Andhra Pradesh

News July 18, 2024

కృష్ణా: హత్య కేసులో ట్విస్ట్… హంతకురాలు తల్లే

image

పమిడిముక్కల మండలం తాడంకిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురువారం పోలీస్ స్టేషన్‌‌లో సీఐ కిషోర్ బాబు, ఎస్ఐ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. తాడంకి  గ్రామానికి చెందిన రాంబాబును పచ్చడి బండతో తలపై కొట్టి తల్లి హత్య చేసిందన్నారు. తాగిన మత్తులో పలుమార్లు తల్లిపై అసభ్యంగా ప్రవర్తించిన కుమారుడిని హత్య చేసిన తల్లి పద్మను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామన్నారు.  

News July 18, 2024

అసిస్టెంట్ కమిషనర్ అవినీతిపై కమిటీ వేస్తున్నాం: మంత్రి ఆనం

image

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కుమారిపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి కుమారి ఎంపీ విజయసాయి రెడ్డికి అనుకూలంగా పోస్టులు పెట్టారని అన్నారు.

News July 18, 2024

సిద్దవటం: పాము కాటుకు చిన్నారి మృతి 

image

సిద్దవటం మండలం మాచుపల్లిలో గురువారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కందుల భానుశ్రీ (7) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు చిన్నారి తల్లి లక్ష్మీదేవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. భానుశ్రీ నిన్న సాయంత్రం ఇంటి పక్కన తన చెల్లితో ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. కుంటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది.

News July 18, 2024

VZM: సింహచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహచలం గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20,21 తేదీలలో జరుగుతున్న గిరిప్రదక్షిణకు హాజరవుతున్న ప్రయాణికులకు APSRTC విజయనగరం డిపో నుంచి సింహచలం వరకు 40 ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు.

News July 18, 2024

సింహాచలం గిరి ప్రదక్షిణకు అనువంశిక ధర్మకర్తకు ఆహ్వానం

image

ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న సింహగిరి ప్రదక్షిణ ఉత్సవానికి హాజరు కావాలని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ మంత్రి అశోక గజపతి రాజును దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ఆహ్వానించారు. ఈ మేరకు విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఆయనను కలిసి ఉత్సవ ఏర్పాట్లను వివరించారు. అలాగే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 21న ఆలయంలో జరిగే చందన సమర్పణ వైదిక కార్యక్రమాలను తెలియజేశారు.

News July 18, 2024

KGHలో ఓపి తీసుకోవాలంటే ఈ యాప్ తప్పనిసరి

image

KGHలో వైద్యానికి వచ్చేవారికి abha యాప్ తప్పని సరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకుంటే మొబైల్ ఫోన్ ద్వారా టోకెన్ వస్తుంది. టోకెన్ నంబర్ చెబితే కౌంటర్‌లో ఓపి సీట్ ఇస్తారు. మొబైల్ ఫోన్ లేనివారు ఆధార్ కార్డుతో డైరెక్టుగా ఓపి తీసుకోవచ్చు. మొబైల్ యాప్ వినియోగం తెలియని వారికి స్థానికంగా స్టాఫ్ నర్సులు సహాయం అందిస్తారు.

News July 18, 2024

శాంతిభద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల వాయిదా

image

శాంతిభద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం నేటి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసే కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న శ్వేతపత్రాల్లో మిగిలిన మూడింటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేయనుంది.

News July 18, 2024

ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతి పెరిగింది. దీంతో బుధవారం కాటన్ బ్యారేజీ 175 గేట్లను 20 మి.మీ. మేర పైకెత్తి 93,244 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. వ్యవసాయ అవసరాలకు డెల్టా కాలువలకు 8,700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. అలాగే కాటన్ బ్యారేజీ వద్ద 10.65 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.

News July 18, 2024

బాపట్ల: మరమ్మతులు చేస్తుండగా తిరగబడ్డ JCB

image

బాపట్ల పట్టణంలోని త్రవ్వు కాలువ మరమ్మతులు చేస్తుండగా గురువారం JCB అదుపుతప్పి తిరగబడింది. ఒక్కసారిగా తిరగబడటంతో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 18, 2024

రేపు వినుకొండకు YS జగన్..?

image

రేపు వినుకొండకు YCP అధినేత జగన్ రానున్నట్లు తెలుస్తోంది. వినుకొండలో గత రాత్రి హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొంటారని సమాచారం. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వినుకొండకు చేరుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి బయలుదేరారు. రషీద్ మృతదేహాన్ని సందర్శించడానికి వెళ్లిన బొల్లాకు జగన్ కాల్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.