Andhra Pradesh

News July 18, 2024

ఆంధ్ర కేసరి వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఆచార్య DVR మూర్తి

image

ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం(ఒంగోలు) ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా ఏయూ జర్నలిజం విభాగం సీనియర్ ఆచార్యులు డీవీఆర్ మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆచార్య మూర్తి ఏయూ పరీక్షలు విభాగం డీన్‌గా విధులను నిర్వహిస్తున్నారు. గతంలో ఈయన విదేశీ భాషలు విభాగాధిపతిగా, జర్మన్ సెంటర్ డైరెక్టర్, జర్నలిజం విభాగాధిపతిగా, బిఓఎస్ ఛైర్మన్‌గా పదవులు నిర్వహించారు.

News July 18, 2024

కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా విశ్వనాథకుమార్

image

డాక్టర్ YSR ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా జి.విశ్వనాథ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏ.యూ ఆర్కిటెక్చర్ విభాగం విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. విశ్వనాథ్ కుమార్‌ను ఇన్‌ఛార్జ్ వీసీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రేపు ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

News July 18, 2024

సరిహద్దులో గట్టి నిఘా చర్యలు చేపట్టాలి: కలెక్టర్ టీఎస్ చేతన్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎక్సైజ్, సెబ్ పోలీస్ అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా చర్యలు చేపట్టి నాటుసారా, మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల పూర్తి నిర్మూలనకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News July 18, 2024

కర్నూలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలు నియామకం

image

కర్నూలులో ఉన్న రెండు ప్రధానమైన యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాయలసీమ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్, డాక్టర్ అబ్దుల్ అక్ష ఉర్దూ యూనివర్సిటీకి కడప యోగి వేమన యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ పటాన్ షేక్ షాషావలి ఖాన్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

News July 18, 2024

కృష్ణా యూనివర్శిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా శ్రీనివాసరావు

image

కృష్ణా యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌(వీసీ)గా ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా JNTU కాకినాడలో EEE విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావును ఇన్‌ఛార్జ్ వీసీగా నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

News July 18, 2024

శ్రీకాకుళం: ఈ నెల 21న గ్రూప్-2 మాక్ టెస్ట్ 

image

ఎర్రన్న విద్యాసంకల్పం ద్వారా ఈ నెల 21న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. జిల్లా కేంద్రంలో విద్యాధరి డిగ్రీ కళాశాల, టెక్కలి విశ్వజ్యోతి కళాశాల, పలాస మదర్ థెరిసా పాఠశాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు https://bit.ly/YVSexam లింక్ ద్వారా పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 

News July 18, 2024

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: గుడివాడ

image

APలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదన్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి శ్రేణులు చేస్తున్న దమనకాండ రోజురోజుకు మితిమీరిపోతుందన్నారు. దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

News July 18, 2024

SV యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా అప్పారావు

image

SV యూనివర్సిటీకి ఇన్‌ఛార్జ్ VCగా అప్పారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పారావు SVUలో బయోకెమిస్ట్రీ ఫ్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా వి.ఉమను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమె సోషియాలజీ ఫ్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జులుగా నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

News July 18, 2024

ANU ఇన్‌ఛార్జ్ వీసీగా కంచర్ల గంగాధర్ నియామకం

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్(వీసీ)గా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గంగాధర్‌ను ఇన్‌ఛార్జ్ వీసీగా నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

News July 18, 2024

అనంత JNTU ఇన్‌ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ సుదర్శన రావు

image

అనంతపురం JNTU ఇన్‌ఛార్జ్ వీసీగా సీనియర్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శన రావు నియమితులయ్యారు. ఈయన ఇదే జేఎన్టీయూలోనే బీటెక్ (1979-83) పూర్వ విద్యార్థి కావడం విశేషం. గతంలో ఈయన తన మెరిట్ ప్రతిపాదన క్రింద జేఎన్టీయూ రెక్టార్‌గా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 2007లో ఏపీ ప్రభుత్వం నుంచి బెస్ట్ ప్రొఫెసర్ అవార్డును సైతం అందుకున్నారు.