Andhra Pradesh

News July 19, 2024

కృష్ణా: పర్యవేక్షక కమిటీల్లో సభ్యుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

SC, ST అత్యాచార నిరోధక చట్ట అమలుపై జిల్లా నిఘా, పర్యవేక్షక కమిటీలో నాన్ అఫిషియల్ సభ్యులను నియమించేందుకు అధికారులు అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షాహిద్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News July 19, 2024

కోనసీమ: ATM కార్డు కాజేసి.. రూ.40,600 చోరీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో రజా హుస్సేన్‌కు చెందిన ఏటీఎం కార్డును ఓ వ్యక్తి కాజేసి రూ.40,600 విత్ డ్రా చేశాడు. బాధితుడు గురువారం నగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుస్సేన్ ఖాతాలో బుధవారం రూ.50 వేలు జమయ్యాయి. ఏటీఎం నుంచి హుస్సేన్ రూ.10 వేలు డ్రా చేశాడు. అతనిని గమనిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి హుస్సేన్ ఏటీఎం కార్డు కాజేసి డూప్లికేట్ కార్డు ఇచ్చాడు. ఒరిజినల్ కార్డుతో మిగతా నగదు కాజేశాడు.

News July 19, 2024

కృష్ణా: ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పిన రైల్వే అధికారులు

image

ట్రాక్ పనుల కారణంగా గుంటూరు-విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేసిన నరసాపురం- గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను యధావిధిగా గుంటూరు వరకూ నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17282 నరసాపురం- గుంటూరు రైలును ఈ నెల 21, నం.17281 గుంటూరు- నరసాపురం రైలును ఈ నెల 22 నుంచి యధావిధిగా నడుపుతామన్నారు.

News July 19, 2024

మంచినీటి వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల

image

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు మున్సిపాలిటీ మంచినీటి సరఫరా విభాగ పథకంను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో రాష్ట్రంలో తాగునీటి వ్యవస్థ విధ్వాంసానికి గురైందన్నారు. దాదాపు 56 మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభంకాక కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. తాగునీటి కోసం కేటాయించిన రూ.5,350 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.

News July 19, 2024

పార్వతీపురం జిల్లాలో 401 గ్రామాల్లో స్ప్రేయింగ్

image

జిల్లా వ్యాప్తంగా 401 గ్రామాల్లో మలేరియా స్ప్రేయింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా మలేరియా అధికారి వై.మణి తెలిపారు. జూలై 15 నుంచి ఎంపిక చేసిన 401 గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో రక్త పరీక్షలు జరిపి వెంటనే చికిత్స జరిపేలా పీహెచ్సీ వైద్యాధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

News July 19, 2024

వరి నాట్లేసిన అరకు ఎంపీ, ఎమ్మెల్యే

image

హుకుంపేట మండలం అడ్డుమండలో గురువారం అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం పొలంలో నాట్లేశారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి కృషి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు సంక్షేమానికి విస్మరించిందని ఆరోపించారు.

News July 19, 2024

కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం: డీఎంహెచ్‌వో

image

జిల్లా ప్రజలు, వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి కుష్టు వ్యాధిని నిర్మూలిద్దామని నంద్యాల డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం వైద్య సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి టెక్కే వరకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.

News July 19, 2024

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

image

జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ సైనికుల సంఘం సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సైనికుల సమస్యలను తెలియజేయాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

News July 19, 2024

సీఎం నివాసం వద్ద భద్రత తనిఖీ చేసిన ఎస్పీ

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సతీశ్ కుమార్ తాడేపల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన భద్రతను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి నుంచి సచివాలయం వరకు దారి వెంట విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడి, వారి యెగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, తదితర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News July 19, 2024

రాజమండ్రిలో APEPDCL కంట్రోల్ రూం

image

తూ.గో జిల్లాలో ప్రస్తుత వర్షాలు, రాబోయే 3 రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలపై రాజమండ్రి- 0883-2463354, 73822 99960, ఏలూరు- 94409 02926 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆయా జిల్లాలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. SHARE IT..