India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్‌పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.
ఒంగోలు DEO కార్యాలయంలో సింగరాయకొండలో జరిగిన ఫోక్సో కేసు అంశంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, డిప్యూటీ ఈవో చంద్రమౌళీశ్వరు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసులను 164 స్టేట్మెంట్ ఆధారంగా తప్పుడు రీతిలో రిఫర్ చేస్తున్న పరిస్థితిపై చర్చ సాగింది. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని డీఈఓ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మంగళవారం మృతి చెందింది. భీమవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి ఈనెల 12న రాత్రి గంట్యాడ మండలం కొండతామరపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు గత 2 రోజులుగా నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర కేసులు మినహా మిగతా కేసులకు సీటీ స్కాన్ సేవలు నిలిపివేయడంతో పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా సీటీ స్కాన్ సేవలు అందుతున్న విషయం విదితమే. సంస్థకు ప్రభుత్వం నుంచి బకాయిలు పెండింగ్ ఉండడంతో సేవలు నిలిపివేసినట్లు స్థానికులు అంటున్నారు.
దొంగ నోట్ల మార్పిడి కేసులో ఐదుగురు ముద్దాయిలకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేలు జడ్జి పద్మశ్రీ మంగళవారం తీర్పునిచ్చారు. SI మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. సిద్దవటం మండలంలోని మాధవరం-1లోని ఓ వైన్ షాపులో 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన మాధవరెడ్డి, షర్ఫుద్దీన్, వెంకటేశ్వర్లు, అల్తాఫ్, హుస్సేన్ వలిలు వెయ్యి రూపాయల దొంగ నోటు చలామణి చేయగా కేసు నమోదైంది.
చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ ఏఎం నరేంద్రకు కీలక పదవి లభించింది. ఆయనను పర్యాటక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టూరిజం రంగంపై నరేంద్ర ఇప్పటివరకు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అనేక శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు. విద్యారంగంలో విశేష అనుభవంతో పాటు సామాజిక రంగంలోనూ ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమించింది.
తమ జీవితకాలంలో సంపాదించిన ఆస్థిని వారసులకు దానంచేసి, చిత్రహింసకు గురవుతున్న వయోవృద్ధులకు జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ న్యాయం చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చియ్యపాడుకు చెందిన కృష్ణారెడ్డి జమ్మలమడుగుకు చెందిన బాలమ్మ, దువ్వూరుకు చెందిన మహమ్మద్ గౌస్‌లు తమ ఆస్థిని వారసులకు రాసిచ్చారు. వారసులు పోషణను పట్టించుకోకపోవడంతో బాధితులు ఆర్డీఓను ఆశ్రయించారు. RDO ఆస్తి తిరిగి పెద్దలకు వచ్చేలా చేశారు.
నరసన్నపేట మేజర్ పంచాయతీలో తాగునీటి వెతలు తీరడం లేదు. ప్రజలు గత రెండు రోజులుగా తాగేనీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఫలితం వల్లే తాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సరఫరాపై అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదని, పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందని, రోజుల తరబడి తాగునీటికి ప్రజలు ఎదురు చూడడం పరిపాటిగా మారిందని అంటున్నారు.
ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడుకు చెందిన బాలాజీ భార్య భాగ్యలక్ష్మిని <<17730782>>భర్త విచక్షణారహితంగా కొట్టి<<>>న విషయం తెలిసిందే. కాగా వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వేరే మహిళతో హైదరాబాదులో ఉంటున్నాడు. భార్య స్థానికంగా ఓ బేకరీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన భర్త తనతల్లి ప్రేరేపనతో భార్యను హింసిస్తుంటాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు.
ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాదిగా ఉంటుందని, జిల్లాలో పోషణ మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరంలో కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు అవగాహన కార్యక్రమాలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం అనేది ప్రమాదకరంగా మారిందన్నారు.
Sorry, no posts matched your criteria.