Andhra Pradesh

News July 18, 2024

విజయవాడ: CRDAలో పోస్టుల భర్తీకి ఆమోదం

image

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ.. సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ఈనెల 10న పురపాలక శాఖకు లేఖ రాశారు. దీనికి ఆమోదం తెలుపుతూ.. మూడేళ్ల కాలపరిమితితో 75 ఒప్పంద పోస్టులను, పొరుగుసేవల పద్ధతిలో 68 పోస్టులను నింపేందుకు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి GO జారీ చేశారు.

News July 18, 2024

యునివర్సిటీ లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

పులివెందులకు చెందిన ఓ విద్యార్థిని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. విద్యార్థిని SKUలో MBA రెండో సంవత్సరం చదువుతోంది. వసతి గృహంలో ఉరివేసుకుంటున్న ఆమెను చూసి తోటి విద్యార్థినులు కేకలు వేయడంతో ప్లంబింగ్ పనులు చేస్తున్న సిబ్బంది కాపాడారు. అనంతరం ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

News July 18, 2024

అగనంపూడి వద్ద మళ్లీ టోల్‌గేట్ ఏర్పాటు ?

image

అగనంపూడి వద్ద టోల్‌గేట్ మళ్లీ ప్రారంభించేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ టోల్‌గేట్‌ని తొలగించాలంటూ స్థానికులు కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా టోల్ వసూలుకు టెండర్‌లను ఆహ్వానించడం వివాదాస్పదంగా మారింది. ఏడాదికి రూ.81 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News July 18, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు

image

ఏలూరు రేంజ్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 111 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లాల్లో పని చేస్తున్న కొందరిని ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ప.గో జిల్లాలోని పలువురిని కృష్ణా జిల్లాకు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొందరు ఎస్సైలను కృష్ణా, ఏలూరు జిల్లాలకు స్థానచలనం కలిగించారు. NTR పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న పలువురిని ఏలూరు, ప.గో, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు బదిలీ చేశారు.

News July 18, 2024

VZM: 23 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అధికారుల సూచన

image

విజయనగరం జిల్లాలోని సీడీపీవో విభాగంలో 23 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఆ ఉద్యోగాలు ఇప్పిస్తామని రాజ్ కుమార్ అనే వ్యక్తి మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఐసీడీఎస్ పీఓ బి.శాంత కుమారి తెలిపారు. అటువంటి వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

News July 18, 2024

మదనపల్లెలో వడ్డీ వ్యాపారి హత్య

image

మదనపల్లె పట్టణం వీవర్స్ కాలనీలో వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లి రాముల గుడి వీధిలో ఉంటున్న నీరుగట్టి చెన్నారెడ్డి(65)ని వీవర్స్ కాలనీలోకి తీసుకెళ్లారు. అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఈ హత్య బుధవారం సాయంత్రం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

News July 18, 2024

నంద్యాల జిల్లాకు వర్ష సూచన

image

అల్పపీడనం ప్రభావంతో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News July 18, 2024

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం.. నీట మునిగిన పంట

image

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎల్ఎన్ పేట, తదితర మండలాల్లో వంద ఎకరాల పంటపొలాలు నీట మునిగాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభంలోనే ఇలా జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనం వేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదని, మొక్కదశలో ఉన్న పంట పొలాలు నీట మునగటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 18, 2024

మనసు చలించేలా రోడ్ల పై యాచిస్తూ వృద్ధురాలు

image

ఒకప్పుడు వృద్ధ మహిళ ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి పిల్లలను పోషించి ఉంటుంది. ఇప్పుడు సొంత పిల్లలకే ఆమె భారంగా మారి వీధిపాలయింది. మదనపల్లె పట్టణంలో బెంగళూరు రోడ్డులో కనుచూపు లేక, బక్క చిక్కిన శరీరంతో కడుపుకు పట్టేడు మెతుకుల కోసం ఎదురుపడే వారందరినీ యాచిస్తూ కనబడటం చలించివేస్తుంది. అనాధ ఆశ్రమాలైన ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకోవాలని పలువురు కోరుతున్నారు.

News July 18, 2024

మంత్రి నిమ్మలను కలిసిన ప.గో. నూతన SP

image

ప.గో. జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అద్నాన్ నయీం అస్మి బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడును పాలకొల్లులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంత్రికి పూలమొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల గురించి ఇరువురు కాసేపు చర్చించుకున్నారు.