Andhra Pradesh

News April 22, 2025

పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు: VZM SP

image

బొబ్బిలి PSలో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మోహన్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. పార్వతీపురం ఏకలవ్య స్కూల్లో చదువుతున్న బాలికకు తన మామయ్య ఫోన్ ఫే ద్వారా నగదు మోహన్‌కు పంపారని, డబ్బులు తీసుకొనేందుకు బాలిక బొబ్బిలికి రాగా రూమ్‌కి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. నేరం రుజువు కాగా శిక్ష ఖరారైందన్నారు.

News April 22, 2025

విశాఖ: మేడ మీద నుంచి పడి వివాహిత మృతి

image

మేడ మీద బట్టలు ఆరవేయడానికి వెళ్లి వివాహిత మృతి చెందిన ఘటన విశాఖలో సోమవారం చోటుచేసుకుంది. 61వ వార్డు ఇండస్ట్రీ కాలనీలో నివాసముంటున్న కోమలి తన ఇంటి మూడో అంతస్తులో బట్టలు ఆరవేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కళ్యాణి ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త శ్రీనుబాబు మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 22, 2025

రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లాలో 32,803 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 22, 2025

రేపే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 22, 2025

తుళ్లూరు: అక్కను హత్య చేసిన తమ్ముడికి యావజ్జీవ శిక్ష

image

తుళ్లూరు మండలం కొత్తూరు గ్రామంలో 2017లో జరిగిన ఆస్తి తగాదా హత్య కేసులో సోమవారం న్యాయస్థానం శిక్ష విధించింది. అక్కను హత్య చేసి, ఆమె కూతురిపై దాడి చేసిన షేక్ నాగుల్ మీరావాలికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.1000 జరిమానా, మరోసారి 307 సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణ చేసిన తుళ్లూరు మాజీ సీఐ సుధాకరరావు నేతృత్వంలోని బృందాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.

News April 22, 2025

అనంత జిల్లాలో చలివేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో నియోజకవర్గ వారిగా డెవలప్మెంట్ ప్లాన్‌ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో చలివేంద్రాలను అవసరమైన చోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత ఆర్ఓ వాటర్ సౌకర్యం కల్పించాలన్నారు.

News April 22, 2025

శ్రీకూర్మం: పుణ్యక్షేత్రంలో.. పాపం చేసింది ఎవరు..?

image

శ్రీకూర్మం గ్రామంలోని శ్రీ కూర్మనాధుని క్షేత్రంలో తాబేళ్లు మృతిచెందిన ఘటన సోమవారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాబేళ్లను ఆలయ శ్వేతపుష్కరని సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేయడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. పుణ్యక్షేత్రంలో పాపం చేసింది ఎవరు? తాబేళ్లు మృతిపై ఆలయ సిబ్బంది ఎందుకు గోప్యంగా ఉంచారు? దీని వెనుక కారణాలు ఏంటి.. కారకులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

News April 22, 2025

కృష్ణా : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు – DRO

image

కృష్ణా జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు.10 పరీక్షా కేంద్రాల్లో 4546 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.

News April 22, 2025

తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అమరావతి

image

అమరావతిని ప్రపంచంలో తొలి పునరుత్పాదక ఇంధన రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా చర్యలు వేగవంతం చేశారు. 2050 నాటికి 2,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో 1/3 పైకప్పు సోలార్ ప్యానెల్లకు కేటాయించనున్నారు. ప్రభుత్వ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు సోలార్ తప్పనిసరి. ఇప్పటికే 415 కిలోవాట్ల సోలార్ ప్యానెల్లు 16 కేంద్రాల్లో ఏర్పాటు అయ్యాయి.

News April 22, 2025

భీమవరం లాడ్జిలో పోలీసుల తనిఖీలు

image

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ రెసిడెన్షియల్ & లాడ్జిపై టూ టౌన్ సీఐ కాళీ చరణ్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో 9మంది అమ్మాయిలు, 9మంది అబ్బాయిలు ఉన్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లాడ్జి నిర్వాహకుడు అంతం శ్రీను పరారైనట్లు స్థానికులు తెలిపారు.