Andhra Pradesh

News July 17, 2024

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు

image

సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ ఈనెల 20న ప్రారంభం కానుంది. 32 కి.మీ. మేర జరిగే ఈ ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 11 మెడికల్ క్యాంపులు, 290 తాత్కాలిక, 169 శాశ్వత మరుగుదొడ్లు, 100 సీసీ కెమెరాలు అమర్చారు. ప్రధాన కూడళ్లలో అంబులెన్సులను సిద్ధం చేస్తున్నారు. సమాచారం తెలిపేలా అనౌన్స్మెంట్ సిస్టం అందుబాటులో ఉంచారు.

News July 17, 2024

చిత్తూరు: పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

చిత్తూరు జిల్లాలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. కుప్పం నుంచి కేజీఎఫ్ బయల్దేరిన బస్సుకు శాంతిపురం మండలం రాళ్లబుదుగురు సమీపంలో ఎదురుగా ఓ బైకు వేగంగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News July 17, 2024

VZM: అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి

image

మక్కువ మండలం కన్నంపేటకి చెందిన ఆర్మీ జవాన్ తేలు దినేష్ (34) ఈనెల 12న సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురి కావటంతో చికిత్స కోసం విజయనగరం తీసుకొని వెళ్లారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 17, 2024

అనంత: ఎస్కేయూ వసతి గృహంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

అనంతపురం పట్టణంలోని ఎస్కే యూనివర్సిటీ వసతి గృహంలో మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. యువతి ఉంటున్న గదిలో ఫ్యాన్‌కి వేలాడుతుండగా అక్కడే ఉన్న గమనించిన తోటి విద్యార్థులు వెంటనే వెళ్లి కిందకు దించారు. విద్యార్థినిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మౌనిక ఎస్కే యూనివర్సిటీలో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. మౌనిక స్వగ్రామం పులివెందులని తోటి స్నేహితులు తెలిపారు.

News July 17, 2024

కాకినాడలో రామేశంమెట్టను తవ్వేశారు

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశంపేట పరిధిలోని రామేశంమెట్ట వార్తల్లోకెక్కింది. గుట్ట ప్రాంతంలో ఎర్రమట్టి తవ్వకాలు భారీ ఎత్తున జరిగినట్లున్న చిత్రాలు వైరల్‌గా మారాయి. గుట్టపై ఉన్న విద్యుత్ స్తంభాల చుట్టూ కొంతమేర మట్టి వదిలి.. వాటి చుట్టూ దాదాపు 50 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. తాజాగా అధికారులు ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.

News July 17, 2024

ప్రకాశం జిల్లా కొత్త ఎస్పీగా దామోదర్ బాధ్యతలు

image

ప్రకాశం జిల్లా కొత్త ఎస్పీగా ఆర్ దామోదర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ నాగేశ్వరరావుతో పాటు జిల్లాలోని పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు సిబ్బంది ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు.

News July 17, 2024

టెక్కలి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

టెక్కలి చేరివీధి సమీపంలో బుధవారం విద్యుత్ షాక్‌తో ఎన్డీఆర్ కాలనీకి బతకల పోతయ్య(58) అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికంగా ఉన్న ఒక గోడౌన్ మెడపైన పనిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ హై టెన్షన్ మెయిన్ లైన్‌కు తగిలి షాక్‌కు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటీన108లో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడికి భార్య జయ, సంతోష్, ఇంద్రజ అనే కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News July 17, 2024

BIG BREAKING: ముచ్చుమరి ఘటనలో CI, SI సస్పెండ్

image

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో వాసంతి కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను నందికొట్కూరు రూరల్ సీఐ ఓ.విజయ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ ఆర్.జయశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్.విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు.

News July 17, 2024

తిరునల్వేలి-షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

తిరునల్వేలి -షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18, 25 తేదీల్లో తిరునల్వేలిలో రాత్రి 1.50 గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా షాలిమార్ వెళుతుందన్నారు. షాలిమార్-తిరునల్వేలి ఈనెల 20, 27 తేదీల్లో షాలిమార్‌లో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు దువ్వాడ మీదగా తిరునల్వేలి వెళ్తుందన్నారు.

News July 17, 2024

నంద్యాల: ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2024 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సుధాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. http://nationalawardstoteacher.education.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.