Andhra Pradesh

News July 17, 2024

శ్రీకాకుళం జిల్లాకు రేపు భారీ వర్షసూచన

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని కూర్మనాథ్ చెప్పారు.

News July 17, 2024

ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి: మంత్రికి వినతి

image

శ్రీకాకుళం జిల్లాలోని ఆశా కార్యకర్తలు బుధవారం మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.

News July 17, 2024

తిరుపతి: ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం

image

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను మీడియా ప్రతినిధులు బుధవారం తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద దగ్ధం చేశారు. మీడియా ప్రతినిధులను దూషించడం దారుణమని వారు చెప్పారు. మీడియాకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధి ఇలా దిగజారి మాట్లాడటం తగదని తెలిపారు. గిరిబాబు, భాస్కర్, శ్రీనివాసులు, లక్ష్మీపతి, హరిబాబు, ప్రవీణ్ కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

News July 17, 2024

రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు: ఎమ్మెల్సీ

image

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. విశాఖ వైసీపీ ఆఫీసులో బుధవారం సాయంత్రం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమై 12 రోజులు అవుతున్నా ఇప్పటికి మృతదేహం ఆచూకీ లభించలేదన్నారు. దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

News July 17, 2024

B.P.Ed, D.P.Ed పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పీజీ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి B.P.Ed, D.P.Ed 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగుతాయన్నారు.

News July 17, 2024

లోకేశ్ అన్నకి థాంక్స్: పరిటాల శ్రీరామ్

image

మంత్రి నారా లోకేశ్‌ను ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కలిశారు. ఉండవల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు శ్రీరామ్ తెలిపారు. ‘ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో చర్చించా. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఇరువురం మాట్లాడుకున్నాం. ప్రతి అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన లోకేశ్ అన్నకి ధన్యవాదాలు’ అని శ్రీరామ్ ట్వీట్ చేశారు.

News July 17, 2024

తిరుమల లడ్డూ తయారిపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: టీటీడీ

image

తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు తమకు నిర్దేశించిన వివిధ విధులను నిర్వహిస్తున్నారని వివరించింది.

News July 17, 2024

విశాఖ: డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పులు

image

ఏయూ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు జులై 25వ తేదీ వరకు పొడిగించారు. స్పెషల్ కేటగిరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 23 నుంచి 25 వరకు జరుగుతాయి. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు జులై 26 నుంచి 29 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి ఈనెల 30న అవకాశం ఇచ్చారు. ఆగష్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుంది.

News July 17, 2024

SKLM: ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షురాలిగా సంధ్య

image

ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఉద్యమ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలిగా సంధ్య గజపతిరావు చౌదరి బుధవారం నియామకం అయ్యారు. ఈ మేరకు విజయనగరంలోని ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆమెకు నియామక పత్రం అందజేశారు. ఈమె ఎచ్చెర్ల మండలంలోని సంతసీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో పలువురు ప్రశంసిస్తున్నారు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు చర్యలు చేపడతామని సంధ్య స్పష్టం చేశారు.

News July 17, 2024

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

image

అక్టోబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిల‌లో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. జూలై 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.