Andhra Pradesh

News July 19, 2024

ఏలూరులో APEPDCL కంట్రోల్ రూం

image

ఏలూరు జిల్లాలో ప్రస్తుత వర్షాలు, రాబోయే 3 రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలపై 94409 02926 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. SHARE IT..

News July 19, 2024

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

image

సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని, లింగ వివక్షతను చూపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షల నిర్మూలనపై కడప కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. బాలల లింగ నిష్పత్తిని గమనిస్తే.. బాలురతో పోలిస్తే బాలికల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఈ అసమానతలను తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచాలన్నారు.

News July 19, 2024

23న రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు

image

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్వీమ్స్) యూనివర్సిటీ నందు మెడికల్/ పారామెడికల్ విభాగంలో రీసెర్చ్ అసోసియేట్-01 పోస్ట్ కు ఈనెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఎమ్మెస్సీ నర్సింగ్/ MPT న్యూరో/ఎమ్మెస్సీ న్యూరో సైన్స్/ ఎమ్మెస్సీ న్యూరో ఫిజియాలజీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in/ వెబ్ సైట్ చూడగలరు.

News July 19, 2024

శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ ఏర్పాటు

image

3 రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం వెల్లడించారు. వాతావరణ శాఖ (ఐఎండీ) జిల్లాలో మరింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 08942-240557 (డిజాస్టర్ మేనేజ్ మెంట్) డీపీఎం ఫోన్ నంబర్ 7794082017ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News July 18, 2024

కృష్ణా జిల్లా TODAY TOP NEWS

image

* CM చంద్రబాబుపై కొడాలి నాని ట్వీట్
* కృష్ణా యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా శ్రీనివాసరావు
* మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ ఫైర్
* కృష్ణా: హత్య కేసులో ట్విస్ట్… హంతకురాలు తల్లే
* గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్
* విజయవాడ: CRDA పరిధిలో ఉద్యోగాలు
* గుడివాడ పోలీస్ స్టేషన్‌‌లో రాత్రి ప్రేమోన్మాది బీభత్సం
* విజయసాయిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి: బుద్ధా వెంకన్న

News July 18, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

➤ రేపు జిల్లాకు రానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్
➤ ఆవు పొట్టలో 70 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
➤ వినుకొండ ఘటన రాజకీయ హత్యే: ధర్మాన కృష్ణ దాస్
➤ శ్రీకాకుళం ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌కు దరఖాస్తులు ఆహ్వానం
➤ 9 నెలల్లో శ్రీకాకుళం స్టేడియం పనులు పూర్తి: అచ్చెన్న
➤ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి: మంత్రి అచ్చెన్న
➤ రాజేశ్ వీర జవాన్ పార్థీవ దేహం కోసం ఎదురుచూపులు
➤ జిల్లా ఎస్పీ రాధికకు ఆత్మీయ వీడ్కోలు

News July 18, 2024

ప.గో జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..

image

పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి 5.30 వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. తాడేపల్లిగూడెం 95.8, పెంటపాడు 71.6, పాలకొల్లు 62.2, నరసాపురం 54.6, భీమవరం 50.4, ఉండి 48.2, ఇరగవరం 46.4, పాలకోడెరు 45.2, మొగల్తూరు 34.6, అత్తిలి 33.2, ఆకివీడు 33.0, పెనుగొండ 32.4, గణపవరం 31.6, వీరవాసరం 31.4మి.మీ వర్షపాతం నమోదైంది. 20 మండలాల్లో 831.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.

News July 18, 2024

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వాతావరణ శాఖ హెచ్చరిక దృష్ట్యా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాలోని బత్తలపల్లి, ఎన్పీ కుంట, నల్లమాడ, కదిరి, ఓడీసీ, నల్లచెరువు, హిందూపురం ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుకున్నారు.

News July 18, 2024

ప.గో: మృతదేహాన్ని తరలిస్తున్న పడవ బోల్తా

image

దహన సంస్కారాలకు డెడ్‌బాడీని తరలిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటన ప.గో జిల్లా పాలకోడేరు మండలం కొండేపూడిలో గురువారం జరిగింది. గ్రామంలో ఓ వృద్ధుడు మరణించగా, మృతదేహన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లే క్రమంలో కాలువ దాటాల్సి వచ్చింది. వర్షాలకు ఉద్ధృతంగా ఉన్న ఆ కాలువ మీదుగా నాటు పడవలో డెడ్‌బాడీ తీసుకెళ్తుంటే ఒక్కసారిగా అది బోల్తా పడింది. అందరూ క్షేమంగా బయటపడగా.. కాలువపై వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News July 18, 2024

హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేసిన మదన్

image

గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కేంద్రంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన భార్యకు శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ ఆమె భర్త మదన్ కమిషనర్‌కు రాసిన లేఖ బట్టబయలు కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. తాజాగా గురువారం రాత్రి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను మదన్ కలిశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమెకు ఫిర్యాదు చేశారు.