Andhra Pradesh

News April 22, 2025

ఒంగోలు: ఆ విద్యార్థులకు నేడే చివరి గడువు

image

DELED 4వ సెమిస్టర్ విద్యార్థులు నేటి సాయంత్రంలోపు పరీక్ష ఫీజును చెల్లించాలని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి సాయంత్రం ఐదు గంటల లోపు రూ.250 పరీక్ష ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. రూ.250ఫైన్‌తో ఈనెల 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు.

News April 22, 2025

దొంగల కదలికల భయంతో నిద్రలేని గ్రామం

image

పెదనందిపాడు మండలానికి చెందిన పరిటలవారిపాలెం గ్రామంలో రెండు రోజులుగా దొంగల కదలికలతో గ్రామస్థులు భయంతో గడుపుతున్నారు. రాత్రివేళల్లో ఇంట్లోకి చొరబడి దొంగిలించేందుకు దొంగలు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి గ్రామస్థులు కర్రలు పట్టుకుని రాత్రి వేళ కాపలా కాశారు. పోలీసుల గ్రామానికి భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.

News April 22, 2025

నేడు జిల్లాకు జలవనరుల శాఖ మంత్రి పర్యటన

image

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం నుంచి మధ్యాహ్నం 1:30 కు రోడ్డు మార్గంలో బయలుదేరి 3:30 గంటలకు టెక్కలి చేరుకుంటారు. వంశధార ఎడమ ప్రధాన కాలువను పరిశీలిస్తారు. సాయంత్రం 5:30 కు శ్రీకాకుళం కలెక్టరేట్ చేరుకుంటారు. 6:30 గంటల వరకు అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు విశాఖపట్నం బయలు దేరుతారు. 

News April 22, 2025

ప్రకాశం: వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

image

ప్రకాశం జిల్లాలో వేర్వేరు ఘటనల్లో సోమవారం ముగ్గురు మృతి చెందారు. పామూరులో బాల భవేశ్ తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కాపురంలోని కాశీ రావు మానసిక స్థితి సరిగా లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామానికి చెందిన అరవింద్ చెన్నైలో చదువుకుంటూ నీటిలో మునిగి మృతి చెందాడు.

News April 22, 2025

నేటి నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో సమ్మర్ క్యాంప్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేడియంలో ఏప్రిల్ 22 నుంచి మే 31 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డీఆర్ఎం లలిత్ బోహ్రా సోమవారం తెలిపారు. 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజూ ఉదయం 12రకాల క్రీడలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో విశాఖలో నివసించే వారు అర్హులని అన్నారు. పూర్తి వివరాలకు రైల్వే స్టేడియంలో సంప్రదించాలన్నారు.

News April 22, 2025

పరారీలోనే కాకాణి..దక్కని రిలీఫ్

image

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ దక్కకపోవడంతో అజ్ఞాత వాసం కొనసాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సోమవారం హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటీషన్ విచారణ పరిధిని తేల్చే అంశాన్ని ధర్మాసనం ముందుపెట్టింది. మరోవైపు కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.

News April 22, 2025

పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్

image

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు మొబైల్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాధవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పోలీస్‌ సిబ్బందిపై దాడి కేసులో ఆయనను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News April 22, 2025

చిత్తూరు జిల్లాలో అలా చేస్తే జైలుశిక్ష

image

మామిడి కాయలను మగ్గించడానికి కాల్షియం కార్బైడ్ అమ్మడం, నిల్వ చేయడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని చిత్తూరు జేసీ విధ్యాధరి హెచ్చరించారు. ఎక్కడైనా తనిఖీల్లో కాల్షియం కార్బైడ్ పట్టుబడితే సెక్షన్ 44(ఏ) ప్రకారం 3 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తామని చెప్పారు.  ఎథిలీన్ గ్యాస్, ఎత్రెల్ ద్రావణాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.

News April 22, 2025

RJY: పోలీస్ సిబ్బందికి డ్రోన్ కెమెరాపై శిక్షణ 

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇకపై సాంకేతికత, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నరసింహ కిషోర్‌ అన్నారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఉపయోగిస్తున్న డ్రోన్‌ కెమెరాల ఆపరేటింగ్‌‌పై సిబ్బందికి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.

News April 22, 2025

VZM: డోనర్ అవసరం లేదు.. నేరుగా రండి..!

image

తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్ర‌స్తులు రెడ్‌క్రాస్ బ్ల‌డ్ బ్యాంకు నుంచి ఉచితంగా ర‌క్తాన్ని పొంద‌చ్చని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మ‌న్ ప్ర‌సాద‌రావు సోమవారం తెలిపారు. ర‌క్తం అవ‌స‌ర‌మైతే కంటోన్మెంట్ స‌మీపంలోని రెడ్ క్రాస్ బ్ల‌డ్ బ్యాంకును సంప్ర‌దించి అవ‌స‌ర‌మైన గ్రూపు ర‌క్తాన్ని పొంద‌వ‌చ్చన్నారు. డోన‌ర్ అవ‌స‌రం లేద‌ని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదన్నారు.