Andhra Pradesh

News July 18, 2024

మార్కాపురం: పరారైన ఖైదీ 

image

మార్కాపురంలో గురువారం ఓ రిమాండ్ ఖైదీ రైలు నుంచి దిగి పరారయ్యాడు.  విశాఖ నుంచి అనంతపురానికి తీసుకొస్తున్న క్రమంలో ఖైదీ పోలీసుల కళ్లు గప్పి  తప్పించుకున్నాడు. ఇతను గుత్తి మండలం పి.కొత్తపల్లికి చెందిన నరేశ్‌గా పోలీసులు తెలిపారు. గంజాయి రవాణా కేసులో ముద్దాయి అయిన నరేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

News July 18, 2024

VZM: ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఇంజినీరింగ్ ఫీజులు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి సీట్‌ల కేటాయింపు మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు జిల్లాల్లో సింహభాగం ప్రైవేటు, అన్ఎయిడెడ్ విద్యాలయాల్లో కనిష్ఠంగా రూ.40 వేలు ఖరారు చేశారు. గతేడాదిలో ఈ మొత్తం రూ.43వేలు ఉండేది. ఈ ఏడాది రూ.3 వేల వరకు తగ్గింది.

News July 18, 2024

విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా

image

విశాఖ ఉక్కు డైరెక్టర్ సురేశ్ చంద్ర పాండే తన పదవికి రాజీనామా చేశారు. 13 నెలల క్రితం భాధ్యతలు చేపట్టిన ఆయన అనేక వివాదాస్పద నిర్ణయాలతో కర్మాగానికి, కార్మికులకు ఇబ్బందులు కలిగించారని ఆరోపణ ఎదుర్కొన్నారు. కార్మిక నాయకులు ఉక్కు మంత్రిత్వ శాఖకు దీనిపై ఫిర్యాదులు చేశారు. ఈ నెల 19న స్టీల్ సెక్రటరీ, సీఎండీ కలిసి దీనిపై నివేదికను ఢిల్లీ బోర్డుకు పంపాల్సి ఉంది. అంతలోనే ఆయన రాజీనామా చేశారు.

News July 18, 2024

కమలాపురం: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

కమలాపురంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే గేటు సమీపంలోని పట్టాలపై వ్యక్తి డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

News July 18, 2024

సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు

image

ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని ఈనెల 20,21 తేదీల్లో సింహాచలంలో జరిగే సుప్రభాత సేవ, ఆరాధన, నిత్య కళ్యాణం, అష్టోత్తరం, సహస్రనామార్చన వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. ఈ తేదీలలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలి రానున్న నేపథ్యంలో నీలాద్రి ద్వారం నుంచి మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News July 18, 2024

నంద్యాల: ఆ రెండు రైళ్ల పునరుద్ధరణ

image

రైల్వే డివిజన్ పరిధిలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జులై 21 నుంచి నరసాపూర్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు – డోన్ ఎక్స్ ప్రెస్‌ను నడపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జులై 22 నుంచి డోన్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్, గుంటూరు-నరసాపూర్ ఎక్స్ ప్రెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే ప్రయాణికులు గమనించాలని కోరారు.

News July 18, 2024

గుంటూరు: బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన బాలిక శైలజ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లికి నిందితుడు నాగరాజుకు మూడేళ్లుగా పరిచయం ఉన్నట్లు సమాచారం. నిందితుడి ఇంట్లో మృతురాలి తల్లి ఇందిరమ్మ గాజులు దొరకడంతో నాగరాజుకు, ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న కోణంలో పోలీసులు ఇందిరమ్మను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

News July 18, 2024

ప్రకాశం: 21 నుంచి పలు రైళ్ల పునరుద్ధరణ

image

ప్రకాశం జిల్లా మీదగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. జులై 21 నుంచి రైలు నం.17282 నరసాపూర్-గుంటూరు ఎక్స్‌ప్రెస్, రైలు నం.17227 గుంటూరు-డోన్,  22 నుంచి రైలు నం.17228 డోన్-గుంటూరు ఎక్స్‌ప్రెస్, రైలు నం.17281 గుంటూరు-నరసాపూర్ రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News July 18, 2024

మిస్సైన వ్యక్తి పవన్ కళ్యాణ్‌కు రాసిన లేఖ వైరల్

image

ప.గో జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఒక ఫోన్లో డిప్యూటీ సీఎంకు రాసిన లేఖను పంపారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News July 18, 2024

చేబ్రోలు: బాలిక మృతి కేసులో నిందితుడికి నేర చరిత్ర

image

చేబ్రోలులో మైనర్ బాలిక మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు నాగరాజుకి నేర చరిత్ర ఉన్నట్లు నిర్ధారించారు. అతనిపై కొండపల్లి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఉన్నట్లు చెప్పారు. కొండపల్లి పరిధిలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెని హత్య చేసి పరారయ్యాడు. మరో మహిళతో సంబంధం పెట్టుకొని విభేదాలు రావడంతో హత్యాయత్నం చేశాడు. చేబ్రోలు వచ్చిన ఐదేళ్లలో 6 SIMలు మార్చాడని తేలింది.