Andhra Pradesh

News July 19, 2024

గిరి ప్రదక్షిణకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ ప్లేస్

image

ఈ నెల 20వ తేదీన జరుగుతున్న గిరి ప్రదక్షిణలో 2,3,4 వీలర్స్‌కు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నడిచి వెళ్లే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికగా వివిధ ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చేవారికి పార్కింగ్ ప్లేస్‌లో ఏర్పాటు చేశారు. విజయనగరం మార్గంలో వచ్చే భక్తులు అడవివరం వద్ద, హనుమంతవాక వైపు నుంచి వచ్చేవారు సెంట్రల్ జైలు వద్ద, రూరల్ ప్రాంతం నుంచి వచ్చేవారు సింహపురి కాలనిలో పార్కింగ్ చేసుకోవాలి.

News July 19, 2024

అన్నమయ్య జలాశయం పూర్తయ్యేనా..?

image

అన్నమయ్య జలాశయ పున:నిర్మాణంపై ప్రజలు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. 2021లో వచ్చిన వరదలకు డ్యాం మట్టికట్ట తెగిన విషయం తెలిసిందే. అప్పటి పాలకులు రెండేళ్లలో జలాశయాన్ని తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదు. కొంత కాలంగా ప్రాజెక్ట్‌లోకి విపరీతంగా వరద రావడంతో ఆ నీటిని వదిలేందుకు సరిపడా గేట్లు లేవని అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం మారడంతో ప్రాజెక్ట్ పూర్తవుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News July 19, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బోధనా సిబ్బందికి 23న డెమో

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాసంస్థల్లో పార్ట్‌టైమ్ గెస్ట్ ఉపాధ్యాయ/అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈనెల 23న డెమో నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారిణి ప్రేమావతి తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఈ డెమో జరగనున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఉద్యోగాలకు బీఈడీ, పీజీ, టెట్ పూర్తిచేసిన వారు అర్హులన్నారు.

News July 19, 2024

కొచ్చువేలి-బరోని మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొచ్చువేలి భరోని మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ఈనెల 25న ఉదయం 8 గంటలకు కొచ్చువాలీలో బయలుదేరి, 21న ఉదయం 11:45 గంటలకు దువ్వాడ చేరుకుని, 22న మధ్యాహ్నం బరోని చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 23న బయలుదేరి, మూడో రోజు తెల్లవారుజామున 5:25 కు దువ్వాడ చేరుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 1:30కు కొచ్చివేలి చేరుతుంది.

News July 19, 2024

విశాఖలో విజయనగరం వాసి మృతి

image

పరవాడలో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న తాపీ మేస్త్రీ అమరపు సురేశ్(32) మూడో ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడడంతో మృతి చెందాడు. ఈ ఘటన గురవారం సాయంత్రం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలానికి చెందిన సురేశ్ కుటుంబంతో కలిసి ఏడాదిన్నరగా పరవాడలో ఉంటున్నాడు. మృతుడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

News July 19, 2024

నెల్లూరు: సీఎస్ఈ గ్రూప్‌కు భలే డిమాండ్

image

ఇంజనీరింగ్‌లో సీఎస్ఈ గ్రూప్‌కు ఎంత డిమాండ్ ఉంది. నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ 8722 సీట్లకు 6788 సీట్లు భర్తీ అయ్యాయి. సిఎస్ఈ గ్రూప్‌కు 3357 సీట్లు కేటాయించగా ఇప్పటికే 3059 సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈ గ్రూపు 1725 సీట్లకు 1317 సీట్లు, ఏఐఎం, ఏఐఎం గ్రూపులకు 720 సీట్లకుగాను 661 భర్తీ కాగా మెకానికల్, ఈఈఈ ఉన్న సీట్లలో 50శాతం కూడా చేరలేదని ఉన్నత విద్య మండలి తెలిపింది.

News July 19, 2024

త్వరలో పోట్లగిత్త విడుదల: తులసి రెడ్డి

image

వెంకట్ దర్శకత్వంలో మానస్ హీరోగా తెరకెక్కిన సినిమా పోట్లగిత్త. ఈ సినిమాలో పీసీసీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ఓ ప్రముఖ పాత్ర పోషించారు. వేముల చింతలజూటూరుకు చెందిన మరో వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ విలన్ వీరప్ప పాత్రలో నటించారు. పులివెందుల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నట్లు తులసి రెడ్డి వెల్లడించారు.

News July 19, 2024

రిమాండు ఖైదీ పరారీ..పట్టుకున్న ఉరవకొండ పోలీసులు

image

గుత్తి మండలం టి.కొత్తపల్లికి చెందిన నరేశ్ పలు చోరీలు, గంజాయి కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. మతిస్తిమితంలేని వ్యక్తిగా ప్రవర్తిస్తుండటంతో 2నెలల కిందట విశాఖలోని పిచ్చాసుపత్రిలో చేర్చించారు. పిచ్చి నయంకావడంతో అతడిని బుధవారం అనంత ఏఆర్ పోలీసులు విశాఖ నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బయలుదేరారు. రైల్వేస్టేషన్‌లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఉరవకొండ పోలీసులు నరేశ్‌ను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.

News July 19, 2024

సెంచరీలతో అదరగొడుతున్న సిక్కోలు క్రికెటర్

image

సిక్కోలుకు చెందిన యువ క్రికెటర్ సుశాంత్ అద్భుతంగా రాణిస్తున్నారు. కడప జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో 121, రెండో మ్యాచ్‌లో 107 పరుగులతో వరుసగా సెంచరీలు కొట్టారు. మూడో రోజు కృష్ణా జిల్లాపై 68 పరుగులతో సత్తా చాటారు. పరుగుల వరద పారిస్తున్న సుశాంత్‌ భవిష్యత్తులో ఇండియా టీమ్‌కు ఎంపిక కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

News July 19, 2024

చిత్తూరు: ఆధార్ కోసం ప్రత్యేక క్యాంపులు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వ హించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. పెండింగ్ ఆధార్ సర్వీసులను అప్‌డేట్ చేయనున్నారు. ప్రతి మండలంలో క్యాంపులు నిర్వహించనున్నారు.