Andhra Pradesh

News July 16, 2024

నరసాపురం MPDO మిస్సింగ్

image

ప.గో జిల్లా నరసాపురం ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎం.వెంకట రమణారావు కనిపించడం లేదంటూ ఆయన భార్య కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. జనవరి 24న వెంకట రమణారావు నరసాపురంలో విధుల్లో చేరారు. ఈ నెల 3న మెడికల్ లీవ్ మీద స్వస్థలానికి వెళ్లిన ఎంపీడీవో.. సోమవారం నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మిస్సింగ్‌పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 16, 2024

TTD JEOగా వెంకయ్యచౌదరి

image

తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. డిప్యూటేషన్‌పై ఏపీలో మూడేళ్లపాటు పనిచేయనున్నారు. వెంకయ్య చౌదరిని డిప్యూటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.

News July 16, 2024

ఎర్ర మట్టి దిబ్బల్ని నాశనం చేయకండి: బొలిశెట్టి

image

భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బల్ని నాశనం చేయొద్దని, అవి జాతీయ సంపద అని ప్రముఖ పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ ‘X’ వేదికగా అధికారుల్ని హెచ్చరించారు. దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ఎర్రమట్టి దిబ్బలు ముఖ్య భాగం అని గుర్తు చేశారు. ఇలాంటివి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయని, ఒకటి భీమిలిలోనిది కాగా రెండోది తమిళనాడులోని పేరి వద్ద ఉందన్నారు. వీటిని పరిరక్షించుకోవాలన్నారు.

News July 16, 2024

విశాఖలో ఇంటర్నేషనల్ స్నేక్ డే

image

పాములకు హాని చేయవద్దని ఏపీ సీసీఎఫ్(వన్యప్రాణులు) శాంతి ప్రియ పాండే కోరారు. విశాఖలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌లో మంగళవారం ప్రపంచ స్నేక్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా పాములను చంపవద్దని.. అన్ని పాములలో విషం ఉండదని తెలిపారు. పాములు కాటు వేస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.

News July 16, 2024

కృష్ణా: ప్రయాణీకుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా తిరునల్వేలి(TEN), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06087 TEN- SHM ట్రైన్‌ను జూలై 18, 25 తేదీలలో నం.06088 SHM- TEN ట్రైన్‌ను జూలై 20, 27 తేదీలలో నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.

News July 16, 2024

పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: డీఈవో

image

మొహర్రం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందని జిల్లా విద్యా శాఖాధికారి ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హిందువుల పండుగ తొలి ఏకాదశి, మొహర్రం రెండూ కలిసి రావడంతో సెలవును ప్రకటించిందన్నారు. స్పెషల్ క్లాసులు, స్టడీ హవర్స్ పేరిట పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 16, 2024

పులివెందుల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్

image

పులివెందులలోని మెడికల్ కళాశాల ముందు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఓ బైక్‌ను నేషనల్ హైవే పనులు చేస్తున్న క్యాంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో లింగాల మండలం పుట్టినంతల గ్రామానికి చెందిన కృష్ణయ్య, సింహాద్రిపురం మండలానికి చెందిన కిట్టయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 16, 2024

విద్యార్థికి ఆర్థిక సాయం అందజేసిన కలెక్టర్

image

చిత్తూరు సంతపేట బండ్ల వీధికి చెందిన టింపుల్ అనే విద్యార్థి 6వ తరగతి చదువుతోంది. టింపుల్ తల్లిదండ్రులు మరణించారని, తన చదువు, ఆరోగ్య సంరక్షణ కోసం తమను ఆదుకోవాలని కలెక్టర్ ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కోరారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద కలెక్టర్ సుమిత్ కుమార్ రూ.25 వేలును టింపుల్ కు ఆర్థిక సహాయం అందజేశారు.

News July 16, 2024

ప్రాణాలు కాపాడిన గుత్తి ప్రభుత్వ వైద్యులు

image

గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మంగళవారం గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన రోగికి క్షణం ఆలస్యం చేయకుండా ఇంజక్షన్ ఇచ్చి బతికించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన చిన్న ఓబులేసు అనంతపురం వెళ్తుండగా గుత్తి సమీపంలో ఛాతీ నొప్పికి గురయ్యారు. వెంటనే గుత్తి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప గుండెపోటును నివారించే ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించారు.

News July 16, 2024

ప్రాణాలు కాపాడిన గుత్తి ప్రభుత్వ వైద్యులు

image

గుండెపోటుకు గురైన నంద్యాల జిల్లా వ్యక్తికి క్షణం ఆలస్యం చేయకుండా వైద్యం అందించి గుత్తి డాక్టర్లు బతికించారు. డోన్ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన చిన్న ఓబులేసు అనంతపురం వెళ్తుండగా గుత్తి సమీపంలో ఛాతీ నొప్పికి గురయ్యారు. వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప గుండెపోటును నివారించే ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించారు.