Andhra Pradesh

News July 17, 2024

తిరునల్వేలి-షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

తిరునల్వేలి -షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18, 25 తేదీల్లో తిరునల్వేలిలో రాత్రి 1.50 గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా షాలిమార్ వెళుతుందన్నారు. షాలిమార్-తిరునల్వేలి ఈనెల 20, 27 తేదీల్లో షాలిమార్‌లో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు దువ్వాడ మీదగా తిరునల్వేలి వెళ్తుందన్నారు.

News July 17, 2024

స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి

image

అనంతపురం జిల్లాలో దివ్యాంగులైన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల జిల్లా ఏడీ అబ్దుల్ రసూల్ తెలిపారు. 9,10వ తరగతులు, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఆపై చదువుతున్న దివ్యాంగులు www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 9,10 విద్యార్థులు ఆగస్టు 31, ఇంటర్ ఆపై విద్యార్థులు అక్టోబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 17, 2024

శ్రీకాకుళంలో ఈ నెల 19న జాబ్ మేళా

image

శ్రీకాకుళంలోని బలగ ప్రభుత్వ DLTC, ITI లో ఈ నెల 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్త లంక సుధా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి ఆపై విద్యా అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 17, 2024

రొట్టెల పండుగ పార్కింగ్‌ ప్రాంతాలివే

image

బెంగళూరు, చెన్నై వయా గూడూరు నుంచి వచ్చేవి జిల్లా ఆసుపత్రి ప్రాంగణం, సుబ్బారెడ్డి మైదానం దగ్గర నిలపాలి. కావలి వైపు వచ్చేవారు ఎస్‌వీజీఎస్‌ కళాశాల మైదానంలో కార్లు, ఆటోలు నిలపాలి. కడప నుంచి జొన్నవాడ మీది వాహనాలకు డీఎస్‌ఎన్‌ ఫంక్షన్‌ హాల్‌ పక్కన, ఇరుకళల పరమేశ్వరీ దేవస్థానం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం కేటాయించారు. రాపూరు మీదుగా వచ్చేవి తెలుగుంగ కాలనీ, పొదలకూరు రోడ్డులోని జడ్పీ బాలికల పాఠశాలలో నిలపాలి.

News July 17, 2024

కారంచేడు ఘటనకు 39 ఏళ్లు పూర్తి

image

కారంచేడు ఘటనకు నేటితో 39 ఏళ్లు పూర్తయింది. 1985 జులై 17న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో దేశమంతా కారంచేడు వైపు చూసింది. కారంచేడు అనే ఊరి పేరు ఒక్కసారిగా దేశమంతటా మారుమ్రోగింది. ప్రతి సంవత్సరం జులై 17న చీరాల మండల పరిధిలోని విజయనగర్ కాలనిలో కారంచేడు మృత వీరుల రుధిర క్షేత్రం వద్ద సంస్మరణ సభను పలువురు నిర్వహిస్తారు.

News July 17, 2024

ఆచంట: బోరు బావి నుంచి వింత శబ్దాలు

image

ప.గో జిల్లా ఆచంట మండలంలో చేతిపంపు నుంచి వింత శబ్దాలు రావడం కలకలం రేపింది. కోనపోతుగుంటలో పదేళ్ల కిందట బోరు వేశారు. 8 ఏళ్ల క్రితమే అది పూడిక చేసింది. తాజాగా నిన్న అదే బోరు నుంచి వింత శబ్దాలు, వాయువులతో బురద వచ్చింది. అగ్నిమాపక జిల్లా అధికారి బి.శ్రీనివాస్, సహాయ అధికారి వైవీ జానకీరాం, ఓఎన్‌జీసీ అధికారులు ఆ స్థలానికి వచ్చారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటామని ప్రజలు భయపడొద్దన్నారు.

News July 17, 2024

ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ స్థాయి ఉత్తమ టీచర్ అవార్డులు-2024కు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 21వ తేదీ వరకూ అవకాశం ఉందని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో పనిచేసే టీచర్లు, హెచ్ ఎంలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తు చేసిన తర్వాత వాటిని ధ్రువీకరణ అధికారితో ధ్రువీకరించి డీఈఓ ఆఫీస్లో అందజేయాలన్నారు.

News July 17, 2024

ఆ నోటిఫికేషన్‌ని రద్దు చేయాలి: ఈఏఎస్.శర్మ

image

బౌద్ధారామాల స్థలాన్ని కుదిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని విశ్రాంత IAS ఈఏఎస్ శర్మ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి దుర్గేశ్‌కు మంగళవారం లేఖ రాశారు. బౌద్ధారామమైన తొట్లకొండ 3,143 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. గత ప్రభుత్వం 2021లో బౌద్ధారామాల రక్షిత ప్రాంతాన్ని కేవలం 120 ఎకరాలకు కుదించే జీవోను నోటిఫై చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నారు.

News July 17, 2024

నెల్లూరు: పొగాకు విత్తనాలు సిద్ధం

image

రైతులకు 2024-25 పంట కాలానికి సంబంధించి పొగాకు విత్తనాలు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. సొంత నారుమడి పెట్టుకునే రైతులకు సీటీఆర్ రాజమండ్రి, కమర్షియల్ నారుమడి కోసం సీటీఆర్ కందుకూరులో పొగాకు విత్త నారను సరఫరా చేస్తామన్నారు. ఒక బ్యారన్ ‌కు 500 గ్రాములు రూ.600 చొప్పున కమర్షియల్ నారుమడికి కిలో రూ.1,8000 విక్రయిస్తున్నట్లు తెలిపారు.

News July 17, 2024

విశాఖలో బొకారో ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

image

ధన్ బాద్-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఏ2 సెకండ్ ఏసీ భోగికి స్ప్రింగ్ విరిగిపోయింది. రైలు విశాఖ స్టేషన్‌కు చేరుకునే సమయంలో జరగడంతో ఆవరణలో ఉన్న రోలింగ్ సిబ్బంది దానిని గుర్తించి సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. ప్రయాణికులను ఖాళీ చేయించి రైలు నుంచి బోగిని తొలగించారు. వేరొక బోగిని దానికి అమర్చారు. గంటన్నర పాటు రైలు స్టేషన్‌లో నిలిచిపోయింది.