Andhra Pradesh

News July 19, 2024

గుంటూరు: రద్దు చేసిన రైళ్లను 21 నుంచి పునరుద్ధరణ

image

ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేసిన రైళ్లను 21వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. గుంటూరు-డోన్ (17228), నర్సపూర్-గుంటూరు (17282)రైళ్లను ఈనెల 21వ నుంచి, డోన్-గుంటూరు (17227), గుంటూరు-నర్సపూర్ (17281) రైళ్లు ఈ నెల 22వ తేదీ నుంచి పాత సమయాల ప్రకారం యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు. 

News July 19, 2024

NLR: పవన్‌కు సర్పంచ్ సంచలన లేఖ

image

నెల్లూరు జిల్లాలో ఓ సర్పంచ్ డిప్యూటీ సీఎం పవన్‌కు లేఖ రాశారు. ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా లక్ష్మి గెలిచారు. ‘గిరిజనురాలినని మూడేళ్లుగా YCP నాయకులు, పంచాయతీ కార్యదర్శి వేధించారు. నా సంతకం ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారు. సర్పంచ్ నేనైనా పాలన అంతా వైసీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఉపసర్పంచ్ అనితా రెడ్డి చేశారు. దీనిపై విచారణ చేయండి’ అని ఆమె కోరారు.

News July 19, 2024

కృష్ణా: ఆక్వాటిక్ క్రీడాకారులకు ముఖ్య గమనిక

image

విజయవాడలోని VMC సర్ విజ్జి ఈత కొలనులో ఆగస్టు 4న ఎన్టీఆర్ జిల్లా సీనియర్ ఆక్వాటిక్ జట్టు ఎంపిక పోటీలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆక్వాటిక్ సంఘ కార్యదర్శి రమేశ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీల్లో పాల్గొనే స్విమ్మర్లు(17-25 సంవత్సరాలలోపు వారు మాత్రమే) జులై 30లోపు జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య UID సంఖ్యతో ఆక్వాటిక్ సంఘం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని రమేశ్ సూచించారు.

News July 19, 2024

చిత్తూరు: రెగ్యులర్ ఎస్ఈగా సురేంద్రనాయుడు

image

విద్యుత్తు శాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి సర్కిల్ ఎస్ఈగా సురేంద్రనాయుడు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ ఎస్ఈగా కొనసాగుతున్న ఆయన్ను రెగ్యులర్ ఎస్ఈగా నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎస్ఈగా పనిచేసిన కృష్ణారెడ్డిని తిరుపతి కార్యాలయంలో ఆపరేషన్- నిర్వహణ విభాగం జీఎంగా నియమించారు.

News July 19, 2024

కర్నూలు: జాహ్నవి కందుల మృతి.. ఊడిన అమెరికా పోలీసు ఉద్యోగం

image

కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి విలువలేదు’ అన్నట్లుగా ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆ అధికారిపై తాజాగా చర్యలు తీసుకున్నారు.

News July 19, 2024

శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్(08942-240557 నంబరు) ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

News July 19, 2024

2వ రోజు రొట్టెల పండుగకు 2లక్షలకు పైగా భక్తులు హాజరు

image

నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగకు రెండో రోజు భక్తులు పోటేత్తారు. గురువారం సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, జేసీ సేదుమాధవన్, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శర్మద ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

News July 19, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. తుఫాన్‌ బాధితులు ఫోన్‌ నెంబర్లు 9913148180, 7801007227, 7095454117, 9989900094 నెంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు. అలాగే రాజమండ్రిలో ఉమ్మడి తూ.గో జిల్లా స్థాయి కంట్రోల్‌ రూమ్‌ నెం. 0883-2463354,7382299960.

News July 19, 2024

కడప: అగమ్యగోచరంగా 100 ప్రభుత్వ పాఠశాలలు

image

జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 1,861 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 88,164 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో 100పైగా పాఠశాలల్లో ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఈ పాఠశాలల భవిష్యత్ ఆందోళనగా మారింది. గత ప్రభత్వం తెచ్చిన జీవో.నం 117 వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు వాపోయారు.

News July 19, 2024

భారీ వర్షాలు.. రాకపోకలు బంద్

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  పలు ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో నదిపాయకు వేసిన తాత్కాలిక గట్టు గురువారం తెగిపోయింది. దీంతో గంటిపెదపూడి, బురుగులంక, అదిగెలవారిపాలెం, ఉడేమూడిలంక గ్రామాల మధ్య రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.