Andhra Pradesh

News July 18, 2024

బాలినేనికి మేయర్ షాక్ ఇస్తారా..?

image

ప్రకాశం జిల్లాలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత వ్యవహారం ఆసక్తి రేపుతోంది. వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆమె పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవల ఒంగోలుకు వచ్చిన మాజీ బాలినేని ఈ వార్తలను ఖండించారు. ఆమె వైసీపీలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆమె టీడీపీ ఎంపీ మాగుంటను కలిశారు. ఈక్రమంలో ఆమె బాలినేనికి షాక్ ఇస్తారేమోనన్న చర్చ జరుగుతోంది.

News July 18, 2024

నరసాపురం MPDOకి గుర్తుతెలియని వారి నుంచి ఫోన్ కాల్స్?

image

ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోదరుడు సునీల్ బుధవారం విజయవాడ కానూరులో నరసాపురం ఎంపీడీవో కుటుంబ సభ్యులను కలిశారు. అదృశ్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ వినియోగిస్తున్న ఫోనుకు గత కొద్దిరోజుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేశారని సమాచారం. కాల్స్ వచ్చిన ప్రతిసారీ నరసాపురంరమణారావు తీవ్ర ఆందోళన చెందేవారని తెలిపారు. ఇటీవల మెడికల్ లీవు తీసుకుని కానూరులోని ఇంటికి వెళ్లారన్నారు.

News July 18, 2024

ఉమ్మడి జిల్లాలో వైరల్ ఫీవర్‌ల కలకలం

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పట్టణ, పల్లె ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వసతిగృహాల నుంచి బాధితులు అధికంగా ఆసుపత్రుల బాటపడుతున్నారు. పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, సీతంపేట, పార్వతీపురం, మక్కువ, తదితర ప్రాంతాలలో జ్వర వ్యాప్తి ఎక్కువగా ఉంది. పార్వతీపురం జిల్లాలో 20 మంది చిన్నారులు మలేరియా, వైరల్ టైఫాయిడ్‌తో ఆసుపత్రిలో చేరారు.

News July 18, 2024

గూడూరు యువతిపై లైంగిక దాడి

image

గూడూరులో ఇంటర్ యువతిపై లైంగిక దాడి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఇంటర్ చదివే ఓ అమ్మాయి కాలేజీకి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా గూడూరు అశోక్ నగర్‌కు చెందిన వినయ్ కుమార్ యువతిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నాడు. గాంధీనగర్‌లోని ఓ ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో అసలు విషయం తెలిసింది. DSP సూర్యనారాయణ రెడ్డి విచారణ చేస్తున్నారు.

News July 18, 2024

అమిత్‌షా ఆదేశాలు.. పుంగనూరులో విచారణ

image

తనకు స్కాలర్‌షిప్ రాకుండా అడ్డుకున్నారని ఓ యువతి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. పుంగనూరు పట్టణానికి చెందిన ఉష SVUలో MSC చదువుతున్నారు. ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఉపకారవేతనానికి అర్హత సాధించారు. ఆమెకు విద్యా దీవెన వస్తుండటంతో వర్సిటీ అధికారులు స్కాలర్‌షిప్ ఇవ్వలేదు. సదరు యువతి అమిత్‌షాకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

News July 18, 2024

ఈనెల 21 నుంచి యథావిధిగా రైళ్లు నిలుపుదల

image

నారయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈనెల 19 నుంచి పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్ల‌లో నిలిపేదిలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రైల్వే అధికారులతో మాట్లాడారు. ప్రజల అవసరాల దృష్ట్యా రైళ్లను పిడుగురాళ్ల, నడికుడి రైల్వేస్టేషన్లలో నిలుపుదల చేయాలని కోరారు. రైల్వే అధికారులు స్పందించి ఈనెల 21 నుంచి 3 రైళ్లను నిలుపుదల చేస్తామని చెప్పారు.

News July 18, 2024

అనంత జిల్లాకు తుంగభద్రమ్మ రాక

image

తుంగభద్ర ప్రాజెక్టు నుంచి హెచ్చెల్సీకి ఈనెల 21 నీరు విడుదల చేయాలంటూ హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్ తుంగభద్ర మండలి ఎస్‌ఈకి బుధవారం ఇండెంట్ లేఖ పంపారు. 25వతేదీ వరకు 500 క్యూసెక్కులు, 26 నుంచి 31వరకు 750 క్యూసెక్కులకు పెంచాలని కోరారు. నీరు విడుదలచేస్తే 22కి జిల్లా సరిహద్దుకు చేరే అవకాశం ఉంది. ప్రధాన కాలువల ద్వారా కణేకల్లు చెరువుల్లోకి చేరి అక్కడ నుంచి ఏపీబీఆర్ జలాశయం, జీబీసీ కాలువకు ప్రవాహాలు కొనసాగుతాయి

News July 18, 2024

టెక్కలిలో నోటాకు ఓటెత్తారు

image

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలిలో నోటాకు రాష్ట్రంలోనే అత్యధికంగా 3.79% ఓట్లు పడ్డాయి. మొత్తంగా 7,342 మంది నోటాకు ఓటేశారు. ఈవీఎంలలో 3,660 మంది, పోస్టల్ బ్యాలెట్లలో 3,682 మంది నోటాకు జై కొట్టారు. పోలైన 1,93,713 ఓట్లలో అచ్చెన్న 55.71% ఓట్లు సాధించి టెక్కలిలో గెలిచారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన నివేదికలో వెల్లడించింది.

News July 18, 2024

వినుకొండలో దారుణ హత్య.. కారణాలివే.!

image

వినుకొండ ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్న షేక్ రషీద్ (25) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రషీద్ ముళ్లమూరు బస్టాండ్‌లోని మద్యం దుకాణంలో పని ముగించుకుని బయటకు రాగానే, బయట కాపు కాసిన ఏసీ మెకానిక్ జిలాని కత్తితో రషీద్‌పై దాడి చేశాడు. ఈ సంఘటనపై పల్నాడు ఏఎస్సీ లక్ష్మీపతి మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షలతోనే దాడి జరిగిందని గతంలో జిలానిపై రషీద్ దాడి చేసినట్లు చెప్పారు.

News July 18, 2024

విశాఖ: నిందితుడి ఫొటో విడుదల చేసిన పోలీసులు

image

పెదగంట్యాడ మండలం గొంతినవానిపాలెం యువతిపై దాడికి పాల్పడ్డ సిద్దు ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సిద్దు చేసిన దాడిలో యువతి తల్లి గాయపడి చికిత్స పొందుతోంది. గాజువాక పీఎస్‌లో క్రైమ్ నంబర్ 239/2024 పోక్సో కేసులో నిందితుడు సిద్దు జైలుకు వెళ్లి వచ్చాడు. పరారీలో ఉన్న నిందితుడి సమాచారం తెలియజేయాలని పోలీసులు కోరారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ 9440904309 నంబర్‌కి సమాచారం ఇవ్వాలన్నారు.