Andhra Pradesh

News July 18, 2024

పెనుకొండ మండలంలో హత్య.. కారణం ఏంటంటే

image

పెనుకొండ మండలంలో హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. నిందుతుడు గంగాధర్‌కు మతిస్థిమితం లేదు. తనను చంపేందుకు తండ్రి మనుషులను పంపుతున్నాడని గతంలో పోలీసు‌లకు ఫిర్యాదు చేశాడు. హిందూపురానికి చెందిన చిరువ్యాపారి చిన్నఅంజినప్ప గుట్టూరులోని కొల్హాపురి ఆలయంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి గంగాధర్ ఆలయానికి వచ్చి తన తండ్రి తనను చంపేందుకే అంజినప్పను పంపాడని గొడవపడి తువాలుతో గొంతు బిగించి హత్య చేశాడు.

News July 18, 2024

తాళ్లూరు: బావిలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామానికి చెందిన మేడగం చంద్రశేఖరరెడ్డి(21) బుధవారం కాలుజారి బావిలో పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రశేఖరరెడ్డి పంజాబ్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవు నిమిత్తం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో పొలం వద్ద బావిలో నీరు తాగేందుకు దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 18, 2024

మలికా గార్గ్ ఉండి ఉంటే ఈ హత్య జరిగేది కాదు: అంబటి

image

వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి హత్య జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మలికా గార్గ్ పల్నాడు జిల్లా ఎస్పీగా ఉండి ఉంటే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదని ‘X’ లో పోస్ట్ చేశారు.

News July 18, 2024

ఎన్టీఆర్‌: టమాటా ధరల నియంత్రణకు చర్యలు

image

టమాటాల ధరలు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం నియంత్రణా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న టమాటాలకు కిలో రూ.56గా నిర్ణయించారు. అయితే నగరంలోని రైతు బజార్లకు 3 టన్నుల పైచిలుకు (119 ట్రేలు) ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. రైతుబజార్లలోని దుకాణదారులు సొంతంగా తెచ్చుకున్న వారి టమాటాల ధర రూ.80లుగా ఉంది. కొరత క్రమంలో ప్రభుత్వం మదనపల్లె ప్రాంతాల్లో నేరుగా కొనుగోలు చేసి మన మార్కెట్లకు తెస్తుంది.

News July 18, 2024

సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు

image

ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని ఈనెల 20,21 తేదీల్లో సింహాచలంలో జరిగే సుప్రభాత సేవ, ఆరాధన, నిత్య కళ్యాణం, అష్టోత్తరం, సహస్రనామార్చన వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. ఈ తేదీలలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలి రానున్న నేపథ్యంలో నీలాద్రి ద్వారం నుంచి మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News July 18, 2024

కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు

image

కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.85 ఉండగా 94 పైసలు తగ్గి నేడు రూ.108.91కు చేరింది. డీజిల్ 87 పైసలు తగ్గి నేడు లీటర్ రూ.96.80గా ఉంది. నంద్యాల జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.89 ఉండగా 20 పైసలు పెరిగి నేటికి రూ.110.09కు చేరింది. 18 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్‌ ధర రూ.97.87గా ఉంది.

News July 18, 2024

విశాఖ: పెరిగిన టమాటా ధర..

image

విశాఖలో టమాటా రేటు మరోసారి భారీగా పెరిగింది. వారం క్రితం కిలో రూ.40 కి విక్రయించిన టమాటా బుధవారం ఒక్కసారిగా కిలో రూ.67కి చేరింది. బయట మార్కెట్‌లో మరింత పెరిగి కిలో రూ.100 వరకు విక్రయిస్తున్నారు. మదనపల్లి మార్కెట్ ‌కు తక్కువ మొత్తంలో టమాటా రావడం వల్ల ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీపై టమాటాను రైతు బజార్‌లలో విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు.

News July 18, 2024

శ్రీకాకుళం జిల్లాలో 85.74 శాతం ప్రవేశాలు

image

ఉన్నత విద్యా మండలి ఇంజినీరింగ్ కళాశాల్లో సీట్ల అలాట్మెంట్‌ను బుధవారం ప్రకటించింది. ఏపీ ఈఏపీ సెట్-2024 ఎంపీసీ స్ట్రీమ్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఈ నెల ఒకటి నుంచి 13 వరకు ఆన్ లైన్‌లో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు ఇంజినీరింగ్ కళాశాల్లో 2154 సీట్లు ఉండగా 1847 సీట్లకు (85.74%) ప్రవేశాలు జరిగాయి. 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో సీట్లను భర్తీ చేశారు.

News July 18, 2024

ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసం పెంచేందుకు కృషి: ఎస్పీ

image

ప్రజలకు జవాబుదారీతనంతో చట్టానికి లోబడి పోలీసు యంత్రాంగం విధులు నిర్వర్తించాలని ఎస్పీ వెలిసెల రత్న పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి, ఇసుక అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంచుతూ సమన్వయంతో ముందుకెళ్తానన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.

News July 18, 2024

వేముల: 21న రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు

image

వేముల మండలం భూమయ్యగారి పల్లెలో ఈనెల 21న గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన ఎద్దుల యజమానులకు మొదటి బహుమతి లక్ష రుపాయలు, ద్వితీయ బహుమతి రూ.80,000లు, 3వ రూ.60,000లు, 4వ రూ.50,000, 5వ రూ.40,000లు, 6వ రూ.30,000లు, 7వ రూ.20,000 8వ బహుమతి రూ.10,000లు అందించనున్నట్లు తెలిపారు.