Andhra Pradesh

News July 19, 2024

నెల్లూరు: 3వ రోజు తప్పిపోయిన 152 మంది పిల్లలు సేఫ్

image

బారాషాహీద్ దర్గా నందు ఏర్పాటు చేసిన పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన డ్రోన్, PTZ, CC TV ఫుటేజీలను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. బందోబస్త్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. మొదటి రోజు 92, రెండవ రోజు 140, మూడవ రోజు 152 మంది తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల వద్దకు నెల్లూరు పోలీసులు చేర్చారు. నిరంతరం పోలీసు పర్యవేక్షణలో దర్గా ప్రాంగణం ఉందన్నారు.

News July 19, 2024

గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి..!

image

సింహాచలం గిరి ప్రదక్షిణకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలో మీటర్ల మేర సాగే నడక మార్గంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
➣ సింహాచలం దేవస్థానం: 0891-2954944/9390501082
➣ జీవీఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్:1800-42500009
➣ వాటర్ సప్లై&పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్: 0891-2869111
➣ విశాఖ పోలీస్: 9390105353/9330105355
>>> Share it

News July 19, 2024

గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి..!

image

సింహాచలం గిరి ప్రదక్షిణకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలో మీటర్ల మేర సాగే నడక మార్గంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
➣ సింహాచలం దేవస్థానం: 0891-2954944/9390501082
➣ జీవీఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్:1800-42500009
➣ వాటర్ సప్లై&పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్: 0891-2869111
➣ విశాఖ పోలీస్: 9390105353/9330105355
>>> Share it

News July 19, 2024

ప్రకాశం: వేగం పుంజుకున్న రైల్వే లైన్ పనులు

image

ప్రకాశం జిల్లా, పశ్చిమ మెట్ట మండలాలను కలుపుతూ పోయే నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ మార్గం గుంటూరు జిల్లా నడికుడి నుంచి ప్రారంభమై, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా చిత్తూరు, శ్రీకాళహస్తి వరకు 308 కి.మీ నిర్మాణం జరుగుతుంది. 37 రైల్వేస్టేషన్లకు గాను, ప్రకాశం జిల్లాలో కురిచేడు, ముండ్లమూరు, దర్శి, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పామూరు స్టేషన్లకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది.

News July 19, 2024

పోలవరం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

image

పోలవరం ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రం వరకు నమోదైన నీటిమట్టం వివరాలను ఈఈ పెద్దిరాజు 6 గంటలకు వెల్లడించారు. స్పిల్ వే ఎగువన 28.890 మీటర్లు, స్పిల్ వే దిగువన 19.250 మీటర్లు, కాపర్ డ్యామ్ ఎగువన 29.100 మీటర్లు, కాపర్ డ్యామ్ దిగువన 1.740 మీటర్లు, కాపర్ డ్యాముల మధ్య 18.820 మీటర్ల నీటిమట్టం నమోదయినట్లు ఈఈ ప్రకటించారు.

News July 19, 2024

BREAKING: కడపలో రౌడీ షీటర్ దారుణ హత్య

image

కడపలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బిల్డప్ సర్కిల్ వద్ద గల పుత్తా ఎస్టేట్‌లో వెంకటేశ్ అనే రౌడీ షీటర్‌ను కొద్దిసేపటి క్రితం దుండగులు హతమార్చారు. ఈరోజు సాయంత్రం వెంకటేశ్ కొంతమందితో మద్యం తాగుతున్న క్రమంలో మత్తులో మాటకు మాట పెరగడంతో గాజు సీసాతో వెంకటేశ్‌ను పొడవగా, మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 19, 2024

రేపు తూ.గో, కోనసీమ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

image

భారీ వర్షాల కారణంగా శనివారం తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు ప్రశాంతి, మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు. ఆదివారం సాధారణంగా సెలవు కావడంతో వర్షాల తీవ్రతను పరిశీలించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

News July 19, 2024

వారం రోజుల లోపు వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసిన కూలీలకు వారం రోజులలోపు మీ వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం లేపాక్షి గురుకుల పాఠశాల వెనకవైపు ఉన్న మామిడి తోటను కలెక్టర్ పరిశీలించారు. 2 నెలల నుంచి బిల్లులు అందడం లేదని కూలీలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వారంలోపు మీకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించడానికి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు.

News July 19, 2024

శ్రీకాకుళం: B.Tech 4, 6 సెమిస్టర్ల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech కోర్సులకు సంబంధించి 4, 6 సెమిస్టర్ల పరీక్షల నోటిఫికేషన్ విడుదలయింది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కార్యాలయం నుంచి అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా పరీక్ష ఫీజు రూ.800, ప్రాక్టికల్ ఫీజు రూ.250 యూనివర్సిటీకి చెల్లించాలి. 4వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 31న, 6వ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానున్నాయి.

News July 19, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టరేట్ల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప.గో కలెక్టర్ సి.నాగరాణి, ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం సాధారణ సెలవు కావడంతో తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. SHARE IT..