Andhra Pradesh

News July 18, 2024

నేటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు: మంత్రి నాదెండ్ల మనోహర్

image

నేటి నుంచి ఈనెల 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీర మహిళ బాధ్యతగా పాల్గొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కోరారు. కొత్త సభ్యత్వ నమోదుతోపాటు, సభ్యత్వ రెన్యువల్ జరిగేలా, ప్రతి జనసైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఉద్దేశమన్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆలోచనను అమలు చేయాలని సూచించారు.

News July 17, 2024

ప్రమాద స్థాయికి డుడుమ జలాశయ నీటిమట్టం

image

ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ జలాశయ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,590 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 2,586 అడుగులుగా నమోదయింది. ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో డుడుమ జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది.

News July 17, 2024

విజయనగరం: తేలు కరిచిన కొన్ని గంటలకే మృతి

image

గుర్ల మండలం పున్నపురెడ్డిపేటకి చెందిన పున్నపురెడ్డి కనక నాయుడు అనే వ్యక్తి తేలు కాటుకు గురై మృతి చెందాడు. పొలంలో పని చేస్తుండగా తేలు కరిచిందని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు గంటల తరువాత చికిత్స పొందుతూ చనిపోయాడని గ్రామస్థులు తెలిపారు. ఇదిలా ఉంటే సంవత్సరం క్రితం అదే పొలంలో మృతుడి చిన్న కూతురు ఏదో విషపురుగు కరిచి చనిపోయింది. ఇప్పుడు మరొకరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 17, 2024

విశాఖ రేంజ్ డీఐజీని కలిసిన శ్రీకాకుళం ఎస్పీ

image

విశాఖపట్నం రేంజ్ నూతన డీఐజీగా బుధవారం బాధ్యతలు చేపట్టిన గోపీనాథ్ జెట్టిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు భేటీ అయ్యి శ్రీకాకుళంలోని పలు విషయాలను ఎస్పీ మహేశ్వర రెడ్డిని డీఐజీ అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీకి సూచించారు. ఎస్పీ వెంట జిల్లాలో పలువురు పోలీసు అధికారులు ఉన్నారు.

News July 17, 2024

రొట్టెల పండుగకు తొలిరోజు లక్షమందికి పైగా హాజరు: అధికారులు

image

నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగకు తొలి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శర్మద ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపట్టారు.

News July 17, 2024

విశాఖ: ‘రియాక్టర్ పేలడం వలనే ప్రమాదం’

image

అచ్యుతాపురం ఎస్ఈజెడ్ వసంత కెమికల్స్ కంపెనీ బ్లాక్-6లో బుధవారం ఉదయం 8.15 గంటలకు హలార్ కోటెడ్ ఆటో క్లేవ్<<13645975>> రియాక్టర్ పేలడం<<>> వలనే ప్రమాదం జరిగిందని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఒడిశాకు చెందిన ప్రదీప్ రౌత్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మృతుడు కుటుంబానికి రూ.35 లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు కంపెనీ అంగీకరించిందన్నారు.

News July 17, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం

image

సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. 1,800 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రభుత్వానికి ఏఏఐ వర్గాలు తెలిపాయి. ఆ శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో వేగంగా ఆచరణలోకి రావొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.

News July 17, 2024

రేపు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

image

అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 18, 19 తేదీలలో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం తెలిపింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాలలో పనిచేసే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండరాదని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

News July 17, 2024

VZM: డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

image

ఏయూ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును జులై 25వ తేదీ వరకు పొడిగించారు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 23 నుంచి 25 వరకు జరుగుతాయి. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు జులై 26 నుంచి 29 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి జులై 30న అవకాశం ఇచ్చారు. ఆగష్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుంది.

News July 17, 2024

YCP ఇసుకలో రూ.10 వేల కోట్లు దోచేశారు: MLA వరద

image

YCP ఐదేళ్ల పాలనలో ఇసుక దందాలో రూ.10వేల కోట్లు దోచేశారని ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. YCP పాలనలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుర్మార్గమైనదని దాన్ని రద్దు చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ MLA రాచమల్లు భూములను ఆక్రమించారన్నారు. ఇక్కడ ఇసుక డంప్ పెట్టేలా కలెక్టర్‌ను కోరుతామన్నారు.