Andhra Pradesh

News July 20, 2024

VZM: 24 గంటలు Be Alert

image

జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని వాగులు, గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అన్ని మండలాల తహశీల్దార్, రెవెన్యూ డివిజన్‌లను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.బీ.ఆర్. అంబేడ్కర్ ఆదేశించారు. వాగులు, గెడ్డలు ప్రవాహం కొనసాగుతున్న ప్రదేశాల్లో ఎవరూ వాటిని దాటకుండా, ప్రమాదాలు జరగకుండా 24 గంటల పహారా ఏర్పాట్లు చేయాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ఈ రోజు అన్నీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

News July 20, 2024

ప.గో.: నేడు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు

image

విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అన్ని పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ప.గో., ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులు నాగమణి, అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ఆర్వో చంద్రశేఖర్ బాబు చెప్పారు.

News July 20, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించినట్లు డీఈవో వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. మరో సెలవు రోజున పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

News July 20, 2024

భీమిలి: ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై సీఎంఓ ఆదేశం

image

ఎర్ర మట్టి దిబ్బల తవ్వకాలను వెంటనే ఆపివేయాలని సీఎంఓ విశాఖ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎంత మేర తవ్వకాలు జరిగాయనే విషయంపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. భీమిలి హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా భూములను చదును చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.

News July 20, 2024

నేడు కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవులు

image

కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా డీఈవో తాహేరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారాన్ని జిల్లాలోని డీవైఈఓలు, ఎంఈఓలు అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు.

News July 20, 2024

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

image

అగ్నివీర్ పథకంలో భాగంగా భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని నంద్యాల జిల్లా ఉపాధి కల్పనాధికారిణి పి.దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. 21ఏళ్లలోపు వయసు, కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్హతలు ఉండాలన్నారు. ఆన్లైన్‌లో జులై 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.

News July 20, 2024

అనంతపురం జిల్లాకు రానున్న 64 మంది తహసీల్దార్లు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన తహసీల్దార్లు ఎన్నికల విధులపై ఇతర జిల్లాలకు వెళ్లారు. వారంతా మళ్లీ సొంత జిల్లాకు తిరిగిరానున్నారు. జిల్లా వ్యాప్తంగా 64 మంది తమ సొంత మండలాలకు రానున్నారు. అందులో అనంతపురం జిల్లా 39 మంది, శ్రీ సత్యసాయి జిల్లాకు 23 మంది రానున్నారు. వీరిని ఈ ఏడాది జనవరిలో కడప, చిత్తూరు, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు బదిలీలు చేశారు.

News July 20, 2024

నేడు కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవులు

image

కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా డీఈవో తాహేరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారాన్ని జిల్లాలోని డీవైఈఓలు, ఎంఈఓలు అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు.

News July 20, 2024

ఏలూరు జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు: విశ్వనాథ్

image

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జిల్లాలోని అన్ని గ్రామాలలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా 1450 తాగునీటి ట్యాంకులను శుభ్రపరచి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న 1400 మంది క్లాప్ మిత్రాల సేవలను గ్రామాల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు.

News July 20, 2024

టీచర్స్, సిబ్బంది సూళ్లకు రావాలి: డీఈవో

image

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించినట్లు డీఈవో కే.వాసుదేవరావు తెలిపారు. అయితే.. విద్యార్థులకు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నామని, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది యథావిధిగా హాజరు కావాలని ఆయన తెలిపారు.