Andhra Pradesh

News July 19, 2024

గుంతకల్లులో చిప్పగిరి ఎంపీపీ కారు అద్దాలు ధ్వంసం

image

గుంతకల్లులోని హౌసింగ్ బోర్డులో అద్దె ఇంట్లో నివాసముంటున్న కర్నూలు జిల్లా చిప్పగిరి ఎంపీపీ హేమలతకు చెందిన కారు అద్దాలను గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి గురువారం ఎంపీపీ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

News July 19, 2024

కృష్ణా: బంగారం దోచుకెళ్లిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

గుడివాడకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి వద్ద గోల్డ్ చైన్ దొంగిలించిన కేసులో నిందితుడు వెంకటేశ్వరరావు(37)కు న్యాయస్థానం 3ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. 2022 ఫిబ్రవరిలో ఆమె కోదాడ వెళుతుండగా.. ఆమెతో మాటలు కలిపిన నిందితుడు మత్తుమందు ఇచ్చి బంగారం దోచుకున్నాడు. వృద్ధురాలు కేసు నమోదు చేయగా విజయవాడ పోలీసులు ఛార్జిషీట్ వేయగా, గురువారం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. 

News July 19, 2024

గిరి ప్రదక్షిణ రోజు ట్రాఫిక్ ఆంక్షలు

image

సింహాచలం గిరి ప్రదక్షిణ పురస్కరించుకొని విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో రవాణా శాఖ ట్రాఫిక్ ఆంక్షలు జారీచేశారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనదారులకు విశాఖపట్నం సిటీ గుండా వెళ్లేందుకు అనుమతిలేదని తెలిపారు. ప్రత్యామ్నాయంగా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం గుండా ప్రయాణించాని సూచించారు. అలానే శ్రీకాకుళం వైపు నుంచి అనకాపల్లి రావాలని తెలిపారు.

News July 19, 2024

నెల్లూరు: పెరిగిన బస్సు టికెట్ ధరలు

image

నెల్లూరు సమీపంలో వెంకటేశ్వరపురం వద్ద బ్రడ్జి పనులు చేస్తున్నారు. దీంతో వాహనాలను కోవూరు, పడుగుపాడు మీదుగా నెల్లూరుకు మళ్లించారు. ఆత్మకూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు సైతం ఇదే దారిలో వెళ్లాల్సి ఉంది. అదనంగా 7 కిలో మీటర్లు ప్రయాణించి నెల్లూరుకు చేరుకోవాలి. దీంతో ప్రతి టికెట్ మీద రూ.10 అదనంగా వసూల్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

News July 19, 2024

ప.గో: సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు

image

ప.గో జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్య శాఖ సంయుక్త సంచాలకుడు ఆర్వీఎస్ ప్రసాద్ మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్ర అలలు ప్రమాదకరంగా ఉంటాయని తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. 

News July 19, 2024

గిరి ప్రదక్షిణ రోజు ట్రాఫిక్ ఆంక్షలు

image

సింహాచలం గిరి ప్రదక్షిణ పురస్కరించుకొని విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో రవాణా శాఖ ట్రాఫిక్ ఆంక్షలు జారీచేశారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనదారులకు విశాఖపట్నం సిటీ గుండా వెళ్లేందుకు అనుమతిలేదని తెలిపారు. ప్రత్యామ్నాయంగా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం గుండా ప్రయాణించాని సూచించారు. అలానే శ్రీకాకుళం వైపు నుంచి అనకాపల్లి రావాలని తెలిపారు.

News July 19, 2024

TPT: ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

image

తిరుపతి జిల్లాలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఐరాల మండలం రామతీర్థ సేవాశ్రమ ఎస్టీకాలనీకి చెందిన జయచంద్ర(38), నారాయణ(35), చుక్కావారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాగమల్లయ్య(14), మనోజ్ బైకుపై దామలచెరువుకు బయలుదేరారు. పాత అక్కగార్ల గుడి వద్ద ఎదురుగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. మనోజ్ మినహా మిగిలిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మనోజ్‌ను 108లో కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News July 19, 2024

నేడు కర్నూలులో జడ్పీ సమావేశం

image

కర్నూలులో నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి జడ్పీ సమావేశం ఇది. జిల్లాకు మినీ అసెంబ్లీ లాంటి ఈ సమావేశానికి సమావేశానికి మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలు, వివిధ శాఖలకు రావాల్సిన నిధులు, పేరుకుపోయిన బకాయిలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

News July 19, 2024

శ్రీకాకుళంలో నేడు జాబ్ మేళా

image

శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్ వద్ద స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలకు 18-35 ఏళ్లలోపు యువతీయువకులు అర్హులన్నారు. అలాగే పదోతరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 19, 2024

విజయనగర: ప్రజలకు విద్యుత్ శాఖ వారి సూచనలు

image

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన విద్యుత్ స్తంభాలను నేరుగా తాకరాదని విద్యుత్ శాఖ SE మువ్వల లక్ష్మణరావు సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా విద్యుత్ తీగలు మీద చెట్లు విరిగిపడిన, విద్యుత్ తీగలు తెగిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో విద్యుత్ పరికరాలను తడి చేతితో తాకవద్దన్నారు. విద్యుత్ ప్రమాదాలను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు గాని, 1912 టోల్ ఫ్రీ నంబరుకు తెలియజేయాలన్నారు.