Andhra Pradesh

News July 20, 2024

భారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: జేసీ

image

భారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనం నుంచి వరదలు, భారీ వర్షాల విపత్తు నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News July 20, 2024

తూ.గో: నేడు విద్యా సంస్థలకు సెలవు

image

భారీ వర్షాల కారణంగా శనివారం తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు పి.ప్రశాంతి, మహేశ్ కుమార్, షాన్‌మోహన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాధారణ సెలవు కావడంతో వర్షాల తీవ్రతను పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామన్నారు.
➠ SHARE IT..

News July 20, 2024

తూపిలిపాలెంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

image

వాకాడు మండలం తూపిలిపాలెంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఆయన వాకాడు మండలం తూపిలిపాలెం తీరప్రాంతాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూపిలిపాలెం గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, బీచ్‌ను అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, అన్ని శాఖల అధికారులు ఉన్నారు.

News July 20, 2024

డీఐజీతో భేటీ అయిన కడప ఎస్పీ

image

కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు భేటీ అయ్యారు. ఇటీవల కడప ఎస్పీగా బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో కర్నూలులోని డీఐజీ కార్యాలయంలో కోయ ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం కడప జిల్లాలో నెలకొన్న రాజకీయ నేతల మధ్య వైరం, నియోజకవర్గాల వారిగా సమస్యలు వివరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, ఇతర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

News July 20, 2024

పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి: ఎస్పీ

image

పెండింగ్ కేసులపై దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఒంగోలు ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కేసు దర్యాప్తులో ప్రత్యేక టీంగా ఏర్పడి త్వరగా చేధించాలన్నారు. మహిళల భద్రతకు స్టేషన్ పనితీరును మరింత మెరుగుపరుస్తామని ఎస్పీ వెల్లడించారు.

News July 19, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్
* బాపట్ల జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు
* వినుకొండ హత్యకు కారకుడు జగనే: మంత్రి డోలా
* త్రికోటేశ్వరుని ఆదాయం రూ.20.96 లక్షలు
* దుగ్గిరాల: పశ్చిమ డెల్టాకు 2010 క్యూసెక్కుల నీరు
* తెనాలి డిపోకు 10 కొత్త బస్సులు
*వినుకొండలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత

News July 19, 2024

విజయనగరం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్క‌ర్ కోరారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

News July 19, 2024

SKLM: మత్స్యకార వేటనిషేధ పరిహార భృతికి 12,952 మంది ఎంపిక

image

వేటనిషేధ కాలంలో పరిహార భృతి అందించే ప్రక్రియలో అర్హులను సర్వే ద్వారా గుర్తించి, ఆ జాబితాను నవశకం పోర్టల్లో పొందుపరిచామని జిల్లా మత్స్యకార అధికారి పి.వి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది మేలో 15,375 మందిని గుర్తించి అందులో 12,952 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. రీవెరిఫికేషన్‌లో ఇంకా అర్హులుంటే వారిని కూడా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయన్నారు.

News July 19, 2024

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌‌లో నాయుడుపేట వద్ద పొగలు

image

పాండిచ్చేరి నుంచి కాకినాడ పోర్టు వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో, సాంకేతిక లోపం తలెత్తి నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్దకు వచ్చే సరికి ఎస్ 8 బోగీలో పొగలు వ్యాపించాయి. ట్రైన్ బోగీలో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ట్రైన్‌లోని ప్రయాణికులు, ట్రైన్ కోసం ప్లాట్ ఫామ్‌పై వేచి ఉన్న ప్రయాణికులు భయంతో, తమ లగేజీలను తీసుకుని రైల్వే స్టేషన్ వెలుపలకు పరుగులు తీశారు.

News July 19, 2024

రాజంపేట: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

image

రాజంపేట మండలం పోలి చెరువుకట్ట సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ ఏకశిర సుబ్బయ్య(27) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి భార్యాబిడ్డలు కన్నీటీపర్యంతమవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.