Andhra Pradesh

News July 17, 2024

గుంతకల్లులో భార్య గొంతుకోసి హత్య.. వివరాలు

image

గుంతకల్లులో గొంతుకోసి భార్యను హతమార్చిన సంగతి తెలిసిందే. చిన్నపులికొండ రంగస్వామితో సాయితేజకు రేండేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. వీరికి 9నెలల పాప ఉంది. సోమవారం రాత్రి భార్యను అదనపుకట్నం తీసుకురావాలని కోరగా.. ఆమె ఒప్పుకోకపోవడంతో గొడవ జరిగింది. దీంతో సెల్‌ఫోన్ ఛార్జర్ వైరుతో భార్య గొంతు బిగించి కత్తితో గొంతుకోసి పాపతో పరారయ్యాడు. మెుహర్రం వేడుకల్లో ఉన్న యువకులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

News July 17, 2024

మెలియాపుట్టి: పెళ్లికి అంగీకరించలేదని యువకుడి ఆత్మహత్య

image

మండలంలోని సుందరాడ గ్రామానికి చెందిన బోరోడ మధు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాను ఓ అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పగా ఇటీవల కుమార్తె వివాహం జరగడం, అతని పెద్దమ్మ మృతి చెందడం, ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రస్తుతానికి కుదరదని చెప్పడంతో ఆగ్రహానికి గురై సోమవారం రాత్రి పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News July 17, 2024

నెల్లూరు: యువకుడిపై దాడి..ట్విస్ట్ ఏంటంటే?

image

తడలో యువకుడిపై దాడి కలకలం రేపింది. తునికి చెందిన సతీశ్ కుమార్ శ్రీసిటీలో పనిచేస్తున్నాడు. కాకినాడకు చెందిన మోనికకు పదేళ్ల క్రితం రవీంద్రబాబుతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విడిపోయిన ఆమె తడకు వచ్చి 4 నెలలుగా సతీశ్‌తో సహజీవనం చేస్తోంది. సతీశ్ డ్యూటీకి వెళ్తుండగా ఒకరు ఇనుప రాడ్‌తో దాడి చేసి పారిపోయాడు. అతని ముఖ కవలికల ఆధారంగా రవీంద్రబాబునే దాడి చేశాడని మోనిక అనుమానిస్తోంది.

News July 17, 2024

ఆస్ట్రేలియాలో కందుకూరు యువకుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో చనిపోయిన విషాద ఘటన ఇది. కందుకూరు పట్టణానికి చెందిన చైతన్య(29) గుంటూరులో బీటెక్‌ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్లాడు. గతేడాది వివాహమైంది. చైతన్యతో పాటు బాపట్లకు చెందిన సూర్యతేజ, మరో స్నేహితుడు కలిసి అక్కడి మిల్లామిల్లా జలపాతానికి వెళ్లారు. సూర్యతేజ జలపాతంలోకి జారిపడటంతో అతడిని కాపాడేందుకు చైతన్య దిగారు. ఇద్దరూ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు.

News July 17, 2024

నరసాపురం MPDO MISSING కారణం అదేనా..?

image

ప.గో జిల్లాలోని నరసాపురం MPDO వెంకటరమణారావు మిస్సింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. ‘ఈరోజు నా పుట్టిన రోజు.నేను చనిపోయే రోజు ‘అని కుటుంబీకులకు మెసేజ్ పెట్టాడని వారు తెలిపారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన అదృశ్యానికి మాధవాయిపాలెం ఫెర్రీ రేవు పాట కారణమని అనుమానిస్తున్నారు. ఈ రేవు నిర్వహణ బాధ్యత నరసాపురం అధికారులది. వేలం కోసం పాటదారులు రాకపోవడంతో ఆయన రూ.54 లక్షలు అప్పుపడ్డట్టు సమాచారం.

News July 17, 2024

అనంతపురం: ప్రసవం వరకు గర్భాన్ని దాచిన యువతి

image

డి.హీరేహాళ్ మండలంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఎస్ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి బెంగళూరుకు వెళ్లింది. అక్కడ అదే ఊరికి చెందిన యువకుడితో ప్రేమ మొదలై గర్భం దాల్చింది. దీంతో ఇంటికి వచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గర్భం కనపడకుండా దాచుకుంటూ వచ్చింది. నిన్న నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అవాక్కైన తండ్రి ఆ యువకుడితోనే పెళ్లి చేస్తామన్నారు.

News July 17, 2024

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం

image

గంజాయి మత్తులో భార్య, కూతురిని చంపాలనుకున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ పరిధిలోని కొత్తపేటలో ఉండే రాంపిళ్ల బాబీ(26) గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తాగడానికి డబ్బు ఇవ్వాలంటూ భార్యను చున్నీతో మెడకు బిగించి చంపేస్తానని బెదిరించేవాడు. ఒకరోజు డబ్బు ఇవ్వలేదని చిన్నారిని భవనంపైకి తీసుకెళ్లి 2 కాళ్లు తిరగేసి వేలాడదీశాడు. ఈ ఘటనలపై నిందితుణ్ని అరెస్ట్ చేశారు.

News July 17, 2024

రొట్టెల పండుగ కోసం ట్రాఫిక్ ఆంక్షలు

image

వాహన రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. • చెన్నై, బెంగళూరు, తిరుపతి నుంచి గూడూరు మీదుగా వచ్చే, పొదలకూరు రోడ్డు నుంచి వచ్చే బస్సులను అయ్యప్పగుడి సెంటర్ మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి, బీవీ నగర్, రామలింగాపురం, మార్కెట్ ఆర్టీసీకి మళ్లించారు. జొన్నవాడ వైపు నుంచి వచ్చే బస్సులను పుత్తా ఎస్టేట్, సెయింట్ జోసెఫ్ స్కూల్ మీదుగా మళ్లించారు. కేవీర్ పెట్రోల్ బంక్ నుంచి వెళ్లడానికి అనుమతి లేదు.

News July 17, 2024

విశాఖలో MLA తాలూకా అంటే బండి సీజ్

image

విశాఖలో ఇకపై పలానా MLA, మంత్రి తాలూకా అంటూ వాహనాలపై ఉంటే వాటిని సీజ్ చేస్తామని రావాణా శాఖ DTO జీసీ. రాజారత్నం హెచ్చరించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి వెహికిల్‌కి హై సెక్యూరిటీ నంబర్ మాత్రమే వేసుకోవాలని చెప్పారు. ఇటీవల వాహనాలకు పలానా MAL, మంత్రి తాలుకా అని నంబర్ ప్లేట్‌లపై రాసుకొని తిరుగుతున్నారని అటువంటి వాహనాలను సీజ్ చేసి, తగు చర్యలు తీసుకుంటామన్నారు.

News July 17, 2024

కర్నూలు: మరణంలోనూ వీడని స్నేహం

image

ఇద్దరూ స్నేహితులు మరణంలోనూ స్నేహబంధాన్ని వీడలేదు. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామానికి చెందిన సురేశ్(18), మణికుమార్(19) పత్తికొండ నుంచి సొంతూరుకు బయలుదేరారు. దూదేకొండ గ్రామ సమీపంలోని సుకాలి నాగమ్మ ఆలయం వద్ద ముందు వెళుతున్న ఎద్దుల బండిని ఢీకొట్టారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల తెలిపారు.