Andhra Pradesh

News July 19, 2024

శ్రీకాకుళంలో జాబ్ మేళా.. 53 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూ నిర్వహించగా.. నిరుద్యోగ యువత 290 మంది హాజరయ్యారు. ఇందులో 53 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధా తెలిపారు.

News July 19, 2024

హోంమంత్రి నెలరోజుల పనితీరుకు మీరిచ్చే మార్కులెన్ని?

image

హోం మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టి నేటితో నెల రోజులైంది. ఉమ్మడి విశాఖ నుంచి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ ఈమె.100 రోజుల ప్రణాళికతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని.. అత్యాచారాలు, హత్యలు పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. మరి మంత్రి నెలరోజుల పనితీరుకు 10కి మీరిచ్చే మార్కులెన్ని?

News July 19, 2024

రాష్ట్రం అభివృద్ధి చెందాలని రొట్టెలు వదలండి: సీఎం చంద్రబాబు

image

నెల్లూరు ద‌ర్గాలో జరిగే రొట్టెల పండుగను సీఎం చంద్ర‌బాబు వీడియో వ‌ర్చువ‌ల్ ద్వారా వీక్షించారు. అనంతరం భక్తులతో, టీడీపీ నేతలతో లైవ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెంది, బాగా ఆదాయం రావాలని చెరువులో రొట్టెలు వదలమని చంద్రబాబు తెలిపారు. బారాష‌హీద్ దర్గాలో ఏర్పాటుచేసిన వీడియో వ‌ర్చువ‌ల్ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

News July 19, 2024

పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి: బాపట్ల కలెక్టర్

image

అధిక వర్షాల వలన ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్‌లోకి వరద నీరు ప్రవేశిస్తే పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శుక్రవారం బాపట్ల జిల్లా పరిధిలోని కొల్లూరు పరిసర ప్రాంతాలలో గల కృష్ణా నది ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. వరద నీరు అధికంగా వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

News July 19, 2024

20, 21 తేదీల్లో సిఫార్సు లేఖలు అనుమతించబడవు: ఈవో

image

సింహాచలం ఆలయంలో ఈనెల 20, 21 తేదీల్లో సిఫార్సు లేఖలు అనుమతించబడవని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. 20న గిరి ప్రదక్షిణ 21న ఆషాడ పౌర్ణమి మరియు చందన సమర్పణ సందర్భంగా లక్షలాది సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అన్నారు. ఈ కారణంగా సిఫార్సులకు అనుమతించమని స్పష్టం చేశారు. అలాగే కొండపైకి ఏ విధమైన వాహనాలకు అనుమతి లేదన్నారు.

News July 19, 2024

రాష్ట్రం అభివృద్ధి చెందాలని రొట్టెలు వదలండి: సీఎం చంద్రబాబు

image

నెల్లూరు ద‌ర్గాలో జరిగే రొట్టెల పండుగను సీఎం చంద్ర‌బాబు వీడియో వ‌ర్చువ‌ల్ ద్వారా వీక్షించారు. అనంతరం భక్తులతో, టీడీపీ నేతలతో లైవ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెంది, బాగా ఆదాయం రావాలని చెరువులో రొట్టెలు వదలమని చంద్రబాబు తెలిపారు. బారాష‌హీద్ దర్గాలో ఏర్పాటుచేసిన వీడియో వ‌ర్చువ‌ల్ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

News July 19, 2024

రషీద్ మృతిపై అంబటి ఏమన్నారంటే.!

image

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయాలపై కచ్చితంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడతారన్నారు. వారిద్దరూ YCP కార్యకర్తలేనా అని మీడియా అడగ్గా.. ఇవన్నీ పిచ్చిమాటలని వినుకొండలో అందరికీ తెలిసిన విషయమేనని, హత్య చేసిన వ్యక్తి TDPలోనే ఉన్నాడని, మొన్న ఆ పార్టీ గెలుపుకై పోరాడిన విషయం తెలిసిందేనన్నారు.

News July 19, 2024

23న సాఫ్ట్ బాల్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక

image

అనంతపురం నగర శివారులోని ఆర్డీటీ క్రీడా మైదానంలో ఈనెల 23న జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో సాఫ్ట్ బాల్ జూనియర్స్, సీనియర్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్స్ విభాగంలో 1-1-2007 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. జూనియర్స్ జట్టు ఆగస్టు 17 నుంచి శ్రీకాకుళంలో, సీనియర్స్ జట్టు ఆగస్టు 10 నుంచి వినుకొండలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

News July 19, 2024

కోనసీమ: మత్స్యకారుడి ప్రాణం తీసిన ‘చేపల వల’

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం కరవాకకు చెందిన మత్స్యకారుడు కొప్పనాతి రాంబాబు(38) చేపల వేటకెళ్లి మృతి చెందినట్లు నగరం SI పి.సురేష్ శుక్రవారం తెలిపారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఉదయం వేటకు వెళ్లిన రాంబాబు.. వల విసురుతుండగా ప్రమాదవశాత్తు అదే వలలో చిక్కుకుని నీటిలో పడి మునిగిపోయాడన్నారు. రాంబాబు మృతితో కరవాకలో విషాదం నెలకొంది.

News July 19, 2024

ఒంగోలు: బీజేపీలో చేరిన వైసీపీ నాయకురాలు

image

ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకురాలు జిల్లెలమూడి రమాదేవి శుక్రవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరగా, కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ముఖ్య మహిళా నేతగా ఈమె ఉన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.