Andhra Pradesh

News July 17, 2024

రంప: విద్యార్థినికి లెక్చరర్ లైంగిక వేధింపులు.. కేసు

image

రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ రామకృష్ణపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ బుధవారం తెలిపారు. అదే కళాశాలలోని ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థిని శౌచాలాయానికి వెళ్లిన సమయంలో వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు.

News July 17, 2024

ప.గో.: బోరు నుంచి వింతశబ్దాలు.. రంగంలోకి సిబ్బంది

image

ప.గో. జిల్లా ఆచంట పంచాయతీ పరిధి కోనుపోతుగుంటలో బండి వెంకటకృష్ణకు చెందిన బోరు పైపు నుంచి గత రాత్రి వింత శబ్దాలు వచ్చాయని స్థానికులు ఆందోళన చెందిన విషయం తెలిసిందే. కాగా బుధవారం ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పైప్‌లో ఇసుక వేసి, బ్యాలెట్ పౌడర్‌తో భూమికి సమాంతరంగా పూడ్చివేశారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

News July 17, 2024

కర్నూలు జిల్లాలో మరోసారి చిరుత పులి పంజా

image

కర్నూలు జిల్లా కోసిగిలో బుధవారం చిరుత పులి సంచారం కలకలం రేపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాముడు అనే వ్యక్తి గొర్రెల మందను ఏర్పాటు చేసుకున్నాడు. తెల్లవారుజామున చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. గమనించిన రాముడు కేకలు వేయడంతో పారిపోయింది. కాగా చిరుత దాడిలో ఒక గొర్రెపిల్ల మృతిచెందింది. చిరుత పులి తరచూ దాడులు చేస్తోందని, తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

News July 17, 2024

రాచర్ల: పొలాల్లో పులి సంచారం

image

రాచర్ల మండలం ఫారం గ్రామ పరిసర పొలాల్లో చిరుతపులి సంచరించినట్లు ప్రజలు గుర్తించారు. గ్రామానికి చెందిన కొందరు పరిసర పొలాల్లో తిరుగుతుండగా పులి అడుగులను కనుగొన్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో ఎఫ్ఎస్ఓ జమాల్ బాషా, శ్రీనివాస్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పాదముద్రలను బట్టి పులి సంచరించినట్లు కనిపిస్తోందని, స్పాట్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

News July 17, 2024

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బాధ్యతల స్వీకరణ

image

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బుధవారం బాధ్యతల స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా గోపీనాథ్ జెట్టిని విశాఖ రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిత సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శించుకుని అనంతరం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 2008 బ్యాచ్‌కు చెందిన జెట్టి గతంలో చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించారు.

News July 17, 2024

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బాధ్యతల స్వీకరణ

image

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా గోపీనాథ్ జెట్టిని విశాఖ రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తొలుత సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శించుకుని అనంతరం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 2008 బ్యాచ్‌కు చెందిన జెట్టి గతంలో చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించారు.

News July 17, 2024

ఎచ్చెర్ల మండల వాసికి నేషనల్ గ్లోబల్ ఐకాన్ అవార్డు

image

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు(పీఎస్ఆర్) విద్యా, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా నేషనల్ గ్లోబల్ ఐకాన్ అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం వర్చువల్ విధానంలో ఆయనకు సర్టిఫికెట్ అందించారు.

News July 17, 2024

Way2News కథనం.. స్పందించిన MLA బండారు శ్రావణి

image

శింగనమల నియోజకవర్గం పుట్లూరులో 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంపై ఇటీవల Way2News స్పెషల్ స్టోరీ <<13523159>>పబ్లిష్<<>> చేసింది. ఈ వార్తకు స్పందించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి బుధవారం స్వయంగా కళాశాల భవనాన్ని పరిశీలించారు. ఆ భవనాన్ని ఎస్సీ వసతి గృహానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని సౌకర్యాలపై నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.

News July 17, 2024

108 వాహనంలో ప్రసవించిన మహిళ

image

సీతంపేట మండలం గడిగుజ్జి గ్రామానికి చెందిన గర్భిణి బిడ్డిక నిరోషాకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది గర్భిణిని వాహనంలో ఎక్కించి కొద్ది దూరం వచ్చేసరికి ఉమ్మ నీరు లీక్ అయ్యింది. గమనించిన ఈఎంటీ రామయ్య చాకచక్యంగా 108లోనే డెలివెరీ చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. తదుపరి సపర్యల కోసం దోనుభాయి పీహెచ్‌సీకి తరలించారు.

News July 17, 2024

ఖాజీపేట: దుక్కి దున్నాలంటే.. విద్యుత్ వైర్లు పట్టాల్సిందే!

image

ఖాజీపేట మండలంలోని కే.సుంకేసుల గ్రామంలో 11 కె.వి విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయి. పొలంలోకి వెళితే ఎప్పుడు ఏం జరుగుతుందో అని నిత్యం భయపడుతున్నామని రైతులు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. పొలం సాగు చేయలేకపోతున్నామని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.