Andhra Pradesh

News July 19, 2024

ఒంగోలు: బీజేపీలో చేరిన వైసీపీ నాయకురాలు

image

ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకురాలు జిల్లెలమూడి రమాదేవి శుక్రవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరగా, కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ముఖ్య మహిళా నేతగా ఈమె ఉన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

News July 19, 2024

ఉమ్మడి పశ్చిమ గోదావరికి వర్ష సూచన

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వానలకు ఏలూరు జిల్లా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది. పలు గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఉమ్మడి ప.గో జిల్లాకు హెచ్చరికలు జారీ చేసింది. శనివారం సైతం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT..

News July 19, 2024

తాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేయండి: ఎమ్మెల్సీ

image

అమరావతి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్సీ బీటీ నాయుడు కలిశారు. కర్నూలు జిల్లాలోని తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేయాలని కోరినట్లు బీటీ నాయుడు తెలిపారు. అనంతరం రాష్ట్రం గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.

News July 19, 2024

ఎన్టీఆర్: డీసీపీగా గౌతమ్ శాలి బాధ్యతలు

image

ఎన్టీఆర్ జిల్లా లా అండ్ ఆర్డర్ డీసీపీగా గౌతమ్ శాలి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా నేరుగా వచ్చి తనను సంప్రదించవచ్చన్నారు. గతంలో ఆమె అనంతపురం ఎస్పీగా పని చేసి విజయవాడ డీసీపీగా వచ్చారు.

News July 19, 2024

జేఎన్‌టీయూ ఇన్‌ఛార్జి వీసీగా రాజ్యలక్ష్మి బాధ్యతల స్వీకరణ

image

విజయనగరం జేఎన్‌టీయూ జీవీ ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్‌గా డి.రాజ్యలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.జయసుమ, వివిధ విభాగాల డైరెక్టర్లు, కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌, బోధన, బోధనేతర సిబ్బంది పుష్పగుచ్ఛాలతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందరి సహాయ సహకారాలతో విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

News July 19, 2024

పొందూరు ఖద్దరు పై వీడియో పోటీలు

image

గాంధీని ప్రభావితం చేసిన పొందూరు ఖద్దరు తయారీ పై ప్రభుత్వం వీడియో చిత్రీకరణ పోటీలను నిర్వహిస్తుందని రాష్ట్ర చేనేత, జౌలి శాఖ తెలిపింది. భారతీయ చరిత్రలో చేనేత ప్రాధాన్యతను గుర్తించి ఆగస్టు7వ తేదీన నిర్వహిస్తున్న జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పోటీల్లో పాల్గొనేవారు తాము రూపొందించిన వీడియోను రాష్ట్ర చేనేత కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీ లోపు సమర్పించాలన్నారు.

News July 19, 2024

వినుకొండలో రషీద్ ఇంటికి చేరుకున్న YS జగన్

image

వైసీపీ అధినేత YS జగన్ కార్యకర్త రషీద్ ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి కిందట వినుకొండ చేరుకున్న ఆయన మృతుడు రషీద్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించారు. పార్టీ తరఫున ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరికాసేపట్లో జగన్ మీడియాతో మాట్లాడనుండగా.. ఏం మాట్లాడతారా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.

News July 19, 2024

మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన జనసేన మహిళా నేత అరుణ

image

మంత్రి కొల్లు రవీంద్రను జనసేన మహిళా నేత రాయపాటి అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకుపుడుతోందని ఆమె అన్నారు. రాష్ట్ర అభివృద్ధే అజెండాతో ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు. 

News July 19, 2024

మాపై దాడికి పోలీసులే సాక్ష్యం: రెడ్డప్ప

image

పుంగనూరులో తమపైనే కేసులు పెట్టడం విడ్దూరంగా ఉందని చిత్తూరు మాజీ MP రెడ్డప్ప అన్నారు. ‘పోలీసుల సమక్షంలోనే నిన్న మా ఇంటిపై దాడి చేశారు. నేను, మిథున్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాం. అయినా మాపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది.’ అని ఆయన అన్నారు. నిన్నటి ఘటనపై రెడ్డప్ప ఫిర్యాదుతో టీడీపీ నాయకులపై.. సుహేల్ బాషా, RK ప్రసాద్ ఫిర్యాదుతో A1గా మిథున్ రెడ్డితో పాటు 77 మందిపై కేసులు పెట్టినట్లు సమాచారం.

News July 19, 2024

ఈనెల 21న పుట్టపర్తికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాక

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి ఈనెల 21న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల రానున్నట్టు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. గురు పౌర్ణమి వేడుకలను సత్యసాయి సన్నిధిలో జరుపుకోవడానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల 21న ఉదయం బెంగళూరు నుంచి రహదారి మార్గం గుండా పుట్టపర్తికి చేరుకుంటారు. గురుపౌర్ణమి వేడుకల అనంతరం తిరిగి వెళ్తారు.