Andhra Pradesh

News July 17, 2024

పామిడి: విద్యుత్ శాఖ లైన్‌మెన్‌లపై దాడి.. కేసు

image

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు లైన్‌మెన్లపై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేసిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు.. కరెంటు బిల్లుల వసూళ్లలో భాగంగా పామిడి మండలం దిబ్బసానిపల్లికి సీనియర్ లైన్‌మెన్ కృష్ణానాయక్, జూనియర్ లైన్‌మెన్ స్టీఫెన్ వెళ్లారు. ఆ సమయంలో రంగేశ్ వారిపై దుర్భాషలాడుతూ చెప్పులతో దాడికి తెగబడ్డినట్లు ఏఈ మధుసూదన్ రావుతో కలిసి పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 17, 2024

జమ్మలమడుగు: రూ.4 కోట్లు ఐపీ పెట్టిన వ్యాపారి

image

జమ్మలమడుగులో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్న ఓ వ్యాపారి రూ.4 కోట్లకు ఐపీ పెట్టి కనిపించకుండా పోయినట్లు స్థానికులు తెలిపారు. పదేళ్లుగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల వ్యాపారులతో నిందితుడు సన్నిహితంగా ఉండడంతో అతనికి వస్తువులను సరఫరా చేశారు. నెల రోజుల నుంచి స్టోర్ మూత వేసి ఉండటం, ఫోనుకు స్పందించకపోవడంతో సరకు ఇచ్చిన వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొంత మందికి నిందితుడు ఐపీ తాఖీదులు పంపాడు.

News July 17, 2024

పాఠశాల నుంచి వస్తున్న బాలికపై అత్యాచారయత్నం

image

ఉమ్మడి తూ.గో జిల్లా కాట్రేనికోన మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ నాగేశ్వరరావు వివరాల మేరకు.. ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి ఈనెల 12వ తేదీని పాఠశాలకు వెళ్లింది. ఆ బాలిక తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ చెప్పారు.

News July 17, 2024

విశాఖ: బొకారో ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

image

ధన్ బాద్-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఏ2 సెకండ్ ఏసీ భోగికి స్ప్రింగ్ విరిగిపోయింది. రైలు విశాఖ స్టేషన్‌కు చేరుకునే సమయంలో జరగడంతో ఆవరణలో ఉన్న రోలింగ్ సిబ్బంది దానిని గుర్తించి సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. ప్రయాణికులను ఖాళీ చేయించి రైలు నుంచి బోగిని తొలగించారు. వేరొక బోగిని దానికి అమర్చారు. గంటన్నర పాటు రైలు స్టేషన్‌లో నిలిచిపోయింది.

News July 17, 2024

నేడు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు

image

ముస్లింలకు పవిత్రమైన మొహర్రం పండుగతో పాటు తొలి ఏకాదశిని పురస్కరించుకొని నేడు కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ తెలిపారు. ఇప్పటికే వీటికి సంబంధించిన సర్కులర్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు పంపించామని ఆమె స్పష్టం చేశారు.

News July 17, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు

image

సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మూలపేటతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి. ఆశాఖ మంత్రిగా రామ్మోహన్ ఉండటంతో వేగంగా ఆచరణలోకి రావొచ్చనే చర్చలు ఊపందుకున్నాయి.

News July 17, 2024

నాగార్జున సాగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు

image

గుంటూరు జిల్లా నాగార్జున సాగర్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. నాగార్జున సాగర్‌తో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా ఇందుకోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి.

News July 17, 2024

అమరావతిని జాతీయ రహదారితో కలిపేలా ప్రణాళికలు

image

అమరావతి ప్రాంతాన్ని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ప్రణాళికలు రూపొందించింది. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ E-11,13లను జాతీయ రహదారి (NH-16)తో కలిపేలా CRDA అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కొండ అంచు నుంచి ఈ రోడ్లు నిర్మించేలా CRDA కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

News July 17, 2024

నేడు ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్ బాధ్యతలు

image

ప్రకాశం జిల్లాకు ఎస్పీగా నియమితులైన ఏఆర్ దామోదర్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈయన 2021 నుంచి ఇప్పటి వరకూ ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం పీటీసీ సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

News July 17, 2024

చిన్నారులతో ఏలూరు కలెక్టర్ ఆత్మీయ సమ్మేళనం

image

కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు కలెక్టరేట్‌లో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే నేరుగా తనకు ఫోన్ చేసి చెప్పాలని పిల్లలకు నంబర్ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన 19 మంది చిన్నారులకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పోస్టల్ పాస్ పుస్తకాలు అందజేశారు.