులు తమ పేర్లను శనివారం సాయంత్రంలోపు నమోదు చేసుకోవాలన్నారు.

News July 20, 2024

కడపలో కొడుకు హత్య.. బాధ లేదంటున్న తండ్రి

image

కడప బిల్డప్ సర్కిల్‌లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల.. వెంకటేశ్(32) మద్యానికి బానిసై, అందరితో గొడవపడేవాడు. దీంతో భార్యాపిల్లలు అతనికి దూరంగా ఉంటున్నారు. సాధిక్ వలితో ఇతనికి పాతగొడవలు ఉండేవి. దీంతో నిన్న సాధిక్ వెంకటేశ్‌ను హత్య చేశాడు. గతంలో తనను చంపడానికి యత్నించాడని, తల్లిని హింసించేవాడని, కొడుకు హత్యకు గురయ్యాడనే బాధ తనకు లేదని వెంకటేశ్ తండ్రి కృష్ణయ్య అన్నాడు.

News July 20, 2024

కాకినాడ: సముద్ర తీరంలో రక్షణ గోడ

image

ఉప్పాడ ప్రాంతంలో సముద్ర కోత నుంచి తీరానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాకినాడ వాకలపూడిలోని లైట్‌ హౌస్‌ నుంచి ఉప్పాడ కొత్త హార్బర్‌ ప్రాంతం వరకు కోత ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య 14.5 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. సుబ్బంపేట నుంచి హార్బర్‌ వరకు కెరటాల ప్రభావం తగ్గించడానికి గ్రోయల్‌ గట్లు నిర్మించనున్నారు.

News July 20, 2024

ANU పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద పీజీ కోర్సులలో చేరేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. MA, Mcom Msc, MA (జర్నలజం- మాస్ కమ్యూనికేషన్),MPA, MLISC , MED, MPED కోర్సులలో చేరేందుకు ఈనెల 31న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఈనెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చని సంచాలకులు అనిత తెలిపారు.