Andhra Pradesh

News July 17, 2024

తిరుపతి: IGNOUలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నందు 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ (UG), పిజి (PG), పీజీ డిప్లమా సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు తిరుపతి ప్రాంతీయ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు http://www.ignou.ac.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31.

News July 17, 2024

కుప్పం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు

image

చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కుప్పంతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు సూచించాయి.

News July 17, 2024

గల్ఫ్‌కు వెళ్లేవారికి ప.గో కలెక్టర్ సూచనలు

image

ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఏపీ లిమిటెడ్ ప్రతినిధులు, ఇతర అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ వలసలపై సమీక్షించారు. జిల్లాలో ఉపాధి మార్గాలు మెండుగా ఉన్నాయని, మహిళలు వాటిని సద్విని చేసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులకు దూరమై దూర ప్రాంతాలకు వెళ్లేవారు గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా మాత్రమే వెళ్లాలన్నారు. లేదంటే అక్కడ ఇబ్బందులు తప్పవన్నారు.

News July 17, 2024

దగదర్తి ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు

image

నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దగదర్తితో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు సూచించాయి.

News July 16, 2024

సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన సౌమ్యనాథుడు

image

నందలూరులో వెలసిన సౌమ్యనాథుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సౌమ్యనాథ స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు మాడవీధులలో విహరిస్తూ ఉంటే భక్తులు గోవింద నామాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

News July 16, 2024

ఎన్టీఆర్: అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పిన APSRTC

image

పౌర్ణమి గిరి ప్రదక్షిణకు అరుణాచలం వెళ్లే భక్తుల కోసం విజయవాడ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నామని సంస్థ అధికారులు తెలిపారు. జూలై 19న ఈ బస్సులు విజయవాడ, ఆటోనగర్ డిపోల నుంచి శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం మీదుగా అరుణాచలం వెళతాయన్నారు. ఈ బస్సు టికెట్లను APSRTC అధికారిక వెబ్‌సైట్ https://www.apsrtconline.in/లో బుక్ చేసుకోవచ్చన్నారు.

News July 16, 2024

భారత జట్టులో చోటు జిల్లాకు గర్వకారణం: కలెక్టర్

image

భారత్ బాస్కెట్ బాల్ టీంలో అనంతపురం నగరానికి చెందిన కే.ద్వారకనాథ్ రెడ్డికి చోటు దక్కడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ద్వారకనాథ్ రెడ్డి మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అతడిని వినోద్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

News July 16, 2024

గుంటూరు రేంజి పరిధిలో పలువురు సీఐల బదిలీలు

image

గుంటూరు రేంజ్ పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎక్కువగా పల్నాడు జిల్లాలోని వారికే స్థాన చలనం కలిగింది. మొత్తం 10మందిని ఐజీ బదిలీ చేయగా వారిని వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వులు పేర్కొన్నారు.

News July 16, 2024

కృష్ణా: ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కౌన్సిలింగ్ తేదీలు ఇవే 

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల కౌన్సిలింగ్‌ను ఈనెల 22 నుంచి నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య అమరేంద్ర కుమార్ తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయలలో, 24, 25 తేదీల్లో ఒంగోలు అభ్యర్థులకు ఇడుపులపాయలోనూ, 26,27 తేదీల్లో శ్రీకాకుళం అభ్యర్థులకు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 

News July 16, 2024

తిరుపతి : LLB ఫలితాలు విడుదల

image

తిరుపతి : శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 3/5 సంవత్సరాల ఎల్.ఎల్.బి (CBCS) 5,9 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.