Andhra Pradesh

News July 17, 2024

అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 30 నుంచి జరగాల్సిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా పడినట్లు, జేకేసీ కళాశాల క్యాంపస్ వర్సిటీ స్టడీ సెంటర్ సమన్వయకర్త పి గోపీచంద్ తెలిపారు. పీజీ ద్వితీయ పరీక్షలు ఆగస్ట్ 20 నుంచి 25 వరకు, పీజీ ప్రథమ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు జరుగుతాయని తెలిపారు. ఏపీ ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

News July 17, 2024

మన పామర్రు అమ్మాయి US మిసెస్ వైస్ ప్రెసిడెంట్?

image

US ప్రెసిడెంట్ ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న JD వాన్స్ భార్య ఉష చిలుకూరి తల్లిదండ్రులు పామర్రుకు చెందినవారు. ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మీ అమెరికా వలస వెళ్లగా 3వ సంతానంగా ఉష జన్మించారు. కాలేజీ చదువు అనంతరం వాన్స్‌ను ప్రేమించిన ఉష హిందూ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే మన జిల్లా అమ్మాయి ఉష USకి మిసెస్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు.

News July 17, 2024

నందిగాం: అధికారిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు

image

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ జగదీశ్వరరావు మృతదేహాన్ని తన సొంత గ్రామమైన నందిగాం మండలం వల్లభరాయుడుపేటకు ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. టెక్కలి నుంచి వల్లభరాయుడిపేట వరకు అంతిమ యాత్ర నిర్వహించి తమ బంధువుల సమక్షంలో అధికారిక లాంఛనాలతో వీర జవాన్‌కు తుది వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పాల్గొని సంతాపం తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 17, 2024

నెల్లూరు: తొలిరోజే బారాషహీద్ దర్గా కిటకిట

image

నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండగ ప్రారంభమైంది. తొలి రోజు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. బారాషాహిద్‌లను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా విచ్చేసిన భక్తులతో దర్గా పరిసరాలు జన సందడిగా మారిపోయాయి. ఈ ఏడాది సుమారు పది లక్షలు పైగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

News July 17, 2024

విశాఖ: పలు రైళ్లు రీ షెడ్యూల్

image

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో అప్పికట్ల-నిడుబ్రోలు-చుండూరు స్టేషన్‌ల మధ్య 3వ లైన్‌కు సంబంధించిన నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. మరికొన్ని దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని బయలుదేరే సమయాలు మార్పు చేయనున్నట్లు తెలిపారు. ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు గంటన్నర, రెండు గంటలు ఆలస్యంగా నడుస్తాయని తెలిపారు.

News July 17, 2024

చంద్రగిరిలో దొంగ ఓట్లపై సీఐడీ విచారణ

image

చంద్రగిరిలో దొంగ ఓట్లపై అప్పట్లో ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డి ఆఫీసు నుంచే ఒక్క రాత్రిలోనే దొంగ ఓట్లకు 10 వేల అప్లికేషన్లు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ల జాబితా తయారీ తిరుపతి RDO చేయాల్సినప్పటికీ.. చెవిరెడ్డి దగ్గర పనిచేసిన గూడూరు RDO ఇందులో కీలకంగా వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. ఈనేపథ్యంలో నిన్న CID అధికారులు తిరుపతి ఆర్డీవో, తుడా ఆఫీసులకు వెళ్లి వివరాలు ఆరా తీశారు.

News July 17, 2024

ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు: కలెక్టర్

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 24వ తేదీలోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి సూచించారు. ఎయిర్‌ఫోర్స్ అధికారి సందీప్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ వివరాలను వెల్లడించారు. అనంతరం రిక్రూట్మెంట్ మెటీరియల్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 17.5 నుంచి 21 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులు అర్హులని చెప్పారు.

News July 17, 2024

బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 30 నుంచి జరగాల్సిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా పడినట్లు, జేకేసీ కళాశాల క్యాంపస్ వర్సిటీ స్టడీ సెంటర్ సమన్వయకర్త
పి గోపీచంద్ తెలిపారు. పీజీ ద్వితీయ పరీక్షలు ఆగస్ట్ 20 నుంచి 25 వరకు, పీజీ ప్రథమ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు జరుగుతాయని తెలిపారు. ఏపీ ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

News July 17, 2024

సీ.ఎం.ఓ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా మార్కాపురం వాసి

image

మార్కాపురం పట్టణానికి చెందిన తంగిరాల యశ్వంత్ సీఎం కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన జమ్మలమడుగు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన అధికారిగా ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. ఈయన తల్లిదండ్రులు జగన్నాథం, శర్వాణి ఇద్దరూ ఉపాధ్యాయులు కావడం విశేషం.

News July 17, 2024

కృష్ణా జిల్లాలో తాపీ మేస్త్రి దారుణ హత్య

image

పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో గండికోట రాంబాబు(34) మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కర్రలతో తలపై కొట్టిన ఆనవాళ్లు కనిపించాయి. సంఘటనా ప్రదేశంలో మద్యం సీసా ఉండగా.. రాంబాబు తాపీ మేస్త్రిగా పని చేస్తారని తెలిపారు. ఈ విషయంపై పమిడిముక్కల పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.